Bhimaa Trailer: మ్యాచో స్టార్ గోపీచంద్ కొత్త సినిమా పేరు “భీమా”. కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ కొద్ది గంటల క్రితం విడుదలైంది. గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. రాక్షసుల మధ్య ధర్మాన్ని కాపాడే బ్రహ్మ రాక్షసుడు అంటూ బ్యాక్ గ్రౌండ్ డైలాగ్స్ తో “భీమా” టీజర్ గతంలో రిలీజ్ అయి అందరిని ఆకట్టుకోవడం జరిగింది. హీరో పాత్రకు సంబంధించిన డైలాగ్స్ మాత్రమే టీజర్ లో రివీల్ చేశారు. కాగా ఇప్పుడు విడుదలైన “భీమా” ట్రైలర్ అంతకుమించి అన్నట్టు ఉంది. ట్రైలర్ లో డివోషనల్ నేపథ్యంలో పరుశురాముడు గురించి తెలియజేస్తూ హీరో క్యారెక్టర్ రివిల్ చేయటం జరిగింది.
కొందరు రాక్షసులు తమ అహంకారంతో విర్రవీగుతున్నప్పుడు.. వాళ్లు అంతు కోరి త్రినేత్రుడే కాలనేత్రుడై కరున్నే చూపని ఒక బ్రహ్మ రాక్షసుడిని పంపాడు.. అంటూ గోపీచంద్ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ సన్నివేశాలు ట్రైలర్ లో చూపించడం జరిగింది. “భీమా” సినిమా ట్రైలర్ లో “నేను ఊచకోత మొదలుపెడితే ఈ ఊరిలో స్మశానం కూడా సరిపోదు నా కొడకా”.. అంటూ గోపీచంద్..పవర్ ఫుల్ డైలాగులు చూపించడం జరిగింది. ట్రైలర్ బట్టి చూస్తే యాక్షన్ డివోషనల్ నేపథ్యంలో సినిమా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. శివరాత్రి సందర్భంగా మార్చి 8వ తారీకు ఈ సినిమా రిలీజ్ అయిపోతున్నారు.
ఇప్పటికే సినిమాకి సంబంధించి విడుదలైన సాంగ్స్ టీజర్ అభిమానులను ఆకట్టుకున్నాయి. తాజాగా విడుదలైన “భీమా” ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేయడం జరిగింది. వాస్తవానికి ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ కావాల్సి ఉండగా అనుకోని కారణాల వల్ల వాయిదా పడి ఇప్పుడు మార్చి 8వ తారీకు రిలీజ్ కాబోతుంది. ఈ మూవీలో ప్రియభావాని శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీసత్య సాయి ఆర్ట్స్ నిర్మాణంలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు.
Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?