NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Yediyurappa: కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పకు బిగ్ షాక్ .. లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ పొక్సో కేసు నమోదు

Yediyurappa: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. 17 ఏళ్ల బాలికపై ఆయన లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆయనపై పోలీసులు పొక్సో కేసు నమోదు చేశారు.

yediyurappa

నెల రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 2వ తేదీన ఓ చీటింగ్ కేసు విషయంలో సహాయం కోసం ఒక మహిళ తన 17 సంవత్సరాల కూతురితో పాటు యడ్యూరప్పను కలిసేందుకు వెళ్లారుట. ఆ సమయంలో తన కుమార్తెను బీజేపీ నేత బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. గురువారం సాయంత్రం వాళ్లు పోలీసులను ఆశ్రయించగా..అర్ధరాత్రి తర్వాత పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

మరో వైపు యడియూరప్ప కార్యాలయం ఈ ఆరోపణలను ఖండించింది. గతంలోనూ పలువురిపై ఇలాంటి ఆరోపణలు చేశారని పేర్కొంది. వారు ఇప్పటి వరకూ 53 ఫిర్యాదులు చేశారంటూ ఆ జాబితాను విడుదల చేసింది. ఈ ఆరోపణలపై యడియూరప్ప కూడా స్పందించారు. ‘కొన్ని రోజుల క్రితం ఓ మహిళ తనకు సమస్య ఉందంటూ నా ఇంటికి వచ్చింది. దీనిపై ఆరా తీసి, ఆమెకు సాయం చేయాలని పోలీస్ కమిషనర్ కు చెప్పాను. ఆ తర్వాత ఆమె నా గురించి వ్యతిరేకంగా మాట్లాడుతోంది. ఈ విషయాన్ని పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. గురువారం ఆమె నాపై కేసు పెట్టింది. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. దీని వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని ఇప్పుడే చెప్పలేను; అని యడియూరప్ప పేర్కొన్నారు.

ఈ విషయంపై కర్ణాటక హోంశాఖ మంత్రి జి పరమేశ్వర మాట్లాడుతూ.. మాజీ సీఎం యడియూరప్ప తన కుమార్తెపై లైంగిక దాడి చేసినట్లు సదాశివనగర్ పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. వాస్తవాలు వెలుగులోకి వచ్చే వరకూ ఇంతకు మించి వివరాలు చెప్పలేనని అన్నారు. ఇందులో మాజీ సీఎం ప్రమేయం ఉన్నందున ఇది చాలా సున్నితమైన కేసు అని పేర్కొన్నారు. ఈ కేసులో రాజకీయ కోణాన్ని మంత్రి పరమేశ్వర తోసిపుచ్చారు.

కర్ణాటకకు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా యడియూరప్ప పని చేశారు. సీఎం పదవి వీడిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు. గత ఏడాది నవంబర్ లో ఆ బాధ్యతలను హైకమాండ్ ఆయన కుమారుడు విజయేంద్ర కు అప్పగించింది. ప్రస్తుతం యడియూరప్ప బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులుగా కొనసాగుతున్నారు.

YS Jagan: మరో మారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించిన సీఎం వైఎస్ జగన్

Related posts

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?