NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Premalu: తెలుగులో న‌యా రికార్డు సెట్ చేసిన ప్రేమ‌లు.. ఇప్ప‌టివ‌ర‌కు ఎన్ని కోట్లు వ‌సూల్ చేసిందో తెలుసా?

Premalu: ఒక భాషలో హిట్ అయిన చిత్రాన్ని ఇతర భాషల్లో రీమేక్ చేయడం లేదా డబ్ చేసి విడుదల చేయడం అనేది ఎప్పటినుంచో వస్తున్న పద్ధతి. ఈ నేపథ్యంలోనే ఇటీవల టాలీవుడ్ లో ఓ మలయాళ డబ్బింగ్ చిత్రం విడుదల అయింది. అదే ప్రేమలు. గిరీష్ ఏడీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న యూత్ ఫుల్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. నస్లేన్ కె. గఫూర్, మమితా బైజు, అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్, అఖిల భార్గవన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల‌ను పోషించారు.

భావన స్టూడియోస్ బ్యానర్‌పై ఫహద్ ఫాసిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ నిర్మించిన ఈ సినిమాకు విష్ణు విజయ్ సంగీతం అందించారు. 2024 ఫిబ్రవరి 9న మ‌ల‌యాళంలో విడుద‌లైన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చి వంద కోట్ల రేంజ్ లో వ‌సూళ్ల‌ను అందుకుంది. ఈ నేప‌థ్యంలోనే ప్రేమ‌లు చిత్రాన్ని ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి త‌న‌యుడు ఎస్‌.ఎస్‌. కార్తికేయ డ‌బ్ చేసి విడుద‌ల చేశాడు.

ఎటువంటి ప్ర‌మోష‌న్స్ లేకుండా 2024 మార్చి 8న విడుద‌లైన ప్రేమ‌లు చిత్రం తొలి ఆట నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రేమలు సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్‌ను ఎస్ఎస్ కార్తికేయ రూ. 1.20 కోట్లకు కొన్నారు. దీంతో రూ. 1.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ.. విడుద‌లైన నాలుగు రోజుల్లో బాక్సాఫీస్ వ‌ద్ద క్లీన్ హిట్ గా నిలిచింది. కేవ‌లం మౌత్ టాక్ తోనే అద్భుత‌మైన క‌లెక్ష‌న్స్ ను సొంతం చేసుకుంటూ తాజాగా తెలుగులో న‌యా రికార్డును సెట్ చేసింది. మ‌ల‌యాళ చిత్రాల ప‌రంగా తెలుగులో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను సొంతం చేసుకున్న సినిమాగా ప్రేమ‌లు మొద‌టి స్థానంలో నిలిచింది.

Premalu OTT release updates

ఇది వరకు మ‌ల‌యాళ స్టార్ మోహన్ లాల్ నటించిన పులి మురుగన్ చిత్రం తెలుగు లో మన్యం పులిగా విడుద‌లై రూ. 9.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ వ‌సూళ్ల‌ను అందుకుని రికార్డు సృష్టించింది. ఈ రికార్డును టోవినో థామ‌స్ యాక్ట్ చేసిన 2018 మూవీ బ్రేక్ చేసింది. తెలుగులో టోట‌ల్ ర‌న్ లో రూ. 10.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సాధించింది. అయితే తాజాగా విడుద‌లైన ప్రేమ‌లు 2018 రికార్డును అధిగ‌మించింది.

తెలుగులో విడుద‌లైన ప‌ద్దెనిమిది రోజుల్లోనే ప్రేమ‌లు చిత్రం రూ. 12 కోట్ల‌కు పైగా గ్రాస్ క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకుంది. తెలుగులో మ‌ల‌యాళ స్టార్ హీరోల‌ సినిమాల‌కు సాధ్యం కానీ సెన్సేష‌న‌ల్ రికార్డును ప్రేమ‌లు సొంతం చేసుకుని ట్రెండ్ సెట్ చేసింది. కాగా, ప్రేమ‌లు సినిమా విష‌యానికి వ‌స్తే..హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్. హైదరాబాద్‌‌‌లో ఐటీ జాబ్ చేసే ఇద్దరు మలయాళీ అమ్మాయిలకి.. గేట్ కోచింగ్ తీసుకుంటున్న ఇద్దరు మలయాళీ కుర్రాళ్లకి మధ్య నడిచే లవ్ స్టోరీనే ప్రేమలు. చాలా సింపుల్ క‌థ‌ను ఎంతో ఇంట్రెస్టింగ్ గా వెండితెర‌పై గిరీష్ చూపించారు. దీంతో ఈ చిత్రం యూత్ కు పర్ఫెక్ట్ గా క‌నెక్ట్ అయింది.

Related posts

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju