NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

జో బైడెన్ స్వగృహంలో ఎఫ్ బీ ఐ సోదాలు .. ఆరు రహస్య పత్రాలు స్వాధీనం

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమస్యల్లో చిక్కుకున్నారు. ఆయన నివాసంలో 13 గంటల పాటు ఫెడరల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీ ఐ) అధికారులు సోదాలు జరిపారు. విల్మింగ్డన్ లోని బైడెన్ స్వగృహంలో సోదాలు జరిపిన ఎఫ్ బీ ఐ అధికారులు ఆరు రహస్య పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకూ బైడెన్ వద్ద దాదాపు 12 రహస్య పత్రాలు బయటపడ్డాయి. ఈ రహస్య పత్రాల కేసును దర్యాప్తు చేయడానికి అటార్నీ జనరల్ గార్లాండ్ .. రాబర్ట్ హర్ అనే న్యాయవాదిని నియమించారు. బైడెన్ నివాసంలో సోదాలు జరిగిన విషయాన్ని బైడెన్ వ్యక్తిగత న్యాయవాది బాబ్ బాయర్ వెల్లడిస్తూ .. ఎఫ్ బీ ఐ అధికారులు బైడెన్ ఇంట్లో సోదాలు చేపట్టారనీ, ఆరు రహస్య పత్రాలను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. కొన్ని సెనేట్ లో బైడెన్ ఉన్నప్పటి పత్రాలు కాగా, మరి కొన్ని 2009 – 16 మద్య బైడెన్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పటివి అని తెలిపారు.

Joe Biden

 

న్యాయశాఖ జరుపుతున్న జరుపుతున్న దర్యాప్తునకు పూర్తిగా సహకరించమని బైడెన్ తమకు ఆదేశించినట్లు ఆయన వ్యక్తిగత న్యాయవాది రిచర్డ్ సౌరబ్ తెలిపారు. ఎఫ్ బీ ఐ సోదాల సమయంలో బైడెన్ గానీ, ఆయన భార్య గానీ ఇంట్లో లేరని చెప్పారు. అధ్యక్షుడి న్యాయవాదులు, వైట్ హౌస్ కౌన్సిల్ కార్యాలయం విచారణకు పూర్తిగా సహకరిస్తుందని ఆయన వెల్లడించారు. అమెరికాలో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు తదితర ఉన్నత స్థాయిలోని కొద్ది మందికి మాత్రమే రహస్య పత్రాలు అందుబాటులో ఉంటాయి. తమ పదవీ కాలం పూర్తి అవ్వగానే వాటిని అమెరికా జాతీయ అర్కైవ్స్ కు అప్పగించి వెళ్లాలనేది నిబంధన.

అయితే వాషింగ్డన్ డీసీలోని పెన్ బైడెన్ సెంటర్ లోని కార్యాలయ స్థలాన్ని ఖాళీ చేయడానికి అక్కడ ఉన్న బీరువాలో ఫైళ్లను అధ్యక్షుడి వ్యక్తిగత న్యాయవాదులు ప్యాక్ చేస్తుండగా కీలక రహస్య పత్రాలు బయటపడ్డాయి. 2017 నుండి 2020 అధ్యక్ష ఎన్నికల ప్రచారం మొదలయ్యే వరకూ ఈ కార్యాలయాన్ని బైడెన్ ఉపయోగించుకున్నారు. ఈ రహస్య పత్రాలు గత ఏడాది నవంబర్ 2నే బయటపడగా, అప్పుడే నేషనల్ అర్కైవ్స్ కు సమాచారం ఇచ్చామని బైడెన్ న్యాయవాద బృందం వెల్లడించింది.

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం .. తొమ్మిది మంది మృతి

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri