NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Jagan: సీఎం జగన్ పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ

YS Jagan: విశాఖలో తన పై కోడికత్తితో జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఎన్ఐఏ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్ పోర్టులో నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ పై జె శ్రీనివాసరావు  కోడికత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దర్యాప్తు జరిపి కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది.

అయితే ఈ కేసులో కుట్ర కోణం ఏమీ లేదని ఎన్ఐఏ దర్యాప్తులో పేర్కొంది. అయితే ఈ ఘటనలో లోతైన దర్యాప్తు చేయాలని కోరుతూ జగన్మోహనరెడ్డి ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఎన్ఐఏ కోర్టు జగన్ అభ్యర్ధనను తిరస్కరించింది. దీంతో జగన్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ నెంబర్ కేటాయించే దశలో రిజిస్ట్రీ అభ్యంతరం లేవనెత్తడంతో.. ఈ వ్యవహారంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి వద్ద శుక్రవారం (ఈరోజు) విచారణ జరగనుంది.

తనపై జరిగిన దాడిలో కుట్ర కోణం ఉందని, లోతైన దర్యాప్తు జరపకుండానే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోకుండానే ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేసిందని పేర్కొన్నారు. నిందితుడు శ్రీనివాసరావుకు నేర చరిత్ర ఉన్నా ఆ విషయాన్ని పట్టించుకోకుండా క్యాంటిన్ నిర్వహకుడు విధుల్లోకి తీసుకున్నారని పేర్కొన్నారు. కుట్ర కోణం తేల్చేందుకు మరింత లోతైన విచారణ జరపాలని జగన్ కోరారు. జూలై 25న ఎన్ఐఏ కోర్టు జగన్ పిటిషన్ ను డిస్మిస్ చేయడంతో హైకోర్టును ఆశ్రయించారు.

YS Jagan: పవన్ కళ్యాణ్ పై మరో సారి తీవ్ర విమర్శలు చేసిన సీఎం వైఎస్ జగన్

 

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju