NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

Top 10 Tollywood Heroes: సినీ పరిశ్రమలో తమ హీరో నెంబర్ వన్ అంటే.. తమ హీరో నెంబర్ వన్ అని అభిమానులు ఎప్పటికప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. ఈ నెంబర్ల గేమ్ ను హీరోలు పెద్దగా పట్టించుకోకపోయినా.. అభిమానులు మాత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. టాలీవుడ్ లో చూసుకుంటే ప్రస్తుతం యంగ్ జనరేషన్ హీరోల హవానే ఎక్కువగా నడుస్తోంది. దాదాపు అర డజన్ కు పైగా హీరోలు టాలీవుడ్ టాప్ స్టార్స్ గా స‌త్తా చాటుతున్నారు. మరి వారిలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నది ఎవరు అన్నది తాజాగా వెళ్లడైంది. ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ఎప్ప‌టిక‌ప్పుడు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ తారలపై, సినిమాలపై సర్వేలు నిర్వహిస్తుంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే.

అయితే తాజాగా సినీ లవర్స్ అభిప్రాయాలు సేకరించి టాలీవుడ్ టాప్ 10 హీరోలు ఎవ‌రో తేల్చింది. ఈ మేర‌కు ఒక జాబితా విడుద‌ల చేసింది. చాలా కాలం నుంచి టాప్‌-3 లో ప్ర‌భాస్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్ ఉండేవారు. కానీ తాజా స‌ర్వేలో టాలీవుడ్ హీరోల స్థానాలు తారుమారు అయ్యాయి. టాప్‌-1 లో మాత్రం ఎప్ప‌టిలాగా ప్ర‌భాసే ఉన్నాడు. బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న ప్ర‌భాస్‌.. హిట్లు ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్నాడు. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నెంబ‌ర్ 1గా స‌త్తా చాటుతున్నాడు. ఆయ‌న స్థానాన్ని భ‌ర్తీ చేయ‌డం మిగ‌తా హీరోల‌కు పెద్ద స‌వాల్‌గా మారింది.

ఇక ప్ర‌భాస్ త‌ర్వాత రెండో స్థానాన్ని టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ద‌క్కించుకున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక పాన్ ఇండియా మూవీ చేయ‌క‌పోయినా కూడా మ‌హేష్ బాబు దేశ‌వ్యాప్తంగా భారీ పాపుల‌రిటీ సంపాదించుకుని టాలీవుడ్ లో టాప్ 2 స్థానంలో నిల‌బ‌డ్డాడు. పుష్ప ది రైస్ తో నేష‌న‌ల్ వైడ్ గా క్రేజ్ సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆర్మాక్స్ స‌ర్వేలో మూడో స్థానాన్ని ద‌క్కించుకున్నాడు.

అలాగే టాప్ 2లో ఉండాల్సిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇప్పుడు టాప్ 4లోకి ప‌డిపోయాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్ర‌స్తుతం దేవ‌ర‌తో పాటు హిందీలో స్ట్రైట్ గా వార్ 2 మూవీ చేస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఐదో స్థానంలో ఉన్నారు. ఈయ‌న కూడా ఆర్ఆర్ఆర్ మూవీతోనే గ్లోబ‌ల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. గేమ్ ఛేంజర్ తో ఈ ఏడాది ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధం అవుతున్నాడు.

సినిమాల క‌న్నా కూడా రాజ‌కీయాల‌పై ఎక్కువ ఫోక‌స్ పెట్టిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆర్మాక్స్ సంస్థ నిర్వ‌హించిన తాజా సర్వేలో ఆరో స్థానంలో నిల‌బ‌డ్డారు. అలాగే ఏడో స్థానంలో న్యాచుర‌ల్ స్టార్ నాని, ఎనిమిదో స్థానంలో మాస్ మ‌హారాజా ర‌వితేజ ఉన్నారు. ఇక టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ తొమ్మిదో స్థానాన్ని సొంతం చేసుకోగా.. టాప్ 10లో మెగాస్టార్ చిరంజీవి నిలిచారు.

Related posts

జూన్ 1 వ‌ర‌కు పాల‌న ఎవ‌రిది? చంద్ర‌బాబే అన్నీనా?

ఏపీ చ‌రిత్ర‌లోనే ఇవ‌న్నీ తొలిసారి.. మీరు గ‌మ‌నించారా ?

నాడు గెలిపించి.. నేడు ఓడించేందుకు.. పీకే ప్లాన్‌లో కొత్త ట్విస్ట్ ఇదే..?

ఏపీలో ఇలాంటి ఎన్నిక‌లు ఫ‌స్ట్ టైమ్‌… అదిరిపోయే ట్విస్టులు ఇవే…?

కూట‌మి పార్టీల్లో ఎందుకీ డౌట్‌… ఎందుకింత టెన్ష‌న్‌..?

Brahmamudi May 16 Episode 411:మాయ వేటలో కావ్య, రాజ్.. దుగ్గిరాల ఇంట్లో అనామిక పంచాయతీ.. ఇందిరా దేవి కోపం.. అప్పు ఎదుటే కావ్య కిడ్నాప్..

bharani jella

Krishna Mukunda Murari May 16 Episode 471: బిడ్డని కనడానికి ముకుంద కండిషన్.. పెళ్లి ఆపడానికి తిప్పలు.. కృష్ణ అనుమానం.. ముకుంద కి మురారి సేవలు..

bharani jella

Nuvvu Nenu Prema May 16 Episode 625: విక్కీకి పద్మావతి సపోర్ట్.. ఉద్యోగం కోసం విక్కీ, పద్దు ప్రయత్నం.. విక్కీ అవమానించిన కృష్ణ..

bharani jella

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

sharma somaraju

Blink OTT: డిజిటల్ ప్రీమియం కి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Megalopolis: 1977లో అఫీషియల్ అనౌన్స్మెంట్.. 2024లో థియేటర్ రిలీజ్.. ఏకంగా 47 ఏళ్ల షూటింగ్ చేసుకున్న హాలీవుడ్ చిత్రం..!

Saranya Koduri

Zee Mahotsavam OTT: టెలివిజన్లో సందడి చేసిన రమ్యకృష్ణ, కాజల్, జయప్రద.. ఓటీటీలో కూడా అందుబాటులో..!

Saranya Koduri

Dakshina Trailer: గూస్బమ్స్ పుట్టించే విధంగా కబాలి హీరోయిన్ మూవీ ట్రైలర్.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఉప్పెన డైరెక్టర్..!

Saranya Koduri

Aquaman And The Lost Kingdom OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న హాలీవుడ్ మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Maya Petika OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పూత్ మూవీ..!

Saranya Koduri