NewsOrbit
Cinema Global న్యూస్ సినిమా

Oscar Awards 2024: అట్ట‌హాసంగా ఆస్కార్ వేడుక‌.. ఆ ఒక్క సినిమాకే 7 అవార్డులు.. విజేత‌ల ఫుల్ లిస్ట్ ఇదే!

Oscar Awards 2024 Winners List Here

Oscar Awards 2024: యావ‌త్ ప్ర‌పంచ సినీ ప‌రిశ్ర‌మ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే ఆస్కార్ వేడుకను ఈ ఏడాది కూడా అట్ట‌హాసంగా నిర్వ‌హిస్తున్నారు. 96వ అకాడమీ అవార్డుల కార్యక్రమం అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌ డాల్బీ థియేటర్‌ వేదికగా ఆదివారం రాత్రి జ‌రిగింది. గ‌త ఏడాది ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటుకు ఆస్కార్ రావ‌డంతో.. ఇండియన్స్ అంద‌రూ ఈ వేడుక‌కు బాగా క‌నెక్ట్ అయిపోయారు. ఈ నేప‌థ్యంలోనే ఇండియ‌న్ సినిమాలేవీ ఈసారి పోటీలో లేక‌పోయినా.. ఆస్కార్ 2024 విజేత‌లెవ‌రో తెలుసుకునేందుకు మ‌క్కువ చూపిస్తున్నారు.

ఆస్కార్ అవార్డ్స్ 2024 విజేతల పేర్లను అకాడమీ ప్రకటించింది. అయితే అంద‌రూ ఊహించినట్లే ఆస్కార్స్ 2024లో క్రిస్టోఫర్ నోలన్ తెర‌కెక్కించిన‌ ఓపెన్‌హైమర్ మూవీ హవా కొనసాగింది. ఈ బ‌యోగ్రాఫిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీకి కీలకమైన ఉత్తమ చిత్రంతో స‌హా ఏడు ఆస్కార్ లను గెలుచుకుంది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ ఒరిజినల్ స్కోర్ కేట‌గిరీల్లో ఓపెన్‌హైమర్ సినిమాకు అవార్డులు దక్కాయి. పూర్తి జాబితాను ప‌రిశీలిస్తే..

ఆస్కార్స్ 2024 విజేతలు:-

ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్ (పూర్ థింక్స్)
ఉత్తమ నటుడు: సిలియన్ మర్ఫీ (ఓపెన్‌హైమర్‌)
ఉత్తమ చిత్రం: ఓపెన్‌హైమర్
ఉత్తమ దర్శకుడు: క్రిస్టోఫర్ నోలన్ (ఓపెన్‌హైమర్)
ఉత్తమ సహాయ నటి: డా’వైన్ జాయ్ రాండోల్ఫ్ (ది హోల్డోవర్స్)
ఉత్తమ సహాయ నటుడు: రాబర్ట్ డౌనీ జూనియర్ (ఓపెన్‌హైమర్)
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: జస్టిన్ ట్రైట్, ఆర్థర్ హరారీ (అనాటమీ ఆఫ్ ఏ ఫాల్)
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: కార్డ్ జెఫెర్సన్ (అమెరికన్ ఫిక్షన్)
ఉత్తమ ఒరిజినల్ స్కోర్: లుడ్విగ్ గోరాన్సన్ (ఓపెన్‌హైమర్)
ఉత్తమ ఒరిజినల్ సాంగ్: బిల్లీ ఎలిష్, ఫిన్నియాస్ ఓ’కానెల్ (బార్బీలోని వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్? సాంగ్‌కి)
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్: 20 డేస్ ఇన్ మారియుపోల్
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్: ది లాస్ట్ రిపేర్ షాప్
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్: ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (యూకే)
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్: ది బాయ్ అండ్ ది హెరాన్
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్: ది వండర్ ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్
ఉత్తమ యానిమేటెడ్ షార్ట్: వార్ ఈజ్ ఓవర్!
ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఓపెన్‌హైమర్
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: గాడ్జిల్లా మైనస్ వన్
బెస్ట్ సౌండ్: ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: పూర్ థింగ్స్
బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్: ఓపెన్‌హైమర్
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: పూర్ థింగ్స్
బెస్ట్ హెయిర్ అండ్ మేకప్: పూర్ థింగ్స్

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri