NewsOrbit
న్యూస్

Vijayasanthi: విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు విజయశాంతి కీలక సూచన..! ఏమిటంటే..?

Vijayasanthi: భారత రాష్ట్రపతి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార, విపక్ష పార్టీలు అభ్యర్ధుల ప్రకటన పూర్తి అయ్యింది. ముందుగా నిన్న మధ్యాహ్నం విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధిగా సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాను ప్రకటించగా, మంగళవారం రాత్రి అధికార ఎన్డీఏ అభ్యర్ధిగా జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్మును ఎంపిక చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా ప్రకటించారు. బీజేపీ పార్లమెంట్ బోర్డులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ తదితరులతో సమావేశం అయిన తరువాత బీజేపీ రాష్ట్రపతి అభ్యర్ధిగా ద్రౌపది ముర్మును ప్రకటించారు. జూలై 18న రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ నిర్వహించనుండగా ప్రస్తుతం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరుగుతోంది. ఈ నెల 27వ తేదీ ఉదయం 11.30 గంటలకు విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్ధిగా యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఎన్సీపీ నేత శరద్ పవార్ ఇప్పటికే ప్రకటించారు. ఈ తరుణంలో సినీ నటీ, బీజేపీ నాయకురాలు విజయశాంతి…విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు కీలక సూచన చేశారు.

Vijayashanthi Key suggestion to yashwant sinha on presidential poll
Vijayashanthi Key suggestion to yashwant sinha on presidential poll

Vijayasanthi: పోటీ నుండి తప్పుకోండి

ముర్ముజీ..ఒక ఉపాధ్యాయురాలు, గిరిజన మహిళ, ఆమెపై పోటీ కన్నా, సమర్ధిస్తేనే యశ్వంత్ సిన్హాజీ కూడా అభినందనీయులు అవుతారని పేర్కొన్నారు విజయశాంతి.  1998 నుండి కొన్ని సంవత్సరాల పాటు అటల్ జీ, అద్వానీజీ నాయకత్వంలో పని చేసిన సాటి కార్యకర్తగా యశ్వంత్ జీకి తన అభిప్రాయాన్ని గౌరవపూర్వకంగా తెలియజేస్తున్నానని అన్నారు. ఏకాభిప్రాయ నిర్ణయం రాష్ట్రపతి ఎన్నికకు మరింత విలువ తేగలదు కదా అని గుర్తు చేశారు. ప్రతిపక్షాలకు ఎటూ గెలుపు అవకాశాలు లేకపోవడం వాస్తవ దూరం కాదన్నది ఈ సందర్భంలో గమనార్హం అని పేర్కొన్నారు విజయశాంతి.

విపక్షాల అభ్యర్ధి యశ్వంత్ సిన్హా 2019 ముందు వరకూ బీజేపీలో కీలక నేతగా ఉన్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. బీజేపీ అగ్రనేత వాజ్ పేయికి అత్యంత సన్నిహితుడుగా పేరుంది. వివిధ రాజకీయ పక్షాల ప్రముఖులతో  ఆయనకు పరిచయాలు ఉన్నాయి. బీజేపీకి రాజీనామా చేసిన తరువాత యశ్వంత్ సిన్హా.. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరారు. టీఎంసీ ఉపాధ్యక్షుడుగా బాధ్యతలు నియమితులైయ్యారు.  రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న కారణంగా నిన్న ఉదయమే ఆయన పార్టీ ఉపాధ్యక్ష రాజీనామా చేశారు.

 

 

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju