NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Political Survey: ఏపీలో అధికారం ఏ పార్టీకి..? ఎవరికి ఎన్ని సీట్లు ..??

Political Survey: ఏపిలో రాజకీయ వాతావరణం హాట్ హాట్ గా కొనసాగుతోంది. ఎన్నికలకు మరో పది నెలలు మాత్రమే సమయం ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు రేపే ఎన్నికలు అన్నట్లుగా ప్రజల్లో తిరుగుతూ ప్రజా మద్దతును కోరుతున్నాయి.  అంతే కాకుండా ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి పరిస్థితులపై సర్వేలు చేయించుకుంటూ తదనుగుణంగా నియోజకవర్గ ఇన్ చార్జ్‌ ల మార్పులు చేర్పులపై దృష్టి పెడుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రకరకాల సర్వే ఫలితాలు వెల్లడవుతున్నాయి. తాజాగా పొలిటికల్ క్రిటిక్ సంస్థ సర్వే ఫలితాలు వెల్లడించింది.

 

ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే వైసీపీ భారీ విజయాన్ని సాధిస్తుందని తెలిపింది. ఈ సర్వే ఫలితాలు చూస్తే వైసీపీకి 51 శాతం ఓట్ షేర్ తో 21 లోక్ సభ స్థానాలు కైవశం చేసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. టీడీపీ 37.5 శాతం ఓట్ షేర్ తో నాలుగు లోక్ సభ స్థానాలు గెలుచుకుంటుందని తెలిపింది. ఇండియా కూటమికి 3.5 శాతం, ఎన్డీఏ (బీజేపీ, జనసేన)కి ఏడు శాతం ఓట్ షేర్ మాత్రమే వస్తుందని, లోక్ సభ స్థానాలు ఈ కూటమిలు గెలుచుకోలేదని తెలిపింది. ఇక అసెంబ్లీ విషయానికి వస్తే 49.5 శాతం ఓట్ షేర్ తో వైఎస్ఆర్ సీపీ 135 అసెంబ్లీ స్థానాలకు అయిదు అటు ఇటుగా వస్తాయని అంచనా వేసింది. టీడీపీ 38.5 శాతం ఓటు షేర్ తో 35 అసెంబ్లీ స్థానాలకు అయిదు అటు ఇటుగా గెలుస్తుందని చెప్పింది. ఎన్డీఏ కూటమి (బీజేపీ, జనసేన) 8 శాతం ఓటు షేర్ తో అయిదు అసెంబ్లీ స్థానాలకు రెండు అటు ఇటుగా వస్తాయని అంచనా వేసింది. ఇండియా కూటమి కేవలం 2.5 శాతం ఓటు షేర్ తో సరిపెట్టుకుంటుందని తెలిపింది.

 

తెలంగాణ ఎన్నికల ఫలితాల  తర్వాత ఏపీలోని తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలోకి వెళితే ..ఈ సంస్థ నవంబర్ నుండి ఫిబ్రవరి 24 మధ్య సర్వే జరిపి ఆ సర్వే నివేదికను వెల్లడించనుందని సమాచారం. ఈ సర్వే సంస్థ కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు విడుదల చేసిన సర్వేకు అనుగుణంగానే ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 135 నుండి 145 స్థానాలు, బీజేపీకి 65 నుండి 70 స్థానాలు, జేడీ(ఎస్)కు 10 నుండి 15, ఇతరులకు 5 నుండి పది స్థానాలు వచ్చాయని ఏప్రిల్ 11 తేదీనే వెల్లడించింది. మే నెలలో వెల్లడైన ఫలితాలు చూస్తే కాంగ్రెస్ పార్టీ 135 స్థానాలు కైవశం చేసుకోగా, బీజేపీ 66 స్థానాలకు పరిమితం అయ్యింది. జేడీ (ఎస్) 19 స్థానాలతో సరిపెట్టుకుంది.

ఇంతకు ముందు ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ నవభారత్ సర్వే విడుదల చేసిన ఫలితాల్లో ఏపీలో మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభంజనమే అన్నట్లుగా తెలిపింది.  వైసీపీకి 24 నుండి 25 లోక్ సభ స్థానాలు గెలుస్తుందని అంచనా వేసింది టైమ్స్ నౌ నవభారత్ సంస్థ. దేశంలోనే మూడో అతి పెద్ద పార్టీగా వైఎస్ఆర్ సీపీ నిలుస్తుందని వెల్లడించింది. వరుసగా వస్తున్న సర్వే సంస్థల ఫలితాల్లో వైఎస్ఆర్ సీపీ ప్రభంజనం కనబడుతుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాట తప్పకుండా, మడమ తిప్పకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 96 శాతంకుపైగా సీఎం జగన్  అమలు చేశారని, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి సహకరించకపోయినా నవరత్న పథకాలకు ఠంచన్ గా బటన్ నొక్కి  లబ్దిదారులకు పంపిణీ చేస్తుండటం వల్ల ప్రజలు వైసీపీకి మద్దతుగా నిలుస్తున్నారని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. అయితే ఈ సర్వే లెక్కలపై ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి. ఎన్నికలకు ముందు రకరకాలుగా సర్వే ఫలితాలు వస్తాయని అంటుంటారు.

పుంగనూరు ఘటనలో ఏ 1 గా చంద్రబాబు

Related posts

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?