NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena: నాడు బావ పోటీ చేసిన స్థానం నుండి నేడు బావమరిది రెడీ అవుతున్నారు(గా)..!  

Janasena: ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి లోక్ సభ స్థానం నుండి 2009 ఎన్నికల్లో ప్రజా రాజ్యం పార్టీ నుండి అల్లు అరవింద్ పోటీ చేసిన సంగతి తెలిసిందే. నాడు త్రిముఖ పోరులో అల్లు అరవింద్ కు దాదాపు మూడు లక్షల వరకూ ఓట్లు వచ్చాయి. దీంతో టీడీపీ అభ్యర్ధిపై కేవలం 52వేల స్వల్ప ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్ధి సబ్బం హరి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్ధి సూర్యప్రకాశరావుకు మూడు లక్షలకుపైగా ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లోనూ జనసేన అభ్యర్ధికి దాదాపు 80వేలకుపైగా ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్ధి ఆడరి అనంద్ కుమార్ కు 4 లక్షల 97వేల ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్ధి వెంకట సత్యవతి 89వేల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.

2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి ముత్తంశెట్టి శ్రీనివాస్ 47వేల మెజార్టీతో వైసీపీ అభ్యర్ధి గుడివాడ అమర్నాథ్ పై విజయం సాధించారు. ఈ సారి ఎన్నికల్లోనూ 2014 ఎన్నికల్లో మాదిరిగానే ఈ సారి కూడా అదే కూటమితో ఎన్నికల బరిలో దిగుతున్నందున అనకాపల్లి లోక్ సభ స్థానం నుండి గెలుపు ఖాయమన్న అంచనాలు టీడీపీ, జనసేనలో ఉన్నాయి. టీడీపీతో పొత్తులో భాగంగా కాకినాడ, మచిలీపట్నం, అనకాపల్లి లోక్ సభ స్థానాలు జనసేనకు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గం నుండి నాన్ లోకల్ నేతలు విజయం సాధిస్తూనే ఉన్నారు.

Pawan Kalyan

దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదల నాగబాబు ఈ స్థానంపై దృష్టి పెట్టినట్లు సమాచారం. గత ఎన్నికల్లో నరసరావుపేట లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి భారీగా ఓట్లు సాధించినా త్రిముఖ పోరులో ఓటమి పాలైయ్యారు నాగబాబు. ఈ నేపథ్యంలో నాడు బావ అల్లు అరవింద్ పోటీ చేసిన అనకాపల్లి లోక్ సభ స్థానంపై నాగబాబు దృష్టి పెట్టినట్లుగా తెలుస్తొంది. హైదరాబాద్ నుండి తన మకాంను అనకాపల్లి జిల్లా యలమంచిలికి మార్చుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఆయన మీడియాకు తెలియజేశారు.

త్వరలోనే యలమంచిలిలో నివాసం ఉండబోతున్నట్లు నాగబాబు తెలిపారు. దీంతో అనకాపల్లి లోక్ సభ స్థానం నుండి పోటీ చేయనున్నారు అన్న వార్త లకు బలం చేకూరుతోంది. ఇవేళ విశాఖపట్నానికి వచ్చిన నాగబాబు మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ అధినేత అదేశాలతో ఎన్నికల బరిలో నిలబడతానని చెప్పారు. ఎక్కడి నుండి పోటీ చేస్తాననే దానిపై త్వరలో స్పష్టత వస్తుంది, పార్టీ అధినేత డిసైడ్ చేస్తారని చెప్పారు. యలమంచిలిలో నివాసం ఉండబోతున్నాననీ, అక్కడి నుండి పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పారు. అయితే ఇటీవలే జనసేన పార్టీలో చేరిన మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ పరిస్థితి ఏమిటి అన్న చర్చ జరుగుతోంది.

Kaleswaram Project: బీఆర్ఎస్ ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టును తప్పుపట్టిన కాగ్ .. వాస్తవాలు ఇలా..

Related posts

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?