Suriya: హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరో సూర్యకి తమిళ్ తో పాటు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఎప్పటినుండో తెలుగులో ఒక స్ట్రైట్ సినిమా చేయాలని ఎదురుచూస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీకి చెందిన చాలామంది టాప్ మోస్ట్ దర్శకులు హీరో సూర్యకి కథలు కూడా వినిపిస్తున్నారు. సినిమాల పరంగా సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో సూర్యకి తిరుగులేని క్రేజ్ ఉంది. ఎక్కువ ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ తన నటనను అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరిస్తాడు. సామాజికంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు.
తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలామంది విద్యార్థులకు ఉచితంగా విద్య అందిస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ రకంగానే గత ఏడాది తమిళనాడులో భారీ ఎత్తున తుఫానులు వచ్చాయి. మిచౌంగ్ తుఫాను తమిళనాడు ను అతలాకుతలం చేసింది. ఈ తుఫాను కారణంగా తమిళనాడులో రోడ్లు.. నీట మునిగాయి. మిచౌంగ్ తుఫాను దాటికి చాలామంది రోడ్డున పడ్డారు. అప్పుడు హీరో సూర్య 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించి అభిమానులను సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని.. వరద బాధితులకు ఉచితంగా భోజనాలు పంపిణీ చేయాలని సూచించారు.
దీంతో తుఫాను ప్రభావిత అన్ని ప్రాంతాలలో సూర్య అభిమానులు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. వారు సమర్థవంతంగా అప్పుడు అన్నదాన కార్యక్రమాలు చేయడంతో వాటిని గుర్తుచేసుకొని తాజాగా అభిమానులందరికీ హీరో సూర్య స్పెషల్ భోజనాలు పెట్టించటం జరిగింది. ఈ సందర్భంగా అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ చెన్నైలో మంచి భోజనాలు ఏర్పాట్లు చేసి వారితో సూర్య మమేకమయ్యారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ప్రతి ఒక్కరిని అభినందించారు.