నిర్మాత, హీరో మంచు విష్ణు మరోసారి తండ్రి కాబోతున్నాడు. ఇప్పటికే ఆయనకు అరియానా, వివియానా, ఆరవ్ పిల్లలు. మూడోసారి విష్ణు తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. “ఇదొక స్పెషల్ మూమెంట్. చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. మాకెంతో ఫేవరేట్ ప్లేస్.. స్పెషల్ ప్రదేశం నుండి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. అరి, వివి, ఆరవ్ తర్వాత నాలుగో ఏంజిల్ రాబోతుంది“అని తెలిపిన విష్ణు. వినీతో ఉన్న ఫోటోలను పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో అందరూ విష్ణుకు అభినందనలు తెలుపుతున్నారు. విష్ణు తర్వలోనే ఓటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇది కాకుండా మరో రెండు సినిమాలను సిద్ధం చేసుకుంటున్నాడు.
previous post
next post
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!