NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

మరో సారి గుండె నొప్పితో అస్వస్థతకు గురైన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి

వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి మరో సారి అస్వస్థతకు గురైయ్యారు. మర్రిపాడులోని తన నివాసంలో ఉండగా ఆయనకు గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే వైద్యులను ఇంటికి పిలిపించారు. ఇంటిలోనే ఆయనకు చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం మేకపాటిని చెన్నై తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

Mekapati Chandrasekar Reddy

 

గత నెలలో కూడా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు వచ్చింది. అప్పుడు రెండు వాల్వ్ లు బ్లాక్ అయినట్లు వైద్యులు గుర్తించి చికిత్స అందించడంతో ఆయన కోలుకున్నారు. అంతకు ముందు 2021 డిసెంబర్ నెలలోనూ చంద్రశేఖర్ రెడ్డి గుండెపోటుతో అస్వస్థతకు గురైయ్యారు. అప్పుడు బెంగళూరుకు తరలించి సర్జరీ చేసి స్టెంట్ వేసిన సంగతి తెలిసిందే. రెండు సార్లు గుండె పోటుకు గురై చికిత్సల ద్వారా కోలుకుంటున్న ఆయనకు తాజా రాజకీయ పరిణామాలు టెన్షన్ తెప్పిస్తున్నాయి.

ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారన్న అభియోగంతో పార్టీ అధిష్టానం ఆయనను సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేకపాటి వర్గం, వైసీపీ శ్రేణుల మధ్య మాటల యుద్ధం, సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. ఉదయగిరికి వస్తే తమిరేస్తామంటూ వైసీపీ శ్రేణులు సవాల్ చేయడంతో నిన్న సాయంత్రం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నేరుగా ఉదయగిరి బస్టాండ్ దగ్గరకు వెళ్లారు. అక్కడ రోడ్డుపై కుర్చీ వేసుకుని, ఎవరో తరిమేస్తానన్న వాళ్లు రావాలంటూ సవాల్ విసిరారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.  మేకపాటి చంద్రశేఖరరెడ్డి రెండు సార్లు కాంగ్రెస్ తరపున, రెండు సార్లు వైసీపీ తరపున ఉదయగిరి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం వైసీపీ నుండి సస్పెండ్ అయినందున స్వతంత్ర ఎమ్మెల్యేగా కొనసాగుతున్నట్లు ఇటీవల పేర్కొన్నారు.

టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత ..వైఎస్ఆర్‌టీపీ కార్యకర్తలతో సహా వైఎస్ షర్మిల అరెస్టు

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju