NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

కృష్ణానదికి మళ్లీ భారీగా వరద .. ప్రాజెక్టుల వరద ప్రవాహం ఇలా

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణానదికి వరద ఉదృతి అధికంగా ఉంది. శ్రీశైలం జలాశయానికి వరద ఉదృతి పెరిగింది. వరద ఉదృతి పెరగడంతో ప్రాజెక్టు అధికారులు తొమ్మిది గేట్లు పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇన్ ఫ్లో 3,50,341 క్యూసెక్కులు కాగా  ఔట్ ఫ్లో 3,14,293 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 888 అడుగులు కాగా  ప్రస్తుతం 884.80 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 216.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 214.9450 టీఎంసీలుగా కొనసాగుతోంది. ప్రాజెక్టు కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Flood Flow Srisailam Project

 

అదే విధంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు అధికారులు ఇప్పటికే 20 క్రస్ట్ గేట్లు పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. ఇన్ ఫ్లో 3,14,293 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 3,37,961 క్యూసెక్కులు కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 589.30 అడుగులుగా ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.040 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 309.9534 టీఎంసీలుగా కొనసాగుతోంది. మరో పక్క బుధవారం సాగర్ ఎడమ కాలువకు గండిపడింది. దీంతో నిడుమనూరు, నర్శింహులగూడెం గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ గ్రామాల్లో ఏడు అడుగల ఎత్తులో నీరు చేరడంతో ప్రజలు భయాందోళనకు గురై నివాసాలను వదిలి వీధుల్లోకి పరుగురు తీశారు. గ్రామాల్లోకి నీరు నీరు చేరడంతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

Nagarjuna Sagar
Nagarjuna Sagar

 

ఇక పులిచింతల నుండి ప్రకాశం బ్యారేజ్ కు వరద ప్రవాహం పెరుగుతోంది. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రకాశం బ్యారెజ్ వద్ద రాత్రిలోపు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారెజ్ కి ఇన్ ఫ్లో 1,25,626 క్యూసెక్కుల వస్తుండగా అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణానదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. వినాయక నిమజ్జన వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపి విపత్తుల సంస్థ ఎండీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సూచించారు. ప్రజలు వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని ఆయన తెలిపారు.

 

Related posts

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N