Tillu Square Collections: సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్. మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నేడు అనగా మార్చ్ 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. 2022లో విడుదలైన దీని ఫస్ట్ పార్ట్ భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇక ఈ రెస్పాన్స్ చూసి మరోసారి ఈ మూవీ సీక్వెల్ తో సెన్సేషన్ పుట్టించేందుకు రెడీ అయ్యారు. ఎన్నో అంచనాలు నడుమ నేడు రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ మూవీ ట్రైలర్, టీజర్, పోస్టర్స్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ఇక టిల్లు స్క్వేర్ మూవీ కి అసలు షోస్ పడకుండానే భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి.
ఇప్పటికే బిజినెస్ పరంగా మంచి జోరు చూపించిన ఈ మూవీకు అడ్వాన్స్ బుకింగ్ కూడా అదిరిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ముందస్తు బుకింగ్ భారీగా నమోదు అయినట్లు తెలుస్తుంది. ఒక్క హైదరాబాదులో టిల్లు స్క్వేర్ మూవీ కి రూ.1.25 కోట్ల గ్రాస్ బుకింగ్స్ నమోదైనట్లు ట్రెండ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం గా తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.5 కోట్ల గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు అయినట్లు సమాచారం. ఇక ఓవర్సీస్ లో ప్రీ టికెట్ సేల్స్ ద్వారా 250k డాలర్స్ మార్క్ ను టిల్లు స్క్వేర్ అందుకున్నట్లు తెలుస్తుంది. నార్త్ అమెరికాలో 450k డాలర్స్ ప్రీమియర్స్ నుంచి వచ్చాయట. అదేవిధంగా ఆస్ట్రేలియాలో 47k డాలర్స్ వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఇంకా డే పూర్తి కాలేదు. కనుక ఇంకా ఎక్కువ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.
ఇది హాఫ్ డే కలెక్షన్స్ మాత్రమే. ఇక ఈ మూవీ యొక్క ఫస్ట్ పార్ట్ కి నార్త్ అమెరికాలో ఫుల్ రన్ లో 554k రాగా ఆస్ట్రేలియాలో 111k డాలర్స్ వచ్చాయి. ఇక డీజే టిల్లు కంటే ఎక్కువగానే టిల్లు స్క్వేర్ హవా చూపిస్తుందని చెప్పుకోవచ్చు. డీజే టిల్లుని తలదన్నే దిశగా పరుగులు తీస్తుంది టిల్లు స్క్వేర్. మొత్తానికి అయితే ఇన్నాళ్లు అనుపమ మరియు డైరెక్టర్, హీరో పడిన కష్టానికి ఫలితం దొరికింది. ఏ సినిమాలోను ఇంత బోల్డ్ లుక్ లో కనిపించని అనుపమ ఈ సినిమాలో కనిపించింది. ఇక ఈ మూవీలో సిద్దు మరియు అనుపమ మధ్య జరిగే రొమాన్స్ కూడా మెయిన్ హైలెట్గా నిలిచిందని చెప్పుకోవచ్చు.
అనుపమ గతంలో స్టార్ హీరోల సినిమాలలో నటించింది. కానీ ఇప్పటివరకు ఇటువంటి క్యారెక్టర్స్ లో ఎప్పుడూ నటించలేదు. ఇంత బోల్డ్ గా అందాలను ఎక్స్ప్రెస్ చేస్తూ అస్సలు కనిపించలేదు. కానీ మొట్టమొదటిసారిగా టిల్లు స్క్వేర్ లో తన అందాలను ఆరబోసింది ఈ ముద్దుగుమ్మ. ఇక తన అందాలకు తగిన న్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు తాను ఎదుర్కొన్న ట్రోల్స్ కి సరైన గుర్తింపు దక్కింది. అదేవిధంగా ఈ సినిమాలో సిద్దు ఎఫెక్ట్స్ కూడా వేరే లెవల్ అని చెప్పుకోవచ్చు. మరి రానున్న రోజుల్లో ఈ మూవీ ఇంకెన్ని వసూళ్లను రాబట్టి ఎటువంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి.