NewsOrbit
న్యూస్

Karthika Deepam: నిజం తెలుకున్న సౌందర్య… ఇద్దరి మానవరాళల్లో ఎవరికి న్యాయం చేయనుంది..??

Karthika Deepam: బుల్లితేర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్. రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.గత ఎపిసోడ్‌లో హిమకు క్యాన్సర్ లేదు అని డాక్టర్ సౌందర్యకు చెప్పడంతో సౌందర్య ఒక్కసారిగా షాక్ అయి కోపంతో ఇంటికి వచ్చి హిమని కొట్టి, నిలదీసే సమయానికి నిరుపమ్, స్వప్నలు అక్కడకు వస్తారు.వాళ్ళని చూసి సౌందర్య కవర్ చేస్తూ సైలెంట్‌గా ఉంటుంది. స్వప్న మాత్రం ఎప్పటిలానే హిమని మాటలు అనే ప్రయత్నం చేస్తుంది. కానీ హిమ మాత్రం ఎప్పటిలాగా సైలెంట్ గా ఉండకుండా స్వప్నకు ఎదురు సమాధానం చెబుతుంది.ఈరోజు కూడా అదే సీన్ కంటిన్యూ అవుతుంది.

Karthika Deepam: స్వప్నకు మాటకు మాట సమాధానం చెప్పిన హిమ :

ఈ హిమ ఇప్పుడే ఇంత పొగరుగా ఉందంటే రేపు పెళ్లి అయ్యాక ఎలా ఉంటుందో అని నాలుగు మాటలు అనేసి స్వప్న,నిరుపమ్ ఇద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే వెంటనే సౌందర్య మళ్ళీ హిమని నిలదీయడం మొదలుపెడుతుంది. ‘నిజం చెబుతావా లేక కొట్టాలా’ అంటూ చేయి ఎత్తుతుంది కూడా. దాంతో హిమ నోరు విప్పుతుంది. ‘ఇదంతా సౌర్య కోసం చేశాను అనడంతో సౌందర్య, ఆనందరావులు ఇద్దరు కూడా షాక్ అవుతారు. నాన్నమ్మా నీ దగ్గర ఓ విషయం దాచాను. సౌర్య ఎవరో? ఎక్కదుందో నాకు తెలుసు అంటుంది హిమ. తెలిసిన ఎందుకు చెప్పలేదు అంటూ హిమను అడిగి తన ఫొటో ఉందా చూపించు’ అంటూ సౌందర్య అడుగుతుంది.

జ్వాలే సౌర్య అని తెలుసుకున్న సౌందర్య:

‘నాన్నమ్మా నీకు చాలా విషయాలు చెప్పాలి.. మనం ఓ చోటికి వెళ్దాం’ అనడంతో సౌందర్య సరే అంటుంది.‘సౌర్య ఆశ్రమానికి వెళ్తున్నా అని ఫోన్ చేసింది కదా అక్కడే ఉండి ఉంటుంది’ అని హిమ మనసులో అనుకుంటూ సౌందర్యతో పాటు అక్కడికి బయలుదేరుతుంది.జ్వాల ఆశ్రమం దగ్గర నిరుపమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో నిరుపమ్ కూడా వస్తాడు. అయితే జ్వాల మాత్రం ఎప్పటిలానే నిరుపమ్ చెప్పేది వినకుండా ఏదేదోమాట్లాడుతూ ఉంటుంది. దాంతో నిరుపమ్ సీరియస్ అయ్యి చూడు జ్వాల ‘నేను నిన్ను ప్రేమించడం లేదు అంటాడు.నాకు పెళ్లి కుదిరింది’ అంటూ మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో హిమ, సౌందర్యలు కాస్త దూరంలో ఆగి వాళ్ల మాటలు వింటూ ఉంటారు. ‘నిరుపమ్ ఏంటి తనతో అలా మాట్లాడుతున్నాడు’ అంటుంది సౌందర్య హిమవైపు తిరిగి. ‘తనే మన సౌర్య నాన్నమ్మా’అంటుంది హిమ. సౌందర్య షాక్ అయ్యి సంతోషిస్తుంది

హిమని ప్రేమిస్తున్న అని జ్వాలకు చెప్పిన నిరూపమ్ :

మన సౌర్య నిరుపమ్ బావని ప్రేమిస్తోంది’ అంటుంది హిమ సౌందర్యతో. వెంటనే సౌందర్య షాక్ అయిపోతుంది.ఇక జ్వాల ఏడుస్తూ మరి నా సంగతి ఏంటీ డాక్టర్ సాబ్?’ అంటుంది. ‘నీ సంగతి ఏంటి జ్వాలా? నేను ఎప్పుడైనా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పానా?’ అంటాడు నిరుపమ్ కోపంగా. ‘తాగిన రోజు.. చెప్పారు కదా డాక్టర్ సాబ్’అంటుంది జ్వాల. ‘అప్పుడు ఏదో అన్నానేమో కానీ.. జ్వాల ఐ లవ్యూ అని నేను ఎప్పుడైనా అన్నానా బాగా గుర్తు తెచ్చుకో’ అంటాడు నిరుపమ్.జ్వాల నీ మీద ఎప్పుడూ ప్రేమ లేదు.. ఉందని చెప్పలేదు’ అంటాడు.‘డాక్టర్ సాబ్ మీరు సరదగా అంటున్నారు కదా? ఇదంతా అబద్దం కదా చెప్పండి డాక్టర్ సాబ్ అంటూ నిరూపమ్ ని నిలదీస్తుంది.అంతా సౌందర్య, హిమ చాటుగా చూస్తుంటారు. వాళ్ళు కూడా సౌర్య మాటలు విని ఏడుస్తారు.

పాపం జ్వాల ప్రేమను కాదన్న నిరూపమ్ :

పాపం జ్వాల మాత్రం ఏడుస్తూ ఆటో నడుపుకునేదాన్ని నన్ను డాక్టర్ సాబ్ ఇష్టపడుతున్నాడేంట్రా అని చాలా పొంగిపోయాను. ఎవరు నన్ను ఒక్క మాట అన్నా మీరే అడ్డొచ్చారు. ఏంటి ఇదంతా? చెప్పండి డాక్టర్ సాబ్’ అని అరుస్తుంది సౌర్య ఏడుస్తూ. ‘అది ప్రేమ కాదు జ్వాల.. ఆకర్షణ మాత్రమే అంటాడు. ఇంతకీ మీరు పెళ్లి. చేసుకునేది ఎవరిని అంటే.నేను పెళ్లి చేసుకునేది మీ తింగరినే.. తననే నేను ప్రేమించాను.. చూడు జ్వాల నీది ఆకర్షణ మాత్రమే ప్రేమ కాదు’అంటాడు నిరుపమ్. ‘నాది ప్రేమ కాదు అని మీరెలా చెబుతారు. నాది ప్రేమే అంటుంది జ్వాల ఏడుస్తూ గట్టిగా అరుస్తూ. ‘జ్వాలా నీకు నువ్వు అన్నీ ఊహించుకుంటే అది నా తప్పు కాదు.. జీవితం అంటే ఊహలు కాదు జ్వాల.రక్తంతో బొమ్మ గీస్తే బొమ్మ వస్తుంది కానీ ప్రేమ రాదు జ్వాల అని వెళ్లిపోతాడు.. ఇక జ్వాల ఏడుస్తూ నువ్వు ఆ తింగరీ ఇద్దరూ అబద్దమే అని అరుస్తూ అక్కడే కూలబడి ఏడుస్తుంది జ్వాల. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో
సౌర్య ఇంటికి సౌందర్య వెళ్లి తనని ఓదార్చడం చూపిస్తారు. మరి సౌందర్య ఇద్దరు మానవరాళ్లలో ఎవరికీ న్యాయం చేస్తుందో చూడాలి.

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri