NewsOrbit
రాజ‌కీయాలు

‘ప్రజలు మీ సీటు మారుస్తున్నారు‘

అమరావతి: ప్రధాని మోదిని గంటకు ఒక డ్రస్ మారుస్తారు అంటూ చంద్రబాబు చేసిన విమర్శలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

‘మోది గారు గంటకో డ్రెస్ మారుస్తారో లేదో తెలియదు గానీ, నువ్వు మాత్రం ఊసరవెల్లి కన్నా ఘోరంగా రంగులు మారుస్తావ్. నిమిషానికి ఒక మాట మారుస్తావ్. నిజాయితీగా ఉండే అధికారుల సీటు మారుస్తావ్. ఎమ్మెల్యేలను కొని వాళ్ల పార్టీ మారుస్తావ్. అందుకే ప్రజలు ఈ ఎన్నికల్లో నీ సీట్ మారుస్తున్నారు.’ అంటూ ఘాటుగా కన్నా విమర్శలు చేశారు.

కాగా బిజెపి నాయకుడిగా మారిన మాజీ సీనియర్ ఐఎఎస్ అధికారి ఐవిఆర్ కృష్ణారావు కూడా చంద్రబాబుపై మరో మారు విమర్శలు చేశారు. విపక్ష నేతలా సీఎస్ వ్యవహరిస్తున్నారంటూ చంద్రబాబు చేసిన విమర్శలకు ఐవైఆర్ ట్విట్టర్ వేదిగా   స్పందించారు

‘ప్రధాన మంత్రితో ఢీ కొట్టాల్సిన స్థాయిలో ఉన్న నేత సిఎస్‌తో ఢీ కొట్టాలని చూడటం దురదృష్టకరం ఆయన ఒక సాధారణ అధికారి. తన ప్రమేయం లేకుండా సిఎస్ నియామకాన్ని ముఖ్యమంత్రి గారు జీర్ణించుకోలేకపోతున్నారు. ట్రాక్ రికార్డు చూడాలంటే అందరు రాజకీయ నాయకుల రికార్డులు, అధికారుల రికార్డులు చూస్తే బాగానే ఉంటుంది’ అని మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. అదే విధంగా వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌కు సెటైర్ వేశారు. ‘విపత్తులు వచ్చినా ప్రభుత్వం చూస్తూ కూర్చోవాలని నిబంధనల్లో ఉందా? ఈసితో తాడో పేడో తేల్చుకుంటా, మేం ఏమైనా ఉత్సవ విగ్రహాలమా?’ అంటూ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ చేసిన వ్యాఖ్యలపై ఐవిఆర్ ట్విట్టర్ వేదికగా  ‘మంచిది. ఆ తాడోపేడో ఈసితో త్వరగా తేల్చేసుకుంటే మాకీ కంఠశోష రోజు టీవిలో వినాల్సిన పేపర్లో చదవాల్సిన బాధ తప్పుతుంది‘ అంటూ సెటైర్ వేశారు.

Related posts

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

Leave a Comment