NewsOrbit
న్యూస్

పరువు నష్టం కేసులో రాహుల్‌కు సమన్లు

పాట్నా: పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పాట్నా కోర్టు శనివారం సమన్లు జారీ చేసింది. మే 20వ తేదీన కోర్టు ఎదుట హాజరు కావాలని రాహుల్ గాంధీని ఆదేశించింది.

రాహుల్ గాంధీపై బీహార్ ఉప ముఖ్యమంత్రి, బిజెపి నేత సుశీల్ కుమార్ మోది పరువు నష్టం దావా వేశారు. ఈ నెల 18వ తేదీన పాట్నా చీఫ్ జ్యుడిషియల్ మెజిస్టేట్ కోర్టులో రాహుల్ గాంధీపై క్రిమినల్ కంప్లయింట్ దాఖలు చేశారు.

మోది అనే ఇంటి పేరు ఉన్న వారిని రాహుల్ గాంధీ అవమానించారని ఆయన ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఈ నెల 16వ తేదీన మహారాష్ట్రలో జరిగిన కాంగ్రెస్ ప్రచార సభలో రాహులా గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై నేడు విచారణ జరిపిన కోర్టు రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది.

‘అదేంటో.. దొంగలంతా మోది ఇంటి పేరుతోనే ఉన్నారు’ అని రాహుల్ గాంధీ మహారాష్ట్ర లోక్ సభ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యనించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే రాహుల్ గాంధీపై బిహార్‌లో శనివారం మరో కేసు నమోదైంది. సమస్తిపుర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ‘చౌకీదార్ చోర్‌ హై’ నినాదాన్ని పదే పదే ప్రజలతో చెప్పించారని న్యాయవాది సత్యవ్రత్ స్థానిక న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు.

రాహుల్‌‌తో పాటు సభకు హాజరైన ఆర్‌జెడి నేత తేజస్వీ యాదవ్‌, రెండు మీడియా ఛానళ్ల పేర్లను కూడా సత్యవ్రత్ ఫిర్యాదులో చేర్చారు. ఆ నినాదం చెప్పాలని ప్రజలను రాహుల్ గాంధీ కోరడంపై తాను తీవ్రమైన బాధకు గురయ్యాయని సత్యవ్రత్ తెలిపారు. దేశద్రోహం, ప్రజల్లో భయాన్ని కలగజేయడం వంటి సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేయాలని సత్యవ్రత్ కోరారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Leave a Comment