Samantha: గత ఏడాది సెప్టెంబర్ నెలలో “ఖుషి” సినిమా విజయం తర్వాత సమంత చాలా లాంగ్ గ్యాప్ తీసుకోవడం జరిగింది. ఆ సమయంలో మయూసైటిస్ అనే వ్యాధి బారిన పడి ట్రీట్మెంట్ తీసుకుని కోలుకొని “ఖుషి” సినిమా కంప్లీట్ చేసింది. సినిమా విజయంతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కిన సమంత కొంతకాలం రెస్ట్ తీసుకోబోతున్నట్లు ప్రకటన చేసింది. అనంతరం విదేశాలలో వ్యవహరించి అక్కడ మరి కొంత ట్రీట్మెంట్ తీసుకుని గత ఏడాది నవంబర్ నెలలో హైదరాబాద్ రావడం జరిగింది. ఆ తర్వాత సోషల్ మీడియా పరంగా యాక్టివ్ అవుతూ వస్తూ ఉంది. కానీ సినిమాల పరంగా ఎలాంటి ప్రాజెక్టు ఒప్పుకోలేదు.
కానీ లేటెస్ట్ గా మాత్రం పాడ్ కాస్ట్ ద్వారా అభిమానులను అలరించడానికి సిద్ధమయ్యింది. ఆల్రెడీ ఒక ప్రోమో రిలీజ్ చేసి.. ఫిబ్రవరి 19వ తారీఖు నాడు మొదటి పాడ్ కాస్ట్ వీడియో రిలీజ్ చేయబోతున్నట్లు స్పష్టం చేయడం జరిగింది. ఒకపక్క ఈ రకంగా మరోపక్క యాడ్స్ చేసుకుంటూ దూసుకుపోతుంది. మొన్ననే “గ్యాలక్సీ S24” ఆల్ట్రాకి సంబంధించి యాడ్ చేయగా ఇప్పుడు అదే కంపెనీకి మరో యాడ్ చేయడం జరిగింది. అంతకుముందు షాహిద్ కపూర్ తో కలిసి యాడ్ చేసింది. లేటెస్ట్ గా “గ్యాలక్సీ S24 ఆల్ట్రా”కి సంబంధించి చేసిన యాడ్ లో సమంత చాలా గ్లామర్ గా కనిపిస్తూ ఉంది. ఈ యాడ్ కి సంబంధించి వీడియో సమంత ఇంస్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇదే సమయంలో సమంత కొన్ని స్టోరీలు కూడా వింటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ముఖ్యంగా హిందీలో ఈ ముద్దుగుమ్మకి చాలా అవకాశాలు వస్తున్నట్లు త్వరలోనే ఓ ప్రాజెక్టు ఓకే చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. “ఖుషి” సినిమా తర్వాత సమంత దాదాపు 5 నెలలపాటు కెమెరాలు ముందుకు రాలేదు. చాలావరకు సోషల్ మీడియాలో సందడి చేయడం జరిగింది. కాగా ఇప్పుడు పాడ్ కాస్ట్ తో పాటు బ్యాక్ టు బ్యాక్ యాడ్స్ చేస్తూ ఉండటంతో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇదే సమయంలో త్వరగా సమంత కొత్త సినిమా ప్రకటన రావాలని ఆశిస్తున్నారు.
Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?