YS Jagan: విశాఖలో తన పై కోడికత్తితో జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఎన్ఐఏ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్ పోర్టులో నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ పై జె శ్రీనివాసరావు కోడికత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దర్యాప్తు జరిపి కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది.
అయితే ఈ కేసులో కుట్ర కోణం ఏమీ లేదని ఎన్ఐఏ దర్యాప్తులో పేర్కొంది. అయితే ఈ ఘటనలో లోతైన దర్యాప్తు చేయాలని కోరుతూ జగన్మోహనరెడ్డి ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఎన్ఐఏ కోర్టు జగన్ అభ్యర్ధనను తిరస్కరించింది. దీంతో జగన్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ నెంబర్ కేటాయించే దశలో రిజిస్ట్రీ అభ్యంతరం లేవనెత్తడంతో.. ఈ వ్యవహారంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి వద్ద శుక్రవారం (ఈరోజు) విచారణ జరగనుంది.
తనపై జరిగిన దాడిలో కుట్ర కోణం ఉందని, లోతైన దర్యాప్తు జరపకుండానే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోకుండానే ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేసిందని పేర్కొన్నారు. నిందితుడు శ్రీనివాసరావుకు నేర చరిత్ర ఉన్నా ఆ విషయాన్ని పట్టించుకోకుండా క్యాంటిన్ నిర్వహకుడు విధుల్లోకి తీసుకున్నారని పేర్కొన్నారు. కుట్ర కోణం తేల్చేందుకు మరింత లోతైన విచారణ జరపాలని జగన్ కోరారు. జూలై 25న ఎన్ఐఏ కోర్టు జగన్ పిటిషన్ ను డిస్మిస్ చేయడంతో హైకోర్టును ఆశ్రయించారు.
YS Jagan: పవన్ కళ్యాణ్ పై మరో సారి తీవ్ర విమర్శలు చేసిన సీఎం వైఎస్ జగన్
RGV: ఏపీ గవర్నమెంట్ ని ప్రశ్నించిన RGV, దీనికి చిరు రియాక్షన్ కేక!!