Bhimaa: టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హిట్ ముఖం చూసి చాలా ఏళ్లే అవుతోంది. ఇంకా చెప్పాలంటే 2014లో వచ్చిన లౌక్యం తర్వాత గోపీచంద్ ఖాతాలో సరైన హిట్ అనేది పడలేదు. అప్పటినుంచి సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు గోపీచంద్ అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఇటీవల ఈయన భీమా మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. కన్నడ డైరెక్టర్ ఏ హర్ష తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించారు.
వెన్నెల కిషోర్, రఘుబాబు, శుభలేఖ సుధాకర్, నరేష్, ముఖేష్ తివారీ, నాజర్, పూర్ణ, రోహిణి తదితరులు కీలక పాత్రలను పోషించారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కెకె రాధామోహన్ నిర్మించిన భీమా చిత్రం మహా శివరాత్రి కానుకగా మార్చి 8న విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ లభించింది.
యాక్షన్, కామెడీ, బ్రదర్ సెంటిమెంట్, సూపర్ నేచురల్ ఎలిమెంట్, లవ్.. వీటన్నిటిని కలిసి మాస్ మసాలా మూవీను భీమాను రూపొందించారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ భీమాగా మరియు పురోహితుడు రామాగా గోపీచంద్ దిపాత్రాభినయం చేశాడు. రెండు పాత్రలకు చక్కటి వేరియేషన్స్ చూపిస్తూ తన ఎనర్జిటిక్ యాక్టింగ్ తో చెలరేగిపోయాడు. కానీ రోటీన్ స్టోరీ, బలహీనమైన స్క్రీన్ ప్లే సినిమాకు మైనస్ అయ్యాయి. యావరేజ్ టాక్ లభించడం, పోటీగా దిగిన విశ్వక్ సేన్ గామికి హిట్ టాక్ దక్కడంతో భీమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది.
దీంతో గోపీచంద్ ఖాతాలో మరో పరాజయం వచ్చి పడింది. ఇదిలా ఉంటే.. తాజాగా భీమా ఓటీటీ రిలీజ్కు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ తెరపైకి వచ్చింది. థియేటర్స్ లో విడుదలై నెల తిరక్క ముందే గోపీచంద్ కొత్త చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధం అవుతోంది. భీమా సినిమా డిజిటల్ రైట్స్ ను సాలిడ్ ధరకు ప్రముఖ ఓటిటి సమస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. తాజాగా స్ట్రీమింగ్ డేట్ ను హాట్స్టార్ లాక్ చేసింది. ఏప్రిల్ 5న భీమా చిత్రం హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వబోతోంది.
తెలుగు తో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక భీమా ఓటీటీ రిలీజ్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడం ఒక్కటే మిగిలి ఉంది. కాగా, గోపీచంద్ ప్రస్తుతం శ్రీను వైట్ల డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది గోపీచంద్ కు 32వ చిత్రం. చిత్రాలయం స్టూడియోస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1గా వేణు దోనేపూడి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీచంద్, శ్రీను వైట్ల కాంబోలో వస్తున్న తొలి సినిమా ఇది. ఈ చిత్రానికి విశ్వం అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమా విజయం ఇటు గోపీచంద్ తో పాటు అటు శ్రీను వైట్లకు కూడా చాలా కీలకం.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!