NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Rajiv Gandhi assassination case: రాజీవ్ హత్య కేసులో సుప్రీం సంచలన తీర్పు ..పెరారివలన్ విడుదలపై ఎవరేమన్నారంటే..?

Rajiv Gandhi assassination case: మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దోషుల్లో ఒకరైన ఏజి పెరరివలన్ 30 ఏళ్లకు పైగా జైలు జీవితం గడిపిన నేపథ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద అసాధారణ అధికారాన్ని ఉపయోగించి విడుదలకు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో పెరారివలన్ కుటుంబ సభ్యులు, ఆయనకు మద్దతుగా నిలిచినవారు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ తో సహా పలు పార్టీల నేతలు సుప్రీం తీర్పు పట్ల తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన వెంటనే పెరారివలన్ సహా ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు భావోద్వేగానికి గురైయ్యారు. పెరారివలన్ నివాసానికి చేరుకున్న సన్నిహితులు సంబరాలు చేసుకున్నారు. పెరారివలన్ తన తల్లి అర్పుతమ్మాళ్ కు స్పీట్స్ తినిపించారు. తండ్రి కుయిల్‌దాసన్ తన కుమారుడి జైలు శిక్ష ముగియడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో తమిళ అనుకూల సంఘాల కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి సుప్రీం కోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాగా పెరారివాలన్.. ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.

Sensational verdict on Rajiv Gandhi assassination case
Sensational verdict on Rajiv Gandhi assassination case

Rajiv Gandhi assassination case: సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకం – సీఎం స్టాలిన్

పెరారివాలన్ విడుదలపై సీఎం స్టాలిన్ హర్షం వ్యక్తం చేశారు, ఆయన మీడియాతో మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకమైనదని అన్నారు.  జైలులోనే అతను 30 ఏళ్ల జీవితాన్ని కోల్పోయాడన్నారు. ఇప్పుడు అతనికి స్వేచ్చగా బతికే అవకాశం వచ్చిందన్నారు. అతను బాగుండాలని కోరుకుంటున్నానని స్టాలిన్ పేర్కొన్నారు. రాజీవ్ హత్య కేసులో దోషుల విడుదలకు కృషి చేస్తామని తమ పార్టీ మేనిఫెస్టోలోనే హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.  ఎండీఎంకే వ్యవస్థాపకుడు వైకో, పీఎంకే నేత రామ్ దాస్, సిపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా సహా రాజకీయ నేతలు సుప్రీం తీర్పును స్వాగతించారు.

మిగిలిన దోషులను విడుదల చేయాలి – అన్నా డీఎంకే

అనేక పార్టీలు సుప్రీం కోర్టు తీర్పును స్వాగతించగా డీఎంకే మిత్రపక్షమైన కాంగ్రెస్  విభేదించింది. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్ దీప్ సుర్జీవాలా సుప్రీం కోర్టు నిర్ణయం భాధాకరమని అన్నారు.  కొన్ని చట్టపరమైన అంశాల మేరకు కోర్టు పెరారివలన్ ను విడుదల చేసిందనీ, సుప్రీం కోర్టు తీర్పును తప్పుబట్టడం లేదని అయితే నిందితులు, హంతకులు అయిన వారు నిర్దోషులు కారని తాము గట్టిగా చెబుతున్నామని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కొన్ని వందల మంది తమిళులు రెండు దశాబ్దాలకుపైగా కటకటాల వెనుక మగ్గుతున్నారనీ, వారి విడుదలకు ఎవరూ ఎందుకు గొంతు ఎత్తడం లేదని ప్రశ్నించారు. వాళ్లు తమిళులు కాదా..? రాజీవ్ గాంధీని హత్య చేసిన వారు మాత్రమే తమిళులా..? అని అళగిరి ప్రశ్నించారు. రేపు ఉదయం తమ పార్టీ కార్యాలయంలో  ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకూ తమ నోటికి తెల్ల గుడ్డ కట్టుకుని తమ భావాలను వ్యక్తం చేస్తామని చెప్పారు. మరో పక్క ఈ రోజు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా రాజీవ్ హత్య కేసులో మిగిలిన ఆరుగురు నిందితులను విడుదల చేయాలని అన్నా డీఎంకే సమన్వయకర్త పళని స్వామి, కోఆర్డినేటర్ పన్నీర్ సెల్వంలు సంయుక్త ప్రకటనలో సుప్రీం కోర్టును కోరారు.

 

Related posts

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju