Unstoppable 2: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ “అన్ స్టాపబుల్” సెకండ్ సీజన్ కి రావడం తెలిసిందే. ప్రభాస్ తో పాటు గోపీచంద్ కూడా రావడం జరిగింది. డిసెంబర్ 30వ తారీకు ఈ ఏడాది ఆఖరిలో ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ క్రమంలో ఇటీవల ఆహా టీం ప్రభాస్ బాలయ్య…అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రోమో తాజాగా సరికొత్త రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. కేవలం మతి తక్కువ టైంలోనే నాలుగు మిలియన్ వ్యూస్… అందుకుందట.
“అన్ స్టాపబుల్” లో విడుదలైన ప్రోమోలలో ఇప్పటివరకు ఇంత తక్కువ టైంలో అంతా రీచ్ అయిన ప్రోమో… ప్రభాస్ దేనట. ప్రోమోలో బాలకృష్ణ భారీ స్థాయిలో కామెడీ పండించారు. ప్రభాస్ పెళ్లి గురించి ఇంకా సీక్రెట్ రిలేషన్స్ గురించి వేసిన ప్రశ్నలు ప్రోమోలో మంచి కామెడీని పండించాయి. ముఖ్యంగా రామ్ చరణ్ తో ఫోన్ కాల్ మాట్లాడటం… ఆ టైంలో ప్రభాస్ వేసిన డైలాగులు ప్రోమొలో చాలా హైలెట్ గా చూపించారు. ఇంకా రాణి గురించి.. డిస్కషన్ పెట్టడం అది ఒక సస్పెన్స్ గా మారింది. ఇదే సమయంలో ప్రభాస్ గోపీచంద్ ఒక హీరోయిన్ గురించి కూడా గొడవ పడినట్లు బాలకృష్ణ అడగటంతో… ఈ ఎపిసోడ్ చూడటానికి ఎంతగానో అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఇంకా ఇదే సమయంలో… గోపీచంద్ కెరీర్ గురించి కూడా పలు ప్రశ్నలు వేయడం జరిగింది. ఇంకా చివరిలో సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు గురించి ప్రభాస్ మాట్లాడిన సందర్భం తో పాటు బుజ్జి గాడు డైలాగులు చెప్పటం ప్రోమో … ఎపిసోడ్ పై మరింత ఇంట్రెస్ట్ కలిగించింది. ప్రభాస్ చాలా జాలీగా ప్రోమోలో కనిపించడం జరిగింది. దీంతో డిసెంబర్ 30వ తారీకు కోసం గోపీచంద్ మరియు ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?