NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగుసుకుంటున్న ఉచ్చు

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా సీబీఐ పేర్కొంది. కవిత పేరును చార్జిషీట్‌లో నిందితురాలిగా చేర్చారు. 41ఏ కింద విచారణకు హజరు కావాలని నోటీసులో పేర్కొంది సీబీఐ. ఈ కేసులో ఇప్పటికే సౌత్ గ్రూప్ నుండి అరెస్టయిన నిందితులు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా కవితను నిందితురాలిగా చేర్చినట్లు తెలుస్తొంది. ఇప్పటికే ఆమెకు విచారణకు హజరుకావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న ఢిల్లీలో విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు.

MLC Kavitha

అయితే గతంలో జారీ చేసిన నోటీసులపై కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, అది విచారణ దశలో ఉంది. ఈ నేపథ్యంలో కవిత సీబీఐ విచారణకు ఢిల్లీకి వెళ్తారా? లేదా? అనే దానిపై అనుమానాలు ఉన్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే పలుమార్లు కవితను అధికారులు ప్రశ్నించారు. ఆమె గతంలో వినియోగించిన సెల్ ఫోన్ లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో హైదరాబాద్‌ కు వచ్చిన అధికారులు కవితను ఆమె ఇంట్లోనే విచారించారు. ఈడీ అధికారులు మాత్రం రెండు సార్లు ఢిల్లీకి పిలిపించి.. విచారణ జరిపారు.

TRS MLC Kavitha

అయితే మహిళను ఇంట్లోనే విచారించాలని చట్టంలో వెసులుబాటు ఉందని.. కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఈ నెల 28కి కేసును వాయిదా వేసింది. ఈలోపే సీబీఐ కవితకు నోటీసులు జారీ చేయడం, ఆమెను నిందితురాలిగా చేర్చడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌ అయ్యింది. ఈ కేసులో ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కీలక నేతలను, పలువురు లిక్కర్ వ్యాపార ప్రముఖులను కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్టు చేసిన నేపథ్యంలో కవితను అరెస్టు చేస్తారంటూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే పెద్ద ఎత్తున ఊహగానాలు వచ్చాయి.

తాజాగా ఈ కేసులో ఆమెను నిందితుల జాబితాలో చేర్చడంతో ఉచ్చు బిగుసుకున్నట్లేననే అని అంటున్నారు. నిందితుల జాబితాలో చేర్చడంతో న్యాయస్థానం ద్వారా ముందస్తు బెయిల్ ప్రయత్నాలు చేయాల్సిందేనని, లేకపోతే అరెస్టు తప్పదని అనుకుంటున్నారు. ఈ పరిణామంతో కవిత న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

ఈ కేసులో ఆప్ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌కి ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసింది. లిక్కర్‌ కేసులో మనీలాండరింగ్‌కి సంబంధించి ఏడో సారి నోటీసులు ఇచ్చింది. ఫిబ్రవరి 26న విచారణకు హాజరు కావాలని పేర్కొంది.  కేజ్రీవాల్‌కు ఆరుసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఒక్క సారి కూడా విచారణకు హాజరుకాలేదు. దీంతో మరో సారి నోటీసులు జారీ చేశారు.

CM YS Jagan: ఒంగోలులో 20,840 ఇళ్ల స్థలాల రిజిస్టర్డ్‌ కన్వేయన్స్‌ డీడ్స్‌ పంపిణీ చేసిన సీఎం జగన్ .. చంద్రబాబుపై మరో సారి ఘాటు వ్యాఖ్యలు

Related posts

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?