Salaar: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా “సలార్” డిసెంబర్ 22వ తారీకు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. వరుస పరాజయాలలో ఉన్న ప్రభాస్ ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకోవడం జరిగింది. బాహుబలి సినిమాతో 2018లో చరిత్రత్మకమైన విజయం.. సాధించగా ఆ తర్వాత ఐదు సంవత్సరాలు పాటు ఒక హిట్టు కూడా పడలేదు. “బాహుబలి”తో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిన ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా నేపథ్యంలో తీసిన సాహో, రాదేశ్యాం, ఆది పురుష్.. మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్ల పడ్డాయి. దీంతో ఆశలన్నీ ఇప్పుడు “సలార్” పైన పెట్టుకోవడం జరిగింది.
KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమా తీయడంతో కచ్చితంగా విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. అంతేకాదు తన కెరియర్ లోనే బెస్ట్ డైరెక్టర్ ప్రశాంత్ అంటే ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపారు. దేశవ్యాప్తంగా KGF సినిమాలతో ప్రశాంత్ అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. దీంతో పాన్ ఇండియా లాంటి హీరో ప్రభాస్ తో ఈ సినిమా చేయటంతో.. కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని సినీ ప్రేమికులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలలో బెనిఫిట్ షోస్ కి తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇవ్వగా ఏపీ ప్రభుత్వం మాత్రం నిరాకరించింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం 20 థియేటర్లలో అర్ధరాత్రి ఒంటిగంటకు బెనిఫిట్ షో ప్రదర్శించుకోవచ్చని అనుమతులు ఇవ్వడం జరిగింది.
సాధారణ ప్రదర్శనలతో పాటు అదనంగా ఉదయం నాలుగు గంటల నుంచి ఆరవ షో వేసుకోవచ్చు అని వెసులుబాటు కల్పించింది. ఇదిలా ఉంటే సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొలది.. ప్రమోషన్స్ విషయంలో “సలార్” టీం చాలా వెనకబడిపోయింది. విడుదల చేసిన రెండు ట్రైలర్లు కూడా సినిమాపై అంచనాలు పెంచగా అనుకున్న సమయానికి విడుదల చేయలేదు. ఇక రాజమౌళితో ఇంటర్వ్యూ కూడా అనుకున్న సమయానికి విడుదల చేయకుండా కాస్త ఆలస్యంగా విడుదల చేయటంతో ఫ్యాన్స్ ప్రమోషన్స్ విషయంలో సలార్ మేకర్స్ పై అసహనం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈ సినిమాకి ప్రమోషన్స్ చేయకపోయినా ఖచ్చితంగా రికార్డులు సాధిస్తాయని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.