NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu Arrest: చంద్రబాబుకు గుడ్ ఫ్రైడే అవుతుందనుకుంటే బ్యాడ్ ఫ్రైడే అయినట్లుందే.. వరుసగా న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బలు .. దసరా పండుగ రోజూ కారాగారంలోనే..?

Chandrababu Arrest: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు న్యాయస్థానాల్లో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. చంద్రబాబు సుప్రీం కోర్టు లో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఇప్పటికే వాదనలు పూర్తి కాగా, తీర్పును ధర్మాసనం రెండు రోజుల క్రితం రిజర్వు చేసింది. శుక్రవారం (20వ తేదీ) క్వాష్ పిటిషన్ పై తీర్పు వస్తుందని టీడీపీ నేతలు, చంద్రబాబు అభిమానులు భావించారు. చంద్రబాబుకు గుడ్ ఫ్రైడే (శుభ శుక్రవారం) అవుతుందని ఆశించారు. కానీ వారికి బ్యాడ్ ఫ్రైడే అయ్యింది. అటు సుప్రీం కోర్టులో, ఇటు విజయవాడ ఏసీబీ కోటులోనూ శుక్రవారం చంద్రబాబుకు ఎలాంటి ఊరట లభించలేదు. దీంతో టీడీపీ నేతలు నిరుత్సాహానికి గురైయ్యారు.

ntr reaction on chandrababu arrest
ntr reaction on chandrababu arrest

చంద్రబాబు గత 40 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్నారు. దీంతో వినాయక చవితి పర్వదినాన్ని కుటుంబ సభ్యులతో జరుపుకోలేకపోయారు. ప్రస్తుతం శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. మరో మూడు రోజుల్లో విజయదశమి పర్వం ఉంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ ఏడాది దసరా పండుగను కూడా కుటుంబ సభ్యులతో చేసుకునే పరిస్థితి చంద్రబాబుకు లేదు. క్వాష్ పిటిషన్ పై తీర్పును వచ్చే నెల 8వ తేదీన సుప్రీం కోర్టు వెల్లడించనున్నది. ఇక స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణను  ఏపీ హైకోర్టు వెకేషన్ బెంచ్ కు బదిలీ చేసింది.

Chandrababu

ఫైబర్ నెట్ స్కామ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు (శుక్రవారం) విచారణ అనంతరం వాయిదా వేసింది. చంద్రబాబు తరపున లూథ్రా, ఏపీ ప్రభుత్వం తరపున రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. పిటిషనర్ పై మూడు ఎఫ్ఐఆర్ ఉన్నాయనీ, ఒక దానికి సంబంధించి తీర్పు రిజర్వు అయ్యిందని చంద్రబాబు తరపు న్యాయవాది లూథ్రా తెలిపారు. ఫైబర్ నెట్ కేసులో అరెస్టు చేయవద్దని ఇప్పటికే కోర్టు తెలిపింది. ఒక వ్యక్తి కస్టీడీలో ఉన్నప్పుడు మళ్లీ అరెస్టు అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని ఏపీ సర్కార్ తరుపన న్యాయవాది రంజిత్ కుమార్ అన్నారు.

chandrababu

చంద్రబాబు జ్యూడీషియల్ కస్టడీ కొనసాగుతోందనీ, ఈ అంశాన్ని కౌంటర్ అఫిడవిట్ లో తెలిపామన్నారు. వాదనలు విన్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదీ నేతత్వంలోని ద్విసభ్య ధర్మాసనం తదుపరి విచారణను నవంబర్ 9వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసు లో తీర్పు పెండింగ్ లో ఉన్న విషయాన్ని చంద్రబాబు తరపు న్యాయవాదులకు ధర్మాసనం గుర్తు చేసింది. క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడిన తర్వాతనే ఫైబర్ నెట్ కేసును పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. అయిత క్వాష్ పిటిషన్ పై తీర్పును నవంబర్ 8వ తేదీకి వెల్లడిస్తామని ధర్మాసనం తెలిపింది.

అయితే ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు పిటిషన్ పై విచారణను 8వ తేదీ కాకుండా .. తొమ్మదవ తేదీకి వాయిదా వేయాలని చంద్రబాబు తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత ఇబ్బంది రీత్యా తదుపరి విచారణను వాయిదా వేయాలని కోరారు. చంద్రబాబు తరపు న్యాయవాది విజ్ఞప్తిపై సానుకూలంగ స్పందించిన ధర్మాసనం .. నవంబర్ 9వ తేదీనే విచారణ చేపడతామని తెలిపింది. అంత వరకూ చంద్రబాబును అరెస్టు చేయొద్దని.. పీటీ వారెంట్ పై యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించారు. సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ పై ఇవేళ తీర్పు వెలువడలేదు. ఫైబర్ నెట్ కేసు వాయిదా పడింది.

మరో పక్క ఏసీబీ కోర్టులో లీగల్ ములాఖత్ ల సంఖ్య పెంచాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టేసింది. ములాఖత్ ల సంఖ్య పెంచేలా ఆదేశాలు ఇవ్వాలని, ఈ పిటిషన్ పై అత్యవసర విచారణ చేపట్టాలని చంద్రబాబు తరపు న్యాయావాదులు గురువారం కోరారు. చంద్రబాబు కేసుల విచారణ వివిధ కోర్టుల్లో ఉన్నందున ములాఖత్ ల సంఖ్య మూడుకు పెంచాలని పిటిషన్ లో కోరారు. అయితే .. ఆలా చేయడం సాధ్యం కాదని కోర్టు తెలిపింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ సీఐడీని ఆదేశించింది. తాజాగా ఈ పిటిషన్ శుక్రవారం ఏసీబీ కోర్టులో విచారణకు రాగా న్యాయస్థానం కొట్టేసింది. ప్రతివాదులను చేర్చకపోవడంతో ఈ పిటిషన్ విచారణకు అర్హత లేదని తిరస్కరిస్తూ సరైన లీగల్ ఫార్మట్ లో దాఖలు చేయాలంటూ చంద్రబాబు తరపు న్యాయవాదులకు సూచించింది.

RK Roja: ఆ సామాజిక వర్గానికి ఆగ్రహం తెప్పించిన మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యలు .. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

Related posts

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju