NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: సంతోషంలో పద్మావతి కుటుంబం..కృష్ణ అరాచకాలకి అడ్డుకట్ట వేసినట్టేనా…

nuvvu-nenu-prema-30-may-2023-today-322-episode-highlights

Nuvvu Nenu Prema: స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే సీరియల్స్ లో మంచి TRP రేటింగ్స్ తో ముందుకు దూసుకెళ్తున్న సీరియల్ ‘నువ్వు నేను ప్రేమ’ ప్రతీ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ ఎంతో ఆసక్తికరంగా సాగుతూ నేటితో 322 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది.

nuvvu-nenu-prema-30-may-2023-today-322-episode-highlights
nuvvu-nenu-prema-30-may-2023-today-322-episode-highlights

నిన్నటి ఎపిసోడ్ లో,కృష్ణఎటువంటి వాడు పద్మావతి కుటుంబం ముందు భక్తా బయట పెడతాడు. భక్త వీల్ చైర్ లో నుంచి లేవడం తను మామూలు మనిషి అయిపోవడం పద్మావతి చాలా సంతోషంగా ఉంటారు.

ఈరోజు ఎపిసోడ్ లో,
పద్మావతి వాళ్ళ నాన్న, కృష్ణ గురించి అరవింద వాళ్ల ఫ్యామిలీలో చెప్పడానికి బయలుదేరుతాడు. ఇంకా మీరు ఇప్పటిదాకా ఇట్లా ఉన్నారు అని వాడు ఆగడాలు చేస్తూ వచ్చాడు. మీరు మామూలు మనిషి అయిపోయారు కదా వాడు మనం ఏమి చేయలేడు. అరవింద గారి ముఖం చూసిన మనం వాడిని వదిలేయాలి అని ఇంట్లో వాళ్ళందరూ చెప్పడంతో, భక్త కూడా సరే అని ఒప్పుకుంటాడు. కానీ వాడు దుర్మార్గుడు ఎప్పటికైనా నీకు హాని తల పెట్టాలని చూస్తాడు. అప్పుడు మాత్రం వాడిని వదిలిపెట్టను అని భక్త పద్మావతి తో అంటాడు.ఇక పద్మావతిని, ఆండాలు విక్కీ వాళ్ళ ఇంట్లో జరిగే, పందిళ్ళ కార్యక్రమానికి వెళ్ళమని చెప్తుంది. భక్త నువ్వు కూడా వెళ్ళు ఇంకా ఆరోగ్యం బాగు పడింది అని తెలిస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు అని ఆండాలు అంటుంది. ఇక పద్మావతి వాళ్ళ నాన్న అమ్మతో కలిసి విక్కీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది.

nuvvu-nenu-prema-30-may-2023-today-322-episode-highlights
nuvvu-nenu-prema-30-may-2023-today-322-episode-highlights

విక్కీ వాళ్ళ ఇంటికి వెళ్లిన భక్త..

విక్కీ వాళ్ళింట్లో పందిళ్లు వేయడం కోసం గుంట తవ్వుతూ ఉంటారు. సిద్దు అదే టయానికి, ఫోన్ మాట్లాడుతూ వచ్చి ఆ గుంటలో పడిపోతాడు. ఇంట్లో వాళ్ళందరూ వెంటనే పరిగెత్తుకుంటూ వస్తారు.ఏమైందిరా ఎందుకు అలా అరిచావు అని అడుగుతారు. నేను ఫోన్ మాట్లాడుతూ వస్తుంటే ఈ గుంట చూడక పడ్డాను అని చెప్తాడు సిద్దు. ఇది ఎవరు కావాలని ఇక్కడ తీశారు అని అడుగుతాడు. ఈరోజు అను, ఆర్యా లపెళ్లిపనులు మొదలుపెట్టబోతున్నాము. దానికి ముందుగా ఇక్కడ పందిరి నాటుతారు. పద్మావతి వాళ్లు వస్తున్నారా అని అరవింద్ అడుగుతుంది, వాలి బయలుదేరిపోయారు దారిలో ఉన్నారు అని చెప్పేలోపే, ఇంటి ముందు కారు ఆగుతుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. పద్మావతి వాళ్ళ నాన్న కారు దిగి రావడానన్ని, అందరూ అరే ఈయనకి నయం అయిపోయిందా అని అలానే, ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. కృష్ణ మాత్రం చాలా కంగారుగా, వెనుక వెనుక ఉంటాడు.ఇది ఎలా సాధ్యమైంది అండి అని అడుగుతాడు సిద్దు. ఇదంతా దేవుడి దయ అండి, నా కుటుంబం చూపించిన ప్రేమ వల్లే నేను ఇలా రికవరీ అయ్యాను అని చెప్తాడు భక్త. అందరూ మీరు ఇలా పందిరి గుంజ నాటిన రోజే బాగైపోవడం చాలా మంచి శుభ శకునం అని అనుకుంటూ ఉంటారు. అరవింద ఇక అను, ఆర్యా ల పెళ్ళికి ఆటంకం లేదు. ఇక దేవుడు అంతా మంచే చేస్తాడుఅని అరవింద అంటుంది.

nuvvu-nenu-prema-30-may-2023-today-322-episode-highlights
nuvvu-nenu-prema-30-may-2023-today-322-episode-highlights

విక్కీ మాటలకు భయపడిన కృష్ణ

పద్మావతి వాళ్ళ అమ్మ, దేవుడి దయ ఉండబట్టేనండి ఈరోజు పద్మావతి మెడలో ఆ నీచుడు, తాళి కట్టాలని ట్రై చేసిన ఆగిపోయింది. తాళి కట్టాలని చూసాడా అంటే వాడు మళ్ళీ వచ్చాడా అని అడుగుతారుకుచల భర్త అడుగుతాడు. అవునా అన్నయ్య గారు ఆ నీచుడు మళ్ళీ వచ్చాడు. పద్మావతి మెడలో బలవంతంగా తాళి కట్టబోతే, మా వారు కాపాడారు అని చెప్తుంది పద్మావతి వాళ్ళ అమ్మ. విక్కీ కోపంగా వాడి మళ్లీ వస్తే మీరంతా ఏం చేస్తున్నారు నాకు ఫోన్ చేయకుండా, ఏం పద్మావతి నీకు కూడా నాకు ఫోన్ చేయాలనిపించలేదా, ఒక ఫోన్ చేసినట్లయితే నేను వచ్చి వాన్ని షూట్ చేసేవాడిని అని విక్కీ అరుస్తాడు. అప్పుడు కృష్ణ చాలా టెన్షన్ పడుతూ వీళ్ళు ఎక్కడ నా పేరు చెప్పేస్తారు అని భయపడుతూ ఉంటాడు. అరవింద వాడెవరో మాకు చెప్పండి, వాడిని మేముఏం చేయాలో అది చేస్తాము అని అంటుంది.విక్కీ కూడా వాడెవరో చెప్పు పద్మావతి వాళ్ళ అడ్రస్ ఇవ్వు, వాడిని అక్కడికక్కడే షూట్ చేసి వస్తాను అని అంటాడు. అరవింద వాడికి ఒక్కసారి బుద్ధి చెప్తే మళ్లీ మీ జోడి రాడు అని అంటుంది. ఇంతమంది అడుగుతుంటే పేరు చెప్పరేంటి అని కుచల అంటుంది. కృష్ణ తెగ టెన్షన్ పడుతూ వీళ్ళ ఒత్తిడితో ఎక్కడ నా పేరు చెప్పేస్తారు అని భయపడుతూ ఉంటాడు. పద్మావతి ఇప్పుడు ఎందుకులెండి ఆ నీచుడి పేరు, శుభమా అని పెళ్లి పనులు మొదలు పెట్టుకోవడానికి వచ్చాము.ఆ కార్యక్రమాన్ని చూద్దాము అని అంటుంది.విక్కి మాత్రం నువ్వు కచ్చితంగా వాడి పేరు చెప్పి తీరాలి, ఈరోజు వాడిని నేను అంత చూడాలి. అని కోపంగారుస్తూ ఉంటాడు. ఆవేశ పడకండి సార్ వాడు ఇంక నా జోలి రాడు, మా నాయన వాడికి గట్టిగా బుద్ధి చెప్పాడు.సరే ఇంకా పంతులుగారు వచ్చే టైం అయింది అందరం లోపలికి వెళ్దాం అని అనుకుంటారు. కృష్ణ మాత్రం ఇప్పుడు తప్పించుకున్నాను వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటాడు.

nuvvu-nenu-prema-30-may-2023-today-322-episode-highlights
nuvvu-nenu-prema-30-may-2023-today-322-episode-highlights

ఆర్య,అనుతోనిజం చెప్పమని అంటాడు.

ఆర్యా అను కి ఫోన్ చేస్తాడు. మీ నాన్నగారు ఇలా రికవరీ అవ్వటం చాలా సంతోషంగా ఉంది. మన పెళ్లి టయానికి ఆయన బాగు అవడం, ఆయన చేతుల మీదుగా మన పెళ్లి జరగడం చాలా సంతోషంగా ఉంది అని అంటాడు. అనుకూడా అవునండి అని అంటుంది. ఆర్య పద్మావతిని ఎవరో ఏడిపిస్తున్నారంట కదా వాడి మళ్లీ వచ్చాడు కదా వాడు ఎవరు వాడి పేరు చెప్పు అని అడుగుతాడు. అను మాత్రం, అరవింద గారి గురించి ఆలోచిస్తూ వాడి పేరు చెప్పదు.వాడి పేరు చెప్తే మా కన్నా మీరే ఎక్కువ బాధపడతారండి, అని మనసులో అనుకొని అను నిజం చెప్పదు. అయినా వాడికి మా నాయనకు బాగా బుద్ధి చెప్పాడు ఇక వాడి మా జోలి రాడు అని అంటుంది. ఈసారి వస్తే ఫస్ట్ నాకే ఫోన్ చేయాలి అని అంటాడు ఆర్య. రేపు మెహందీ ఫంక్షన్ లో కలుసుకుందాం అంటాడు ఆర్య. మెహందీ ఫంక్షన్ కి మీరు రాకూడదండి అని అంటుంది. సరే ఇక నాకు పని ఉంది అని ఫోన్ పెట్టేస్తుంది అను. అనుని చూడకుండా ఎలా ఉండాలి అనిఆర్య ఫీల్ అవుతూ ఉంటాడు.
పంచ తో విక్కీ పాట్లు..

nuvvu-nenu-prema-30-may-2023-today-322-episode-highlights
nuvvu-nenu-prema-30-may-2023-today-322-episode-highlights

పంచికట్టుకోవడంలో విక్కీ తడపట ఇస్తూ ఉంటాడు. ఇది నాకు కట్టుకోవడం చేతకాలంటే అక్కేమో వినదు ఇదే ట్రెడిషనల్ అంటుంది. నాకేమో దీన్ని కట్టుకోవడం రావట్లేదు అని విక్కీఅనుకుంటూ ఉండగా, పద్మావతిని అరవిందా పైకి వెళ్లి విక్కీని తీసుకొని రమ్మని చెప్తుంది. విక్కీ ని తీసుకెళ్లడానికి పద్మావతి పైకి వచ్చి,విక్కీ పంచ కట్టుకోవడానికి, అవస్థ పడటం చూసి నవ్వుతూ ఉంటుంది. విక్కీ పద్మావతి లోపలికి వచ్చేటప్పుడు, డోర్ లో కొట్టి రావాలని తెలియదా, మీరు రెడీ అయిపోయి ఉంటారు అనుకున్నాను సారు ఇలాఉంటారని నాకు తెలియదు కదా అంటుంది.అయినా పెద్ద బిజినెస్ మాగ్నెట్ అంటారు పంచ కట్టుకోవడం రాదా అని నవ్వుతూ ఉంటుంది. ఇదిగో నువ్వు నవ్వదు అని చెప్పాను కదా అని విక్కీ అరుస్తాడు. నేను హెల్ప్ చేస్తాను రండి సార్ అని ఉంటుంది. నీ హెల్ప్ అయినా అవసరం లేదు వెళ్ళు అంటాడు వీక్కి, పందిరి నుంచి వేల అయిపోతుంది తొందరగా రండి సార్ నేను హెల్ప్ చేస్తాను అంటుంది. ఈలోపు అరవింద కింద నుంచి పద్మావతి తొందరగా రండి అని అంటుంది. చూడండి మీ అక్క కూడా పిలుస్తుంది నేను హెల్ప్ చేస్తాను. అని పద్మావతి పంచ కట్టడంలో విక్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. కృష్ణ వాళ్ళు అలా ఉండడం చూస్తాడు నేను వీళ్ళని ఎంత దూరం పెడుతున్నా వీళ్లు మాత్రం దగ్గరవుతున్నారు. వీళ్ళని ఎలా అయినా దూరం చేయాలి అని అనుకుంటాడు..

nuvvu-nenu-prema-30-may-2023-today-322-episode-highlights
nuvvu-nenu-prema-30-may-2023-today-322-episode-highlights
రేపటి ఎపిసోడ్ లో..

పద్మావతిని కృష్ణ అడ్డగిస్తాడు.. అడ్డు తప్పుకో అంటుంది పద్మావతి. నేను తప్పుకుంటే నువ్వు వెళ్లి విక్కిన తగులుకుంటావా అని కృష్ణ అంటాడు. విక్కీ నా బావ నేను అతనితో క్లోజ్ గానే ఉంటాను. అని పద్మావతి వెళ్లబోతుండగా కృష్ణ వెనుక నుండి చేయి పట్టుకుంటాడు. పద్మావతిని వదిలిపెట్టకుండా, ఇప్పుడు ఎలా వెళ్తావో వెళ్ళు అని అంటాడు. పద్మావతి వాళ్ళ నాన్న చూసి, నీ గురించి ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ, చెప్పేస్తాను అని చొక్కా పట్టుకొని ఇంట్లోకి తీసుకొస్తూ ఉంటాడు… విక్కీ చూసి ఏంటి పద్మావతి అని అడుగుతాడు… ఇక కృష్ణ గురించి అరవింద ఇంట్లో కూడా తెలిసిపోనుందా….

Related posts

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N