NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రేవంత్‌కు షాక్: తెలంగాణ ముఖ్య‌మంత్రిగా పొంగులేటి..?

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చారు. ఆయన ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొన్ని నియోజకవర్గాలపై బలంగా పడింది. ఈ క్రమంలోనే ఈ రెండు జిల్లాలలో కాంగ్రెస్ భారీగా సీట్లు సాధించడంతోపాటు.. రాష్ట్రంలో అధికారంలోకి రావడంలో కీలకం అయింది. పొంగులేటి శక్తి సామర్థ్యాలు, బలాలు కాంగ్రెస్ అధిష్టానానికి కూడా తెలుసు. అందుకే ఆయనకు కీలకమైన మంత్రిత్వ శాఖలు కట్టబెట్టారు. ఇక వచ్చే పార్లమెంటు ఎన్నికలలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఖమ్మం పార్లమెంటు సీటు దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇటీవల సోషల్ మీడియాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారంటూ ఒకటే ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ నేత‌లు కేటీఆర్, హ‌రీష్ రావు ప‌లుసార్లు తాము రేవంత్ స‌ర్కార్‌ను కూల్చ‌బోమ‌ని.. కానీ నలగొండ, ఖమ్మం నుంచి ఉన్న బాంబులే కూల్చేస్తాయని చెబుతూ వస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి, రేవంత్ రెడ్డి సర్కార్‌ను కూల్చివేస్తారా ? అన్నట్టుగా చర్చ జరుగుతుంది.

ఈ ప్రచారానికి కొనసాగింపుగా గాదె ఇన్నయ్య లాంటి కొంతమంది అప్రకటిత మేధావులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని టార్గెట్‌గా చేసుకుని ఆయనపై విమర్శలు చేస్తున్నారు. బీజేపీతో ఒప్పందం చేసుకునే పొంగులేటి కాంగ్రెస్‌లోకి వచ్చారని లోక్‌స‌భ ఎన్నికలు పూర్తయ్యాక తన వర్గం ఎమ్మెల్యేలను తీసుకుని బీజేపీలోకి వెళ్తారని అప్పుడు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చి పొంగులేటి కొత్త సీఎం అవుతారని అంటున్నారు.

మరి కొంతమంది మాత్రం కాంగ్రెస్ హై కమాండ్ రేవంత్ ను మార్చేసి.. పొంగులేటిని సీఎంను చేస్తుందని అంటున్నారు. ఈ ప్రచారం ఇప్పుడు తెలంగాణలో తీవ్రతరం అవుతోంది. ఇది కావాలని కొందరు బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళు చేస్తున్న పనాగం అన్న సందేహాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి. ఇది పొంగులేటి వరకు వెళ్లడంతో ఆయన స్పందించారు. పళ్ళు ఉన్న చెట్టుకే రాళ్లు తగులుతాయని.. తన దగ్గర పండ్లు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి వెంట రోజు ఉంటే నెంబర్ 2 ఎలా ? అవుతానని ప్రశ్నించారు. నేను సీఎం కావాలంటే హైకమాండ్‌ కూడా కొన్ని ఈక్వేషన్లు చూస్తుంది క‌దా అని ప్రశ్నించారు. ప్రతి నాయకుడికి సీఎం కావాలనే కోరిక ఉంటుంది. కానీ.. ఇలా ప్రచారం జరిగితే మాత్రం పార్టీలో గడ్డు పరిస్థితి ఏర్పడటానికి ఎక్కువ కాలం పట్టదు.

Related posts

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?