NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BRS: కేసిఆర్ పై కీలక నేత సంచలన వ్యాఖ్యలు

BRS: తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత తీవ్ర గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. లోక్ సభ ఎన్నికల వేళ పలువురు కీలక నేతలు బీఆర్ఎస్ కు బైబై చెబుతుండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన కల్గిస్తొంది. మరో పక్క పార్టీ పట్ల అసంతృప్తి తో ఉన్న నేతలు పార్టీ మారనున్నారు అంటూ వస్తున్న వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.

తాజాగా శాసనమండలి చైర్మన్, సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్వయంగా దీనిపై సుఖేందర్ రెడ్డి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తమని పేర్కొన్నారు. రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్నానని చెప్పారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు కష్టాల్లో ఉందని ఆయన అన్నారు. ఇందుకు గల కారణాలు కూడా వెల్లడించారు సుఖేందర్ రెడ్డి. పార్టీలో నిర్మాణ లోపం, అంతర్గత ప్రజాస్వామ్యం లోపించిందని తెలిపారు. ఎమ్మెల్యే కేంద్రంగా రాజకీయాలు చేయడం వల్లే పార్టీ కష్టాల్లో పడిందని గుత్తా అభిప్రాయపడ్డారు.

తన కుమారుడు అమిత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఇవ్వలేదు అన్నది అవాస్తమని అన్నారు. తన కుమారుడిని ఎంపీగా పోటీలో దింపాలని స్వయంగా కేసిఆర్ కోరారనీ, దానికి అమిత్ కూడా సిద్దమైయ్యారని తెలిపారు. అయితే జిల్లాలోని నాయకుల నుండి సహకారం అందలేదనీ, కొందరు నేతలు తామే పార్టీ మారుతున్నామని చెప్పారనీ, అందుకే అమిత్ పోటీ నుండి తప్పుకున్నారని చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసిఆర్ ను కలిసేందుకు ప్రయత్నించానని, ఆరు నెలలు ప్రయత్నించినా కలవడం సాధ్యం కాలేదని గుత్తా తెలిపారు. ఇప్పటికైనా పార్టీ నిర్మాణంలో నాయకత్వం పై దృష్టి సారించాలని గుత్తా సూచించారు. ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిందని, వాటిని పరిశీలిస్తున్నానని చెప్పారు. న్యాయబద్దంగగా, రాజ్యాంగ బద్దంగా నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.

శానసమండలి చైర్మన్ గా రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న నేతకే కేసిఆర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా కుదరలేదని స్వయంగా గుత్తా వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం అయ్యింది.  అయితే గుత్తా వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్పందించారు. ఆయన సీనియర్ నాయకుడని, పార్టీ నిర్మాణం పై ఆయన సలహాలు తీసుకుంటామన్నారు. ఏ పార్టీ ఎలా ఉందనే విషయాలు గుత్తాకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. గుత్తా మాట్లాడిన అంశాలపై ఎంపీ ఎన్నికల తర్వాత చర్చిస్తామని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పారు.

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

Related posts

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!

ద‌ర్శి : చివ‌రి ఓటు కౌంటింగ్ వ‌ర‌కు గెలిచేది ల‌క్ష్మా… శివ‌ప్ర‌సాదో తెలియ‌నంత ఉత్కంఠ‌..?

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?