NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

అదిరిపోయే ట్విస్ట్‌… భ‌ర్త వైసీపీలో… భార్య టీడీపీలోకి జంప్‌… !

ఏపీలో సాధార‌ణ ఎన్నిక‌ల వేళ రాజ‌కీయం మామూలుగా లేదు. జంపింగ్‌లు జ‌రుగుతున్నా కొన్ని జంపింగుల్లో అదిరిపోయే ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని శృంగవరపుకోట నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు సతీమణి సుధారాణి నేతృత్వంలో వివిధస్థాయిల వైసిపి నాయకులు యువనేత లోకేష్ సమక్షాన సోమవారం టిడిపిలో చేరారు. 15 మంది సర్పంచులు, 17 మంది ఎంపిటిసిలు, 5గురు కన్వీనర్లతో సహా 150మంది పార్టీ ముఖ్యనేతలు సోమవారం భారీకాన్వాయ్ తో ఉండవల్లిలోని చంద్రబాబు వద్దకు నివాసానికి చేరుకుని టీడీపీ కండువాలు క‌ప్పుకున్నారు.

Husband joins YCP... Wife jumps to TDP..
Husband joins YCP… Wife jumps to TDP..

ఇంకా చెప్పాలంటే ఓ ఎమ్మెల్సీ భార్య‌తో పాటు ఈ స్థాయిలో ఎంపీటీసీలు, స‌ర్పంచ్‌లు పార్టీ మారిపోయారంటే నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ చాలా వ‌ర‌కు ఖాళీ అయిపోయింద‌నే చెప్పాలి. టీడీపీలో చేరిన వారిలో ఎస్.కోట ఎంపీపీ సంధి సోమేశ్వరరావు, ఎంపీటీసీ లాగుడు లక్ష్మి, ఎంపీటీసీ మోపాడ గౌరీశ్వరి, ఎంపీటీసీ-1 దారా గిరి, ఎంపీటీసీ-2 మజ్జి దేవి, ఎంపీటీసీ-4 వాకాడ సింహాచలం, ఎంపీటీసీ-5 మోపాడ సునీత, ఎంపీటీసీ-6 బి.ఆదిలక్ష్మి, ఎంపీటీసీ భోజంకి వెంకటలక్ష్మి, మండల కో-ఆప్షన్ మెంబర్ షేక్ బషీర్, సర్పంచ్ లు సోలుబొంగు కనకం, రామకృష్ణ, సంతోషి కుమారి, వొబ్బిన త్రినాథమ్మ, లాగుడు సూర్యనారాయణ, ఎర్ర సన్యాసిరావు తదితరులు ఉన్నారు.

పార్టీలో చేరిన ఎమ్మెల్సీ ర‌ఘురాజు భార్య సుధారాణి వైసీపీపై తీవ్ర‌స్థాయిలో విరుచుకు ప‌డ్డారు. ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు నియోజకవర్గాన్ని కబ్జాల కోటగా మార్చేశారని… వైసీపీలో ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మాకు అక్కడ ఎలాంటి ఆత్మగౌరవం లేదు. మా సమస్యలను జగన్ రెడ్డి ఏనాడూ పట్టించుకోలేదు. నియోజకవర్గ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు కబ్జాల కడుబండిగా పేరు గడించారు.. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి ఇక్కడకు వచ్చాం. ఇక్కడ కార్యకర్తలకు గౌరవం ఉంటుంద‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యానికి, చంద్ర‌బాబు నాయుడు గారిని ముఖ్య‌మంత్రిని చేసేందుకు మ‌న‌స్ఫూర్తిగా ప‌నిచేస్తామ‌ని చెప్పారు.

Husband joins YCP... Wife jumps to TDP..
Husband joins YCP… Wife jumps to TDP..

ఏదేమైనా ఎస్ కోట‌లో ఇది వైసీపీకి భారీ షాక్‌గా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. ఎస్ కోట విశాఖ‌ప‌ట్నం పార్ల‌మెంటు ప‌రిధిలో ఉంది. ఇక ఎస్ కోట టీడీపీ టిక్కెట్ కోసం మాజీ ఎమ్మెల్యే, ప్ర‌స్తుత‌ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ కోళ్ల లలితకుమారి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ పోటీప‌డుతున్నారు. ఈ చేరిక‌లు ఇక్క‌డ టీడీపీలో మామూలు ఉత్సాహం నింప‌లేద‌నే చెప్పాలి.

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju