NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena TDP Alliance: ఏ జిల్లాలో ఎన్ని సీట్లు తీసుకోవాలి .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కసరత్తు..ఈ నియోజకవర్గాలు కన్ఫర్మ్..?

Janasena TDP Alliance:   ఏపీలో రాజకీయ పార్టీలు అన్నీ ఎన్నికల మూడ్ లోకి వచ్చేశాయి. మార్చి, ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన రాజకీయ పార్టీ వైసీపీ ఇప్పటికే అభ్యర్ధుల ఎంపికపై దృష్టి సారించింది. ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నియోజకవర్గాల ఇన్ చార్జిలు, సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పులు, చేర్పులపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 11 నియోజకవర్గాలకు కొత్త ఇన్ చార్జిలను నియమిస్తూ మొదటి జాబితా విడుదల చేశారు. రెండో జాబితా ప్రకటనకు పలువురు గోదావరి జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులతో ఇటీవల సమావేశం నిర్వహించారు.

మరో పక్క టీడీపీ – జనసేన పొత్తులో ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయ్యాయి. ఇరుపార్టీల పొత్తు కారణంగా సీట్ల సర్దుబాటుపై చర్చలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలో పొత్తులో భాగంగా ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. గౌరవ ప్రదంగా సీట్లు సర్దుబాటు ఉంటుంది అని గతంలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా బలాబలాలను బేరీజు వేసుకుని ఏయే స్థానాల్లో జనసేన అభ్యర్ధులను నిలపాలి అనే దానిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. శుక్రవారం నుండి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ లు చర్చలు ప్రారంభించారు.

ఇవేళ, రేపు కూడా వివిధ జిల్లాలు, నియోజకవర్గాల నేతలతో భేటీలు జరిపి క్షేత్ర స్థాయిలో జనసేన బలంగా ఉన్న స్థానాలను గుర్తించి, ఆ తర్వాత సీట్ల సర్దుబాటుపై టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారని తెలుస్తొంది. పలువురు జనసేన అభిమానులు, నేతలు మాత్రం 50 నుండి 60 స్థానాలు పొత్తులో భాగంగా తీసుకుంటే గౌరవ ప్రదంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు నియోజకవర్గాల్లో వచ్చిన ఓట్ల శాతం, అంతకు 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్ధులకు వచ్చిన ఓట్ల ఆధారంగా నియోజకవర్గాల గుర్తింపు జరుగుతోంది.

గెలుపు అవకాశాలు ఉన్న నియోజకవర్గాలతో పాటు ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్ధుల గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న సుమారు 30 నుండి 40 నియోజకవర్గాలను జనసేన కు పొత్తులో భాగంగా టీడీపీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న సమావేశాల తర్వాత ఏయే నియోజకవర్గాలను జనసేన ఆశిస్తుంది అనేది ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

AP Politics: ఏపీ ఎన్నికల్లో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు..ఏ పార్టీకి ప్లస్ .. ఏ పార్టీకి మైనస్..?

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju