NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Delhi Liquor Scam Case: సీబీఐ విచారణకు హజరైన కేజ్రీవాల్ .. కేంద్రంపై కీలక కేజ్రీవాల్ వ్యాఖ్యలు

Delhi Liquor Scam Case:  ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు కేసులో సీబీఐ విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హజరయ్యారు. విచారణకు వెళ్లే ముందు కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన అరెస్టు గురించి బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని, సీబీఐని పూర్తిగా బీజేపీనే నియంత్రిస్తుందని ఆరోపించారు. తొలుత కేజ్రీవాల్ రాజ్ ఘాట్ కు వెళ్లి జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అరవింద్ కేజ్రీవాల్ వెంట పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ పాల్గొన్నారు.

arvind kejriwal

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ అడిగే ప్రశ్నలకు నిజాయితీగా సమాధానాలు చెబుతానని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. తాను ఏ తప్పు చేయలేదు కాబట్టి దాచిపెట్టేందుకు ఏమీ లేదని అన్నారు. తన అరెస్టునకు బీజేపీ ఆదేశాలు ఇచ్చిందని, సీబీఐ వాటిని తప్పక పాటిస్తుందని ఆరోపించారు. విచారణకు హజరైయ్యే ముందు కేజ్రీవాల్ వీడియో సందేశం విడుదల చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మరో పక్క కేజ్రీవాల్ ను సీబీఐ ప్రశ్నించనున్న నేపథ్యంలో ఢిల్లీలో ఆప్ నిరసనలకు పిలుపునిచ్చింది.

దీంతో ముందస్తు జాగ్రత్తగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సీబీఐ ప్రధాన కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. కేజ్రీవాల్ కు మద్దతుగా అప్ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. ఢిల్లీలోని కశ్మీరీ గేటు వద్ద ఆందోళనకు దిగిన కొందరు అప్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ, ఈడీ ఇప్పటికే పలువురు ప్రముఖులు, నేతలను అరెస్టు చేసింది. పలువురు ముఖ్యులను విచారణ చేసింది. తాజాగా ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ ను సీబీఐ విచారణ చేస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

వైఎస్ వివేకా హత్య కేసులో దూకుడు పెంచిన సీబీఐ సిట్.. వైఎస్ భాస్కరరెడ్డి అరెస్టు

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju