NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

Tamannaah: తమన్నా భాటియా.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ ముద్దుగుమ్మ తెలియని సినీ ప్రియులు ఉండరు. ముంబైలో జన్మించిన త‌మ‌న్నా.. 13 ఏళ్ల వయసులోనే నటనలో శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది. 2005లో అభిజీత్ సావంత్ ఆల్బమ్ ఆప్కా అభిజీత్ లోని లఫ్జో మే పాటతో తమన్నా వినోద పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత చాంద్ సా రోషన్ చెహ్రా సినిమాతో తొలిసారి వెండితెర‌పై మెరిసింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా ప‌డింది. అదే సంవత్సరం 2006లో శ్రీ మూవీతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి కేడి చిత్రంతో తమిళ ఇండ‌స్ట్రీలోకి ప్ర‌వేశించింది. 2007లో వ‌చ్చిన‌ హ్యాపీ డేస్ చిత్రం త‌మ‌న్నా కెరీర్ కు ట‌ర్నంగ్ పాయింట్ గా నిలిచింది.

శేఖ‌ర్ క‌మ్ముల డైరెక్ట్ చేసిన ఈ చిత్రం భారీ విజ‌యాన్ని సాధించ‌డంతో తమన్నా వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో న‌టిస్తూ అత‌ని కాలంలోనే స్టార్ హోదాను ద‌క్కించుకుంది. ద‌క్షిణాదితో పాటు ఉత్త‌రాదిలో కూడా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకుంది. ఇండస్ట్రీ లోకి వచ్చి 20 ఏళ్లు అవుతున్నా తరగని అందం, తగ్గని ఆఫర్లతో కెరీర్ ను పరుగులు పెట్టిస్తోంది. ప్ర‌స్తుతం చేతి నిండా సినిమాలు, కుదిరిన‌ప్పుడ‌ల్లా వెబ్ సిరీస్ లు, మ‌రోవైపు బ్రాండ్ ప్ర‌మోష‌న్స్ చేస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపేస్తోంది.

ఈ సంగ‌తి పక్క‌న పెడితే.. త‌మ‌న్నాను అభిమానులు మ‌రియు సినీ తార‌లు ముద్దుగా మిల్కీ బ్యూటీ అని పిలుస్తుంటారు. ఈ విష‌యం అంద‌రికీ తెలుసు. కానీ త‌మ‌న్నాకు మ‌రో పేరు కూడా ఉంది. ఇంత‌కీ ఆ పేరేంటో తెలుసా.. డ్యాన్సింగ్ డాల్‌. ఇటువంటి పేరు త‌మ‌న్నాకు ఉంద‌న్న సీక్రెట్ ఆమె ఫ్యాన్స్ కు సైతం తెలియ‌దు. మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం ఏంటంటే.. త‌మ‌న్నాకు డ్యాన్సింగ్ డాల్ అని పేరు పెట్టింది మ‌న టాలీవుడ్ హీరోనే.

ఆ హీరో మ‌రెవ‌రో కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌. త‌మ‌న్నా, అల్లు అర్జున్ జంట‌గా బద్రినాథ్ చిత్రంలో న‌టించారు. వి.వి.వినాయక్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని అల్లు అర‌వింద్ భారీ బ‌డ్జెట్ తో గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నిర్మించారు. 2011లో ఎన్నో అంచ‌నాల న‌డుమ విడుద‌లైన బ‌ద్రినాథ్ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. అయితే ఈ సినిమాలో సాంగ్స్ మ‌రియు అల్లు అర్జున్ – త‌మ‌న్నా కెమిస్ట్రీ మాత్రం బాగానే అల‌రించారు.

ఇక‌పోతే స్వతహాగా అల్లు అర్జున్ ఎంత‌ గొప్ప డ్యాన్స‌రో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అటువంటి ఆయ‌న్ను బద్రినాథ్ షూటింగ్ స‌మ‌యంతో త‌మ‌న్నా త‌న డాన్సింగ్ టాలెంట్ తో ఫిదా అయ్యేలా చేసింది. అల్లు అర్జున్ తో పాటు ప‌ర్ఫెక్ట్ సింక్ లో స్టెప్పులు వేస్తూ అద‌ర‌గొట్టేసింద‌ట‌. ఈ నేప‌థ్యంలోనే త‌మ‌న్నాకు అల్లు అర్జున్ అప్ప‌ట్లో డ్యాన్సింగ్ డాల్ అని బిరుదు ఇచ్చార‌ట‌. అలాగే ఇండ‌స్ట్రీలో త‌మ‌న్నాకు మిల్కీ బ్యూటీతో పాటు డ్యాన్సింగ్ డాల్ అనే పేరు కూడా వ‌చ్చింది. కాగా, త‌మ‌న్నా సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో నిక్కిల్ అద్వానీ దర్శకత్వంలో జాన్ అబ్రహంతో క‌లిసి వేదా అనే యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో న‌టిస్తోంది. అలాగే త‌మిళంలో అరణ్మనై 4 అనే హారర్-కామెడీ సీక్వెల్ చేస్తోంది. సుందర్ సి ఈ మూవీకి ద‌ర్శ‌కుడు. తెలుగులో ఒదెల 2 అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీకి క‌మిట్ అయింది. అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్న‌ ఈ చిత్రంలో తమన్నా భాటియా ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. ఇటీవ‌లె ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. వీటితో మ‌రికొన్ని ప్రాజెక్ట్స్ కూడా త‌మ‌న్నా చేతిలో ఉన్నాయి.

Related posts

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

bharani jella

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar