NewsOrbit
సినిమా

ఈ సంక్రాంతికి అందరూ బాగుండాలి

 


అల్లు అర్జున్‌ హీరోగా శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్‌ పతాకాలపై త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) నిర్మిస్తోన్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’. పూజా హెగ్డే నాయిక. ఈనెల 12న ఈ చిత్రం విడుదలవుతోంది ఎస్‌.ఎస్‌.తమన్‌ సంగీతం అందించిన ఈ సినిమా మ్యూజికల్‌ కాన్‌సర్ట్‌ సోమవారం హైదరాబాద్‌ యూసఫ్‌ గూడలోని పోలీస్‌ గ్రౌండ్స్‌లో అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో జరిగింది. సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను చిత్ర నిర్మాతలు అల్లు అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ “ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులతో వైకుంఠపురంలాంటి సెట్‌లో ఈ వేడుకను త్రివిక్రమ్‌గారు చేయడం ఆనందంగా ఉంది. బ్లాక్‌బస్టర్‌ కొట్టేశారు. ఇప్పటికే తమన్‌ పాటలతో, బన్నీ డ్యాన్సులతో, త్రివిక్రమ్‌గారు పంచ్‌ డైలాగ్స్‌తో ఇరగ్గొట్టేశారు. ఇక సినిమా బావుందంటే చాలు.. మెగా ఫ్యాన్స్‌ సినిమా చూసి సక్సెస్‌తో ఇరగ్గొట్టేస్తారు” అన్నారు. ఎస్‌.ఎస్‌.తమన్‌ మాట్లాడుతూ “నేను కూడా బన్నీకి చాలా పెద్ద ఫ్యాన్‌ని. ఒక ఫ్యాన్‌గా ఉంటేనే ఇలా కంపోజ్‌ చేయగలం. త్రివిక్రమ్‌గారికి థ్యాంక్స్‌. ఆయన వల్లే నేను ఇక్కడ నిలబడి ఉన్నాను” అన్నారు. నటుడు సునీల్‌ మాట్లాడుతూ “సినిమా టికెట్‌ కొని థియేటర్‌లోకి వచ్చిన ప్రేక్షకుడిని బన్నీ, పూజా, టబు, సుశాంత్‌, నివేదా, సముద్రఖని, సునీల్‌ ఇలా అందరం మీ ఇంటికి వచ్చినట్లు సినిమా ఉంటుంది. పండగకి మేమే మీ ఇంటికి వచ్చినట్టు ఉంటుంది” అన్నారు. సీనియర్‌ నటి టబు మాట్లాడుతూ “ప్రేక్షకు ప్రేమ చూస్తుంటే మాటలు రావడం లేదు. చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో యాక్ట్‌ చేశాను. ఇంత గ్యాప్‌ తర్వాత తెలుగులో ఈ సినిమా కంటే గొప్పగా రీ ఎంట్రీ ఇవ్వలేనేమో అనిపించింది” అన్నారు. గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ “ఈ వేడుక చూస్తుంటే డబుల్‌ బొనాంజా, సూపర్‌డూపర్‌హిట్‌ సినిమాలా అనిపిస్తుంది. త్రివిక్రమ్‌ సినిమాకు అందమైన పేరు పెట్టాడు. అంతే అందంగా సినిమా ఉంటుంది” అన్నారు. అల్లు అరవింద్‌ మాట్లాడుతూ “ఈ సినిమాను కష్టపడి తీసింది నా స్నేహితుడు రాధాకృష్ణగారే. ఆయనకు అభినందనలు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ చిన్న కథను బ్రహ్మాండంగా తీసి, రిలీజ్‌కు ముందే హిట్‌ అనే రూపాన్ని ఇచ్చాడు. తమన్‌ 2019 వీడ్కోలు చెప్పడానికి ప్రతిరోజూ పండగే సినిమా, ఈ 2020 వెల్‌కమ్‌ చెప్పడానికి అల వైకుంఠపురములో సినిమా ఇచ్చాడు” అన్నారు. దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ “ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరూ ఏదో రకంగా మనసుకు దగ్గరైన వాళ్లే. వాళ్లందరికీ నేను చెప్పే మాట ఒకటే.. వాళ్లందరితో నేను ప్రేమలో ఉన్నాను. ఈ సినిమా రిలీజ్‌ తర్వాత కొద్దిపాటి విరహాన్ని అనుభవిస్తాను. మళ్లీ ఓ కథను రాస్తాను. మళ్లీ మిమ్మల్ని కలుస్తాను. ఈ సినిమాకు మొదలు, చివర అల్లు అర్జునే. ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఏదీ చేసినా హ్యాపీగా చేద్దాం సార్‌ అని అన్నాడు” అని తెలిపారు. అల్లు అర్జున్‌ మాట్లాడుతూ “మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ సమయంలో లవ్‌ సిట్యుయేషన్‌ సాంగ్‌ వచ్చినప్పుడు అందరూ ఎలాంటి సాంగ్‌ ఉండాలనుకుంటున్నారని నన్ను అడిగారు. దానికి నేను అదేమో తెలియదండి.. అందరూ మ్యూజిక్‌ బ్యాండ్స్‌ వాళ్లు ఉండాలని అన్నాను. అందరికీ పిచ్చెక్కి పోయే సాంగ్‌ కావాలని నేను అనగానే తమన్‌ సామజవరగమన సాంగ్‌ను వినిపించాడు. సిరివెన్నెలగారు, సిద్‌ శ్రీరామ్‌గారి వల్ల ఆ పాట స్థాయి ఎంతో పెరిగింది. సాంగ్‌ బాగా వచ్చిందని అనుకున్నాను కానీ.. ఈ పాట ఇంత సెన్సేషన్‌ అవుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. అంత గొప్ప పాట రాసిన సీతారామశాస్త్రిగారు, పాడిన సిద్‌శ్రీరామ్‌కి, పాట కంపోజ్‌ చేసిన తమన్‌కి, ఐడియా ఇచ్చిన త్రివిక్రమ్‌ గారితో సహా పాటకు పనిచేసిన టెక్నీషియన్‌ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్‌. త్రివిక్రమ్‌గారి గురించి చెప్పాలంటే.. ఇంత మందిని కలిపి ఆనందం ఇచ్చేది డైరెక్టరే. మేం టూల్స్‌ అయితే. వాటిని ఉపయోగించుకునే వారు డైరెక్టర్‌ మాత్రమే. అలాంటి త్రివిక్రమ్‌గారితో మూడో సారి కలిసి పనిచేశాను. ఆయనంటే అంతిష్టం. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే బలమైన కారణం ఆయన. నాకు మంచి హిట్‌ సినిమాలు ఇచ్చారు. నా ప్రతి ఇష్టాన్ని త్రివిక్రమ్‌గారు ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా ఎంత చేసినా, ఎంత పేరు తెచ్చుకున్నా అది త్రివిక్రమ్‌గారి వల్లే. చిరంజీవిగారి తర్వాత నాకు ఇష్టమైన వ్యక్తి రజినీకాంత్‌ గారే. అలాంటి రజినీకాంత్‌గారి సినిమా రిలీజ్‌ అవుతుంది. నాకు ఇష్టమైన డైరెక్టర్‌ మురుగదాస్‌గారు చేసిన సినిమా. ఈ సంక్రాంతికి ఆయన సినిమా పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను. అలాగే మా సినిమాతో పాటు సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా విడుదలవుతుంది. మహేష్‌ గారు సహా ఎంటైర్‌ యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌. అలాగే నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి కల్యాణ్‌రామ్‌గారి ’ఎంతమంచివాడవురా’ సినిమా విడుదలవుతుంది. ఆయనకు కూడా అభినందనలు. ఈ సంక్రాంతి అందరికీ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు.

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Leave a Comment