NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

కేరళ గవర్నర్ కీలక నిర్ణయం .. రాజీనామాలు చేయాలంటూ 9 మంది వీసీలకు ఆదేశం..రాజీనామా చేయనన్న కన్నూరు వర్శిటీ వీసీ

కేరళలోని తొమ్మిది విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ లు రాజీనామాలు చేయాలని ఆ రాష్ట్ర గవర్నర్ మొహమ్మద్ ఆరిఫ్ ఖాన్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. సోమవారం (నేడు) ఉదయం 11.30 గంటలకల్లా రాజీనామాలు అందించాలని గవర్నర్ కార్యాలయం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. కేరళలోని ఏపిజే అబ్దుల్ కలాం టెక్నాలాజికల్ యూనివర్శిటీ వీసీ నియామకం యూజీసీ నిబంధనలకు విరుద్దంగా ఉందంటూ ఇటీవల సుప్రీం కోర్టు ఆ నియామకాన్ని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని తొమ్మిది వర్శిటీల వీసీలు రాజీనామా చేయాలంటూ గవర్నర్ ఆదేశాలు జారీ చేయడం కేరళ అధికార, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. గవర్నర్ ఆదేశించిన 9 యూనివర్శిటీల్లో ఏపిజే అబ్దుల్ కలాం టెక్నలాజికల్ యూనివర్శిటీ కూడా ఉంది.

 

అయితే గవర్నర్ ఆదేశాలపై కన్నూరు యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ గోపీనాథ్ రవీంద్రన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తనకు గవర్నర్ ఆదేశాలు అందాయనీ, కానీ తాను రాజీనామా సమర్పించడం లేదని స్పష్టం చేశారు. ఆర్ధిక అవకతవకలు, చెడు ప్రవర్తన లాంటివి ఇక్కడ జరగలేదని ఆయన పేర్కొన్నారు. అవి బూటకపు ఆరోపణలుగా ఆయన తెలిపారు. ఇంతకు ముందు కన్నూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ గోపీనాథ్ రవీంద్రన్ నియామకంపై వివాదం తలెత్తగా కేరళ హైకోర్టు ఆయన పునః నియామకాన్ని సమర్పించింది. ఇక ఇతర యూనివర్శిటీల వీసీలు ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాలి.

కేరళ ప్రభుత్వం, రాజ్ భవన్ మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై గవర్నర్ మొహమ్మద్ ఆరిఫ్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం, లాటరీ వ్యాపారాన్ని ప్రధాన ఆదాయ వనరుగా చూస్తొందని కామెంట్స్ చేశారు. అంతే కాకుండా ఇది వింటుంటే తనకు సిగ్గుగా ఉందని వ్యాఖ్యానించారు. డ్రగ్స్ కు పంజాబ్ అడ్డా అని కానీ త్వరలోనే కేరళ దానిని దాటేస్తుందని కూడా గవర్నర్ మహమ్మద్ ఆరిఫ్ ఖాన్ విమర్శలు చేయడం ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య విభేదాలు బహిర్గతం అయినట్లుగా స్పష్టం అవుతోంది.

Related posts

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!