NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Supreme Court: సుప్రీం కోర్టులో బీజేపీకి బిగ్ షాక్ .. చండీగఢ్ మేయర్ ఎన్నికపై సంచలన తీర్పు

Supreme Court: చండీగఢ్ మేయర్ ఎన్నిక ఫలితాలపై బీజేపీకి సుప్రీం కోర్టులో బిగ్ షాక్ తగిలింది. చండీగఢ్ మేయర్ ఎన్నిక ఫలితాలపై సుప్రీం కోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. ఆప్ అభ్యర్ధిని విజేతగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసేందుకు ఉద్దేశపూర్వకంగా వ్యవహరించారని స్పష్టంగా తెలుస్తొందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

చండీగఢ్ మేయర్ గా బీజేపీ అభ్యర్ధి మనోజ్ కుమార్ సోంకర్ ఎన్నికను సుప్రీం కోర్టు రద్దు చేసింది. గత నెల 30న జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నిక ఓటింగ్ కు సంబంధించిన బ్యాలెట్ పేపర్లను  తమకు సమర్పించాలని సోమవారం సుప్రీం కోర్టు ప్రధాన నాయమూర్తి డీవై చంద్రడూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. తిరిగి ఎన్నికలు నిర్వహించడానికి బదులు, బ్యాలెట్ పేపర్ లు తిరిగి లెక్కించాలని ధర్మాసనం నిర్ణయించింది. ఈ మేరకు చేపట్టిన రీ కౌంటింగ్ లో ఆప్ అభ్యర్ధికి అనుకూలంగా ఓట్లు వచ్చాయని సుప్రీం కోర్టు గుర్తించింది.

సోమవారం నాటి విచారణలో రిటర్నింగ్ అధికారి అనిల్ మసిహ్ కు ధర్మాసనం పలు ప్రశ్నలు వేసింది. మంగళవారం జరిగే విచారణలో బ్యాలెట్ పేపర్లన్నంటినీ తమ ముందు ఉంచాలని చెప్పింది. బ్యాలెట్ పేపర్ పై క్రాస్ మార్క్ తానే పెట్టినట్లు అనిల్ మసిహ్ కోర్టు ముందు ఒప్పుకున్నారు. చండీగఢ్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ గా అమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ కుల్దీప్ కుమార్ ను సుప్రీం కోర్టు ప్రకటించింది.

ఆప్ అభ్యర్ధికి వచ్చిన ఎనిమిది ఓట్లను ట్యాంపర్ చేశారన్న ఆరోపణలపై మేయర్ ఎన్నికలు నిర్వహించిన రిటర్నింగ్ అధికారి అనిల్ మసిహ్ కు సుప్రీం కోర్టు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఎన్నికలనే ప్రజాస్వామ్య ప్రక్రియను కుట్రలు, కుతంత్రాలకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత ఆర్టికల్ 142 కింద తమపై ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.  రిటర్నింగ్ అధికారి చెల్లని ఓట్లుగా ప్రకటించిన ఎనిమిది ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్ధి కుల్దీప్ కుమార్ కు అనుకూలంగా వచ్చాయని ధర్మాసనం తెలిపింది. సుప్రీం కోర్టు తీర్పు పట్ల ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు.

CM YS Jagan: వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా నిధులు విడుదల చేసిన సీఎం జగన్

Related posts

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?