NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ర‌ఘురామ గారి ఎఫెక్ట్‌… టీడీపీలో ఎవ‌రికి మూడుతుందో..!

టీడీపీ అభ్య‌ర్థుల జాబితాలు ఇప్ప‌టికేరెడీ అయ్యాయి. ఇక‌, ఐదు స్థానాల‌కు మాత్ర‌మే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాల్సి ఉంది. అయితే.. ఇప్పుడు అనూహ్యంగా వైసీపీ రెబ‌ల్ ఎంపీ.. ర‌ఘురామ‌కృష్ణ‌రాజును టీడీపీలో చేర్చుకునేందుకు చంద్ర‌బాబు పావులు క‌దుపు తున్నారు. దీనికి ర‌ఘురామ రాజు కూడా రెడీ అవుతున్నారు. ఎందుకంటే.. ఆయ‌న‌కు బీజేపీ న‌ర‌సాపురం టికెట్ ఇస్తుంద‌ని ఆశించారు. కానీ, ఆయ‌న ఆశ‌లు ఎక్క‌డా నెర‌వేర‌లేదు. వివిధ కార‌ణాల‌తో ఆయ‌నను అస‌లు బీజేపీ ప‌ట్టించుకోలేదు. దీంతో ఆయ‌న కోరుకున్న న‌ర‌సాపురం పార్ల‌మెంటుసీటును బీజేపీ వేరే వారికి ఇచ్చింది.

దీంతో ఇప్పుడు ర‌ఘురామ రాజు ఖాళీ అయిపోయారు. దీంతో ఆయ‌న‌పైనా.. ఆయ‌న‌ను వెనుకాల ఉండి న‌డిపించార‌నే వాద‌న వినిపిస్తున్న‌చంద్ర‌బాబుపైనా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇది నిజ‌మే. వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత‌.. అంటే రెబ‌ల్‌గా మారిన త‌ర్వాత‌.. ర‌ఘురామ రాజు..చంద్ర‌బాబును అనేక సంద‌ర్భాల్లో పొగిడారు. ఇద్ద‌రూ క‌లిసి ప‌లు కార్య‌క్ర‌మాల్లోనూ పాల్గొ న్నారు. ఇటీవ‌ల ఏకంగా జెండా స‌భ‌లోనూ చంద్ర‌బాబు చెంత ప్ర‌సంగించారు. ఇక‌, టీడీపీ అనుకూల మీడియాల్లో ఆయ‌న స్వ‌రం రోజూ వినిపించింది. దీనిలో మెజారిటీ భాగం వైసీపీకి వ్య‌తిరేకంగా ఉన్న‌ప్ప‌టికీ.. పావ‌లా వంతైనా చంద్ర‌బాబును పొగిడారు.

దీంతో ర‌ఘురామ‌కు ఇప్పుడు టికెట్ ల‌భించ‌క‌పోవ‌డంతో ఆయ‌న ఒత్తిడి కూడా చంద్ర‌బాబుపై ప‌డింది. దీంతో బీజేపీ ఎలానూ ఇవ్వ‌లేదు కాబ‌ట్టి.. తాము కూడా ఇవ్వ‌క‌పోతే ఎలా అని చంద్ర‌బాబునిర్న‌యించేసుకున్నారు. ఈ క్ర‌మంలో తొలుత ఆయ‌న‌ను విజ‌య‌న‌గ‌రం ఎంపీ సీటును ఇవ్వాల‌ని భావిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నారు. సోమ‌వారం కుప్పం ప‌ర్య‌ట‌న‌లో ఉన్న చంద్ర‌బాబు .. ఇదే విష‌యంపై ర‌ఘురామ‌కు ఫోన్ చేసి మాట్లాడిన‌ట్టు తెలుస్తోంది. కానీ, ఆయ‌న వెళ్లేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేయ‌లేదు. పైగా తాను ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాను వీడేది లేద‌ని కూడా చెప్పిన‌ట్టు స‌మాచారం.

అయితే.. ప‌శ్చిమ‌లోని ఎంపీ సీటు ఏలూరు ఇప్ప‌టికే అయిపోయింది. ఇప్పుడు మారిస్తే బాగోదు కూడా. అందుకే ర‌ఘురామ రాజును అసెంబ్లీకి పంపించాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలో అది కూడా ప‌శ్చిమ‌లోని సీట్ల నుంచి ఒక‌టి ఎంపిక చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. కానీ, ఇప్ప‌టికే ఇక్క‌డ సీట్ల‌ను ఫిల్ చేసేశారు. ఆచంట నుంచి పితాని స‌త్య‌నారాయ‌ణ‌, పాల‌కొల్లు నుంచి నిమ్మ‌ల రామానాయుడు, ఉండి నుంచి మంతెన రామ‌రాజు ఉన్నారు. త‌ణుకు ఆరిమిల్లి రాధాకృష్ణ‌కు ఇచ్చారు.

ఇప్పుడు వీరిలో ఒక‌రిని ఆపి.. ఆ ప్లేస్‌ను ర‌ఘురామ‌కు ఇచ్చే అవ‌కాశం ఉంద‌న టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ క్ర‌మంలో ఆచంట సీటు వైపు ఎక్కువ‌గార‌ఘురామ మొగ్గు చూపుతున్నార‌ని స‌మాచారం. ఇది కుద‌ర‌ని ప‌క్షంలో ఉండి సీటును ఖ‌చ్చితంగా ఆయ‌న‌కు కేటాయించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఏదేమైనా.. ప‌శ్చిమ‌లోని ఈ నాలుగు స్థానాల్లో ఒక‌టి ర‌ఘురామ కోసం త్యాగం చేయాల్సిన ప‌రిస్థితి వీరికి త‌ప్ప‌ద‌ని చంద్ర‌బాబు సంకేతాలు పంపేసిన‌ట్టు తెలిసింది. మ‌రి ఎవ‌రు ఎలా ఎక్క‌డ త్యాగాలు చేస్తారో చూడాలి.

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N