విశాఖ: విశాఖ ఈస్ట్ టిడిపి సీనియర్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబును ఎంవిపి పోలీసులు బుధవారం అరెస్టు చేసి స్టేషన్ బెయిల్ తోనే విడుదల చేశారు.
ఎన్నికల అనంతరం విజయోత్సవ ర్యాలీలో ప్రధానమంత్రి మోది, వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డిలపై రామకృష్ణబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగంపై నాడు పోలీసులు కేసు నమోదు చేశారు.
వైసిపి నేతల ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు నేడు రామకృష్ణ బాబును అరెస్టు చేశారు. కొద్దిసేపటికే స్టేషన్ బెయిలు ఇచ్చి విడుదల చేశారు.
రామకృష్ణ బాబు 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూ ప్రజా ప్రతినిధిగా కొనసాగుతున్నారు.