NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: కారును పోలిన గుర్తులు తొలగించాలంటూ టీఆర్ఎస్ నేతల ధర్నా .. చండూరులో ఉద్రిక్తత .. నేతల ఆరెస్టు

Breaking: మునుగోడు ఉప ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అధికారి టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారును పోలిన గుర్తులను ఫ్రీ సింబల్స్ జాబితా నుండి తొలగించాలని కోరుతూ ఆ పార్టీ ఇంతకు ముందు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. అయితే ఈసీ నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో తెలంగాణ హైకోర్టులో సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి అత్యవసర విచారణకు టీఆర్ఎస్ కోరింది. అయితే హైకోర్టు అత్యవసర విచారణకు స్వీకరించలేదు. రేపు ఈ పిటిషన్ ను విచారిస్తామని సీజే నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. అయితే ఈ రోజు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఎన్నికల అదికారులు వారి నిబంధనల మేరకు పోటీలో ఉన్న అభ్యర్ధులకు ఎన్నికల గుర్తుల కేటాయింపు ప్రక్రియ చేపట్టారు.

Munugodu By Poll TRS

 

దీంతో సోమవారం రాత్రి చండూరులో రిటర్నింగ్ కార్యాలయం వద్ద టీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. కారును పోలిన గుర్తులను తొలగించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యేలు భగత్, చందర్, ఎమ్మెల్సీ రవీంద్రరావు నేతృత్వంలో వందలాది మంది టీఆర్ఎస్ శ్రేణులు రిటర్నింగ్ కార్యాలయం వద్ద భైటాయించి ఎన్నికల సంఘానికి, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనతో చండూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.

Related posts

డల్లాస్‌లో ‘ సుస్వర మ్యూజిక్ అకాడమీ ‘ 21వ వార్షికోత్స‌వం.. అంబ‌రాన్నంటిన సంబ‌రాలు

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N