NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi December 20 2023 Episode 283: మెగా ఎపిసోడ్’ కళ్యాణ్ పెళ్లికి అడ్డంకులు మొదలు.. సీఈఓ గా పద్మావతి సక్సెస్..

Brahmamudi Today Episode December 20 2023 Episode 283 Highlights

Brahmamudi December 20 2023 Episode 283:  నిన్నటి ఎపిసోడ్ లో, కళ్యాణ్ పెళ్లికి విక్కీ పద్మావతిని ఆహ్వానిస్తారు. కళ్యాణ్ పెళ్లి పనులు మొదలు పెడతారు. రాహుల్ రుద్రాన్ని పెళ్లి ఎలా ఆపాల అని ప్లాన్ చేస్తూ ఉంటారు స్వప్న చేత పెళ్లి ఆపించాలని ఇద్దరు ఒక ప్లాన్ వేస్తారు. కనకం ఎలాగైనా ఈ పెళ్లి జరిపించాలని ఫిక్స్ అవుతుంది. కృష్ణమూర్తి అప్పు ఉంది తీసుకొని పెళ్లికి వెళ్లాలి అని నిర్ణయించుకుంటాడు. విక్కీ పద్మావతి లు, ఒకరికి ఒకరు అర్థం చేసుకొని కలిసిపోయేలా ఉన్నారని మేనేజర్ కృష్ణతో చెప్పడంతో కృష్ణ మరో పథకాన్ని రచిస్తాడు.

Brahmamudi Today Episode December 20 2023 Episode 283 Highlights
Brahmamudi Today Episode December 20 2023 Episode 283 Highlights

ఇక ఈరోజు విక్కీ పనుల్లో బిజీగా ఉంటే చాలా టైం అయింది విక్కీ భోజనం చేయకపోతే షుగర్ వల్ల నీరసం వస్తుంది అని అనుకొని, భోజనం తీసుకొని వెళ్తుంది. విక్కీ పనిలో బిజీగా ఉంటాడు భోజనం ఇప్పుడు వద్దు అంటాడు ముందు భోజనం చేసి తర్వాతే పని చూసుకోవాలి అని అంటుంది పద్మావతి. నువ్వు బాస్ అయ్యావు కదా అని ఆర్డర్ వేస్తున్నావా అని అంటాడు విక్కీ. మన హెల్త్ కూడా మనం చూసుకోవాలి కదా అని అంటుంది పద్మావతి. నేను ఎంత ఎదిగినా కానీ, సీఈఓ ఆయన గాని నేను మీ భార్య నే కదా అని అంటుంది. విక్కీకి భోజనం పెడుతుంది. ఇది వేసుకోండి అది వేసుకోండి అని అంటూ అన్ని వడ్డిస్తూ ఉంటుంది నువ్వు నాకు భాష అని అడ్రస్ వేయకు ఏం తినాలో కూడా నాకు తెలియదా అని అంటాడు విక్కి ఇలా ఇద్దరు పోట్లాడుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ తింటారు.

Brahmamudi Today Episode December 20 2023 Episode 283 Highlights
Brahmamudi Today Episode December 20 2023 Episode 283 Highlights

Krishna Mukunda Murari: శ్రీనివాసన్ ని దాచిపెట్టి కృష్ణ మురారిని కలిసిన దేవ్.. రేపటికి ఊహించని ట్విస్ట్..

ఇక కళ్యాణ్ పెళ్లి పనుల గురించి ఇంట్లో అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. పెళ్లికి కావాల్సిన బాసికాలను అపర్ణ ఇందిరా దేవికి చూపిస్తుంది. అవి చూసి ఇందిరా దేవి కావ్యకి ఇచ్చి జాగ్రత్త చేయమని చెప్తుంది. ధాన్యలక్ష్మి, మంగళసూత్రం కూడా మనమే తీసుకువెళ్లాలి అని అంటుంది ఆ మాటకి రుద్రాణి ఇక మొత్తం అంతా మనమే తినేసి వాళ్ళు ఏమీ ఖర్చు పెట్టకుండా పెళ్లి చేసేటట్టు ఉన్నారు అని అంటుంది. అసలు వాళ్ళు మన అబ్బాయిని కాకుండా మన ఆస్తిని చూసి ఈ సంబంధం కలుపుకున్నట్టు అనిపిస్తుంది నాకు అని అంటుంది రుద్రాణి. నాక్కూడా అలా అని అనిపిస్తుంది మామ్ అని అంటాడు రాహుల్ ఇక అందరూ దాని గురించే మాట్లాడుకుంటూ ఉండగా, నాకు అసలు ఈ పెళ్లి జరుగుతుందో లేదో అన్నట్టుగా మాట్లాడతారు ఆ మాటలుకి రాజ్ కి కోపం వచ్చి ఇక మాట్లాడటం ఆపేస్తారా అని అంటాడు. ఇక అందరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా సీతారామయ్య గుండె పట్టుకొని ఏదో, బాగాలేదు అనిపించి రూమ్ లోకి వెళ్లి రెస్ట్ తీసుకుందాం ఇంట్లో అందర్నీ డిస్టర్బ్ చేయడం ఎందుకు అని రూమ్ లోకి వెళుతూ ఉంటాడు. అప్పుడే ఇందిరా దేవి సీతారామయ్యతో బావ ఏమైనా కావాలా అని అంటుంది ఏం అవసరం లేదు చిట్టి రెస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నాను అని అంటాడు. ఇక అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉంటారు. రూమ్ లోకి వెళ్తూ వెళ్తూ సీతారామయ్య మధ్యలోనే, పడబోతూ ఉంటాడు వెంటనే అందరూ వచ్చి పట్టుకుంటారు. ఇక ఏమైందని ఇంట్లో అందరూ కంగారుపడి డాక్టర్ కి ఫోన్ చేస్తారు.

Nuvvu Nenu Prema:పద్మావతి బాటలో విక్కీ నడవనున్నాడా? కృష్ణ చేసిన పనికి పద్మావతి దోషి కానుందా?

Brahmamudi Today Episode December 20 2023 Episode 283 Highlights
Brahmamudi Today Episode December 20 2023 Episode 283 Highlights

ఇక పద్మావతి తన పనిలో చాలా బిజీగా ఉంటుంది అప్పుడే, కృష్ణ మేనేజర్ కి ఫోన్ చేసి నేను ఇప్పుడు నీకు ఒక పని చెప్తాను దాన్ని నువ్వు సక్రమంగా చేయాలి అని అంటాడు సార్ మీరు చెప్పే పని వింటుంటే నాకు చాలా కంగారుగా ఉంది అని అంటాడు నువ్వేం భయపడకు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను ఇప్పుడు నేను నీకు ఒక ఫైల్ పంపించాను ఆ ఫైల్ మీద పద్మావతి చేత సంతకం చేయించు అని అంటాడు. సంతకంతో పాటు పద్మావతి దగ్గర ఉన్న విక్కీ పర్సనల్ లాప్టాప్ పాస్వర్డ్ కూడా నాకు కావాలి అని అంటారు. సరే అది అంత ఈజీ అయిన పని కాదు కానీ ట్రై చేస్తానంటాడు మేనేజర్ కృష్ణ నువ్వు ట్రై చేయడం కాదు కచ్చితంగా చేయాలి. ఈ ఒక్కరోజే సీఈవోగా పద్మావతి ఉంటుంది తన చేత ఆ ఫైల్ మీద సంతకం పెట్టించు అని అంటాడు ఇక మేనేజర్ కృష్ణ చెప్పినట్టుగానే పద్మావతి రూమ్ లోకి వెళ్లి, మేడం ఇది మనం ఎప్పుడూ చేసే ఫైలే దీనిమీద మీ రెగ్యులర్ సంతకం కావాలి అని అంటాడు. విక్కీని కనుక్కొని పెడతాను అని అంటుంది పద్మావతి అవసరం లేదు మేడం ఈరోజు ఒకసారి సంతకం పెట్టే ఫైలే మీరు కూడా ఈరోజు పెట్టేస్తే సరిపోతుంది అని పద్మావతికి నచ్చజెప్పి ఆ ఫైల్ మీద సంతకం పెట్టిస్తాడు. కృష్ణ చెప్పిన పనుల్లో ఒక పని సక్సెస్ గా అయిపోతుంది. ఇక రెండో పని పద్మావతి దగ్గర ఉన్న విక్కీ పర్సనల్ లాప్టాప్ పాస్వర్డ్ కనుక్కోవడం, అందుకు మేనేజర్ మేడం ఇప్పుడు మీరు పంపించినట్టుగా ఒక మెయిల్ చేయండి వాళ్లకి అని అంటాడు మెయిల్ చేయాలంటే పాస్వర్డ్ ఓపెన్ చేయాలి కదా దానికి పాస్వర్డ్ ఉంటుంది విక్కీ సార్ రాగానే చేస్తాను అని అంటుంది కాదు మేడం ఇప్పుడు మీరు చేసేయాలి అది మీకు సీఈవోగా పవర్స్ ఉన్నాయి కాబట్టి మీకు పాస్వర్డ్ కూడా తెలిసే ఉంటుంది కదా అలాంటప్పుడు విక్కీ సరిగా చెప్పాల్సిన పని ఉంది మనం జస్ట్ మేలే కదా చేస్తుంది అని అంటాడు ఆ మాటలకి పద్మావతి సరే అని విక్కీ పర్సనల్ లాప్టాప్ ని ఓపెన్ చేస్తుంది మేడం చేయాలో నేను చెప్తాను అని కావాలని, మేనేజర్ పద్మావతి దగ్గరికి వెళ్లి ఆ పాస్వర్డ్ అంతా ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటాడు. పద్మావతి పాస్వర్డ్ టైప్ చేయడం మెయిల్ చేయడం అంతా ఫోన్లో రికార్డ్ చేసేసి ఓకే మేడం మీరు మెయిల్ పెట్టేసారు కదా థాంక్స్ అని చెప్పేసి అక్కడి నుంచి మేనేజర్ వెళ్ళిపోతాడు కానీ పద్మావతికి, మేనేజర్ చేసిన మోసం తెలియదు, ఇక పద్మావతి మళ్లీ తన పనుల్లో తను బిజీ అయిపోతుంది. మేనేజర్ కృష్ణ కి ఫోన్ చేసి మీరు చెప్పినట్లుగానే రెండు పనులు కంప్లీట్ అయిపోయాయి మీకు ఇప్పుడు ఫార్వర్డ్ చేశాను పాస్వర్డ్ చూడండి ఆ ఫైల్ కూడా మీకు పంపించాను అని అంటాడు ఇక కృష్ణ, విక్కీ పద్మావతిని విడదీయడానికి ఇదే మంచి అవకాశం ఇప్పుడు ఈ సంతకంతో ఈ పాస్వర్డ్ తో నేనేం చేస్తాను మీరు ఊహించలేరు అని అనుకుంటాడు.

Kumkuma Puvvu December 19 2023 Episode 2056: అంజలి బంటి వాళ్ళ ఇంటికి చేరుకుంటుందా లేదా.

Brahmamudi Today Episode December 20 2023 Episode 283 Highlights
Brahmamudi Today Episode December 20 2023 Episode 283 Highlights

ఇక సీతారామయ్యకి కళ్ళు తిరిగి పడిపోవడంతో డాక్టర్ వచ్చే చెక్ చేస్తూ ఉంటాడు ఇక దాంతో కళ్యాణ్, నాకెందుకో మనసుప్పుకోవడం లేదు ఈ పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడే ఈ పెళ్లి ఆపేద్దాం అనుకుంటున్నాను అని అంటాడు. ఏం మాట్లాడుతున్నావ్ అని అంటుంది ఆపర్ణ. అవును పెద్దమ్మ ఈ పెళ్లి ఆపేద్దాము. నా పెళ్లికి అడ్డంకులు వస్తున్నాయి కదా అందుకని నేను ఈ పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు అని అంటాడు. పంతులుగారు చెప్పినట్టు నా పెళ్ళికి దోషాలు ఉన్నాయి వాటిని మనం ఎంత తీర్చినా కానీ తాతయ్యకి ఆరోగ్యం బాగాలేదు ఇప్పుడు ఏమన్నా అయిందంటే మనమందరం బాధపడాల్సి వస్తుంది అందుకని ఈ పెళ్లి ఆపేద్దాం అని అంటాడు. ధాన్యలక్ష్మి కూడా నాకు అలానే అనిపిస్తుంది అని అంటుంది ఇక సుభాష్ అపర్ణ ఇద్దరు పెళ్లి ఆపేయడం ఎంత ఈజీ కాదు, అవతల ఆడపిల్ల జీవితం మనం వెంటనే డెసిషన్ తీసుకోకూడదు కొంచెం ఆలోచించి తర్వాత నిర్ణయిద్దాము అని అంటారు. కల్యాణ ఆవేశంగా పెళ్లి ఆపేయాలి అని అనుకుంటే రాజ్ ఆవేశ పడకు, ఏదైనా ఆలోచించి చేయాలి అని నచ్చచెప్తాడు ఇక సీతారామయ్యకు డాక్టర్ చెక్ చేస్తే, డాక్టర్ గారు ఇందిరా దేవిని కాసేపు మీరు బయట వెయిట్ చేయండి మేడం అని అంటాడు దాంతో ఇందిరాదేవి బయటకు వచ్చి నాకు చాలా టెన్షన్ గా ఉంది అని అంటుంది. వెంటనే రాజు నువ్వేం కంగారు పడకు నానమ్మ అని అంటాడు పెళ్లి అబద్ధం నానమ్మ అంటాడు కళ్యాణ్ ఇప్పుడే కాదు దోషానికి పరిహారం చేశాం కదా, ఇంకా తాతయ్యకి రెగ్యులర్ గానే బాగుండట్లేదు కాబట్టి ఇలా జరిగింది నువ్వు దానివల్ల అని ఊహించుకోవద్దు అని ఇందిరాదేవి కళ్యాణ్ కి నచ్చచెప్తుంది. దోషానికి పరిహారం ఎక్కడ జరిగింది? వదిన మొక్క మార్చేసింది కదా అని కళ్యాణ్ మనసులో అనుకుంటాడు కానీ ఈ విషయం ఇంట్లో చెప్తే, అందరూ కావ్యని మళ్ళీ తిడతారని కళ్యాణ్ సైలెంట్ గా ఉంటాడు.

Jagadhatri December 19 2023 Episode104: జగదాత్రి మీద కోపంతో వంట చేసిన నిషిక, ఆ వంట తినలేక తిప్పలు పడుతున్న ఇంట్లో వాళ్లు..

Brahmamudi Today Episode December 20 2023 Episode 283 Highlights
Brahmamudi Today Episode December 20 2023 Episode 283 Highlights

ఇక పద్మావతి ఒకరోజు సీఈఓ గా కంప్లీట్ అయిపోతుంది ఇక రేపటి నుంచి పద్మావతి సీఈవో అధికారాలు ఉండవు. ఈ ఒక్కరోజు నేను చేసిన పనికి నా మీద విక్కీకి ప్రేమ కలిగితే చాలు అని అనుకుంటుంది పద్మావతి. పద్మావతి సీఈవోగా సక్సెస్ అయ్యింది. దాని కారణం కాంట్రాక్టు ఒకే అవుతుంది. ఎప్పటినుంచో విక్కీ కలగంటున్న కాంటాక్ట్ ని పద్మావతి సీఈఓ గా ఉన్నప్పుడు నెరవేరుస్తుంది. ఇక పద్మావతి తన సీఈవో బోర్డుని చూసుకుంటూ ఈరోజుతో ఈ బోర్డు మీద ఉన్న పేర్లు లాగా ఎప్పటికీ మేము కలిసే ఉండాలి అని అనుకొని ఇక రేపు నుంచి నా జీవితం మొదలైపోయింది అని మనసులో అనుకొని ఆఫీసు రూమ్ లో నుంచి బయటికి రాగానే అందరూ కంగ్రాట్యులేషన్స్ చెప్తూ ఉంటారు ఎందుకు మీరంతా ఇలా చేస్తున్నారు అని పద్మావతి అడుగుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన విక్కీని చూపించి సార్ చెప్తారు మేమందరం ఇలా ఎందుకు సెలబ్రేషన్ చేస్తున్నాము అని ఎంప్లాయిస్ అందరూ వెళ్ళిపోతారు ఇక పద్మావతి దగ్గరికి వచ్చిన విక్కి నాకు చాలా సంతోషంగా ఉంది పద్మావతి అని హగ్ చేసుకుంటాడు వెంటనే పద్మావతి ఏమైంది సారు అని అడుగుతుంది ఎప్పటినుంచో ఓకే కాని ప్రాజెక్టు నీ వల్ల ఓకే అయింది మన లైవ్ ప్రజెంటేషన్ వాళ్లకి నచ్చి ప్రాజెక్టును ఓకే చేశారు ఇదంతా నీ వల్లే పద్మావతి అని అంటాడు. పద్మావతి మీద విక్కీకి అపారమైన ప్రేమ కలుగుతుంది వెంటనే పద్మావతిని హత్య చేసుకొని పైకి ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తూ ఉంటాడు. పద్మావతిని కిందకి దింపి విక్కి ముద్దు పెట్టుకుందాం అని అనుకుంటాడు అప్పుడే పద్మావతి కృష్ణతో అన్న మాటలు గుర్తుకు వస్తాయి. వెంటనే పక్కకు తొలిగిపోతాడు. ఏమైంది సారు అని అంటుంది వెంటనే విక్కీ అవన్నీ గుర్తు చేసుకొని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏదో ఒక రోజు నా ప్రేమ మీకు అర్థం అవుతుంది అని అనుకుంటుంది పద్మావతి.

ఇక సీతారామయ్య ని చెక్ చేసిన డాక్టర్, మీరు వెంటనే హాస్పిటల్ లో జాయిన్ అవ్వాలి సార్ అని అంటాడు ఇప్పుడు కాదు జాతకాలు, కలవలేదని పెళ్లి ఆపేస్తారు అని సీతారామయ్య మనసులో అనుకొని ముందు టాబ్లెట్స్ ఇవ్వండి ఈ పెళ్లి అవ్వగానే నేను వచ్చే హాస్పిటల్ లో జాయిన్ అవుతాను అని అంటాడు. అది కాదు సార్ ఇప్పుడు మీకు అసలు బాగోలేదు ఇప్పుడు మీరు హాస్పిటల్ కి రాకపోతే మళ్ళీ ఏమన్నా జరగరానిది జరుగుతుంది అని డాక్టర్ అంటాడు ఏమి ఇబ్బంది లేదు టాబ్లెట్స్ ఇవ్వండి లేదంటే మా వాళ్ళు ఈ పెళ్లి ఆపేస్తారు పెళ్లి అవ్వగానే నేను కచ్చితంగా వస్తాను అని అంటే నా వృత్తికి విరుద్ధంగా మీరు నన్ను ఈ పని చేయమంటున్నారు. నేను ఈ పని ఎలా చేయగలను అని అంటే సీతారామయ్య డాక్టర్ని ఒప్పిస్తూ ఉంటాడు.

ఇక పద్మావతి గురించి పేపర్లో ప్రకటన వస్తుంది. అది చూసి ఆర్య హడావిడి చేస్తాడు. పద్మావతి ఒకరోజు సీఈవోగా చాలా గొప్ప పని చేసినట్టు పేపర్ లో ఉంటుంది అది చూసి, మన పద్మావతి అందరూ గొప్పగా చెప్పుకునే స్థాయికి తీసుకెళ్లింది. మన కంపెనీ ఇప్పుడు అందరుమెచ్చుకుంటారు . కంగ్రాట్స్ పద్మావతి అని ఆర్య చెప్తాడు. ఈరోజుతో నువ్వంటే ఏందో అందరికీ తెలిసింది పద్మావతికి తప్ప అని చెప్తాడు ఆర్య. ఆఫీసులో పద్మావతి చేసిన పని పొగుడుతూ పేపర్లో రాశారు. అని ఇంట్లో అందరికీ పేపర్ చూపిస్తాడు ఆర్య అంత గొప్ప పని తను ఏం చేసింది అని కుచల అంటుంది. లారీ లోకానికి ఇవన్నీ తెచ్చినా ప్రతిభావంతురాలు మిస్సెస్ పద్మావతి వన్డే సీఈవోగా కార్పొరేటర్, అందరిలో సంచలనం సృష్టించింది. ఒక రోజులోనే ప్రముఖ విదేశీ కంపెనీతో ఒప్పందం కుదిరిలా చేసింది. వెంటనే పద్మావతి శ్రీనివాస ఒకటి వస్తుందని నా కళ్ళలో కూడా అనుకోలేదు ఇప్పుడు నాకు ఎంతో ఆనందంగా ఉంది అని దండం పెట్టుకుంటూ ఉంటుంది పద్మావతిని పొగుడుతూ ఉంటారు అందరూ, కృష్ణ కావాలని మధ్యలో దూరి వీరిద్దరూ ఒకరికొకరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ మిమ్మల్ని ఒకరికి ఒకరు అర్థం చేసుకున్నట్టు ఎవరు అర్థం చేసుకోలేరు అని అంటాడు ఇక అందరూ పద్మావతి వీళ్ళని పొగుడుతాడు పద్మావతి అక్కడి నుంచి వెళ్లిపోతాడు వెంటనే చూసావా, విక్కీ నీకు కంగ్రాట్స్ చెప్పకుండా వెళ్ళిపోయాడు అని అంటుంది కుచల. ఈ పేపర్ తీసుకెళ్లి విక్కీ పర్సనల్గా చూపించు తన నీకు కచ్చితంగా కంగ్రాచులేషన్స్ చెప్తాడు అని అంటుంది అరవింద. పద్మావతి వికీ రూమ్ కి వెళ్లి, సారు నేను చేసిన పనికి మీరు నన్ను పొగడకపోయినా నేను చేసిన పనిని గుర్తిస్తే చాలు అని అంటుంది ఇప్పుడు ఏంటి నువ్వు గొప్ప పని చేశావని నేను శభాష్ అనాలా కంగ్రాచులేషన్స్ చెప్పాలా అలాంటివన్నీ ఏమీ చేయను అయినా నీ గురించి నాకు తెలుసు నువ్వు ఎప్పుడు మోసం చేస్తావు. నీ గురించి తెలుసుకోవడానికి నీకు కంగ్రాచులేషన్స్ ఎలా చెప్తాను అని అంటాడు ఇక పద్మావతిని కోప్పడతాడు. పద్మావతి బాధపడుతూ ఉంటుంది ఆ పేపర్ ని తీసుకొని విక్కీ మొత్తం చింపేసేసి ఇకనుంచి వెళ్ళిపో అని అంటాడు. పద్మావతి ఆ పేపర్లన్నీ కలెక్ట్ చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక వ్యక్తి అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతాడు

గానామిక పెళ్లి గురించి టెన్షన్ పడుతూ ఉంటారు అనామిక తల్లిదండ్రి వాళ్ళ పెళ్లి ఎలా చేయాలో అర్థం కావట్లేదు అని బాధపడుతూ ఉంటారు అప్పుడే, అనామిక తల్లి మనం ఎందుకు టెన్షన్ పడడం పెళ్లి వాళ్లే చేస్తా అన్నారు కదా అని అంటుంది వాళ్ళు చేస్తా అన్నారు కాబట్టి సరిపోయింది లేదంటే మన దగ్గర అన్ని డబ్బులు ఎక్కడ ఉన్నాయి అని అంటాడు అనమికా తండ్రి. అప్పుడే వాళ్ళకి సేటు ఫోన్ చేసి మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బులు తొందరగా ఇస్తారా ఇవ్వరా అని బెదిరిస్తూ ఉంటాడు. పెళ్లి జరగనివ్వండి మీరు ఇవ్వాల్సిన డబ్బులు అన్ని వడ్డీతో సహా ఇస్తానని అనామిక తండ్రి సేటుకి చెప్తాడు. అనామిక తల్లిదండ్రులు ఇద్దరు పెళ్లి తొందరగా జరిగే ఆ డబ్బులు కళ్యాణ్ దగ్గర నుంచి తీసుకొని సేటుకి ఇవ్వాలి అని ప్లాన్ వేస్తారు. ఇక రాజ్, విక్కీకి ఫోన్ చేసి మీరు పెళ్లికి రావాలి మర్చిపోయారా నువ్వు గనక పెళ్లికి రాకపోతే నేను మాత్రం ఊరుకోను కచ్చితంగా పెళ్లికి రావాలి. ఇంట్లో అందరిని తీసుకొని రా అని చెప్తాడు. వెంటనే పద్మావతిని ఇప్పుడే కదా కోప్పడి వచ్చాను ఇప్పుడు పెళ్లికి ఎలా ఒప్పించాలి అని విక్కి ఆలోచిస్తూ పద్మావతి గది దగ్గరికి వెళ్తాడు.

Brahmamudi Today Episode December 20 2023 Episode 283 Highlights
Brahmamudi Today Episode December 20 2023 Episode 283 Highlights

పద్మావతి అప్పటికే ఏడుస్తూ ఉంటుంది. అనవసరంగా పద్మావతిని బాధ పెట్టాను అని అనుకుంటాడు వెంటనే, బట్టలు సదువు మనం బయటికి వెళ్లాలి అని అంటాడు ఎందుకు బట్టలు సర్దాలి మీరు చెప్తే నేను చేయాలా అని అంటుంది పద్మావతిని విక్కీ బుజ్జగిస్తూ ఉంటాడు. అక్క నువ్వు నేను అందరం పెళ్లికి వెళ్లాలి కదా తొందరగా బట్టలు సర్దుకుంటే వెళ్దాము అని అంటాడు. మీరు చెప్పారని నేను రాను అని అంటుంది పద్మావతి. పద్మావతి ఉద్యోగించి పెళ్లికి వెళ్లడానికి ఒప్పిస్తాడు.

ఇక కావ్య, వెళ్లడానికి బట్టలు సర్దుతూ ఉంటుంది. అక్కడే ఉన్న రాజు ఫోన్ రింగ్ అవ్వడంతో రాజ్ ఫోన్ చూస్తే అందులో స్వేత ఫోన్ చేసినట్టు కనిపిస్తుంది వెంటనే అనుమానం వస్తుందని పక్కకు వెళ్లి మాట్లాడుతాడు అయినా కావ్య వదిలిపెట్టక రాజ్ ని అలానే అనుమానంగా చూస్తూ ఉంటుంది. శ్వేత మనం కలవాలని మర్చిపోయావా అని రాజకీయ గుర్తు చేస్తుంది ఇప్పుడు నాకు కలవడం కుదరదు నేను మూడు రోజులు పెళ్లి పనుల్లో రిసార్ట్ కి వెళ్తున్నాను అని రాజ్ శ్వేతతో చెప్తాడు శ్వేతా రిసార్ట్ పేరేంటి అని అంటుంది అప్పుడే కావ్య గర్ల్ ఫ్రెండ్ ఆ అని అంటుంది ఏం మాట్లాడుతున్నావ్ అంటాడు రాజ్. అంత పర్సనల్ గా మాట్లాడుతుంటే నాకు వినిపించకుండా సీక్రెట్ గా గర్ల్ ఫ్రెండ్ ఏమో అనుకున్నాను అని అంటుంది. శ్వేతా రాజు ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. తర్వాత మాట్లాడుదురు గాని ముందు వచ్చి నీకు ఏ సూటి పెళ్లికి వేసుకోవాలో సెలెక్ట్ చేస్తారా అని అంటుంది రాజు చెప్పిన కలర్ని కావ్య వద్దు ఈ కలర్ బాగుంటుంది అని అంటుంది ఇక నన్ను అడగడం దేనికి నువ్వే సర్దే అని అంటాడు రాజ్. ఎలా ఉన్న తర్వాత అలానే అడుగుతుంది భర్త అన్నాక భరించాలి అని అంటుంది. నీ భార్య చాలా తెలివిగల్లది రాజ్ అని అంటుంది శ్వేత. రిసార్ట్ పేరు చెప్తాడు రాజ్ అయితే అక్కడే కలుద్దాం అని అంటుంది. వద్దు అక్కడికి రావాకు అని అంటాడు రాజ్. నేనే వచ్చేస్తాను అని అంటాడు రాజు సరే అంటుంది ఇక రాజుకి సప్రైజ్ చేద్దాము రిసార్ట్ కి వెళ్లి అని అనుకుంటుంది శ్వేత.

ఇక పద్మావతి బట్టల సర్దుతూ ఆ పెళ్ళిలో, టెంపర వాడికి తిక్క కుదిరించాలి నేనంటే ఏంటో చూపిస్తాను అని అనుకుంటుంది ఇక పెళ్లికి వెళ్లడం సంబరంగా ఉందా పద్మావతి అని కృష్ణ వచ్చే అడుగుతాడు దానికి పద్మావతి పక్కన వాళ్ళ విషయాలు నీకెందుకు అని అంటుంది మీరిద్దరూ గదిలో ఏం మాట్లాడుతున్నారో నాకు తెలుసు అని అంటాడు కృష్ణ ఆ మాటకి పద్మావతికి కోపం వస్తుంది అయినా పక్కన వాళ్ళ గదిలోకి వచ్చి చూడడానికి నీకు సంస్కారం లేదు కదా అని అంటుంది. మీరు పెళ్లిలో ఏంట్రా సంతోషంగా ఉంటారు నేను చూస్తాను అని అంటాడు ఆ మాటకి పద్మావతి చేయొద్దు కృష్ణుని కొట్టాలనుకుంటుంది. నీలాంటినీ ఏం చేయాలో అర్థం కావట్లేదు అరవింద ముఖం చూసి నిన్ను వదిలేస్తున్నాను. అని పద్మావతి అంటుంది ఇక వెంటనే కృష్ణ నీకు టైం దగ్గర పడింది కదా పద్మావతి మూడు నెలల్లో మీ ఇద్దరు కలిసి ఉండేది ఆ తర్వాత విక్కీ అని బయటికి పంపిస్తాడు. అని పద్మావతితో కృష్ణ అంటాడు వెంటనే నేనే నిన్ను బయటికి పంపిస్తాను ఇంకొక మూడు నెలల్లో రెడీగా ఉండు అని పద్మావతి కూడా తిరిగి వారిని ఇచ్చి వెళ్ళిపోతుంది. మీరిద్దరూ ఎలా పెళ్లిలో సంతోషంగా ఉంటారో చూస్తాను నేను అక్కడికి వస్తున్నాను కదా అని అనుకుంటాడు మీ ఇద్దరినీ విడదీయడానికి నాకు ఈ పెళ్లి కూడ ఒక అవకాశం వచ్చినట్టే అని అనుకుంటాడు.

ఇక రేపటి ఎపిసోడ్ లో, విక్కీ పద్మావతి కళ్యాణ్ పెళ్లికి వస్తారు రాజ్ విక్కీని లోపలికి ఆహ్వానిస్తాడు. పద్మావతి కావ్య తో మీ ఆయనే మిమ్మల్ని ముద్దుగా పిలిచే పేరు ఒకటి ఉండాలి అని అంటుంది. ఏమే ఒసే అని పిలుస్తూ ఉంటాడు బాగా ముద్దొచ్చినప్పుడు కళావతి అని పిలుస్తాడు అని చెప్తుంది. ఆ మాటలకు అందరూ నవ్వుకుంటూ ఉంటారు. మన కళ్యాణ్ గాడి పెళ్లి నీ ధూంధాం గా సెలబ్రేషన్ చేయాలి అని అంటాడు రాజ్ తగ్గేదేలే అని అంటాడు విక్కీ. ఇక రెండు కుటుంబాలు హ్యాపీగా నవ్వుతూ ఉంటారు.

Related posts

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Devara: “దేవర” సాంగ్ వింటే “హుకుం” మర్చిపోతారు అంటూ నాగవంశీ కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N

Sai Pallavi-Sreeleela: సాయి ప‌ల్ల‌వి – శ్రీ‌లీల మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్స్ ను గ‌మ‌నించారా..?

kavya N

Serial Actress Sireesha: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. భ‌ర్త‌తో విడిపోయిన‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సీరియ‌ల్ న‌టి!

kavya N