అనీల్ రావిపూడి… యంగ్ డైరెక్టర్స్ లో తనకంటూ ప్రత్యేకమైన జానర్ ని సెట్ చేసుకొని కంటెంట్ ఎంత సీరియస్ గా ఉన్నా, తన మార్క్ కామెడీని మిస్ కాకుండా చూసుకుంటూ వరసగా హిట్స్ అందుకుంటున్నాడు. రీసెంట్ గా ప్రేక్షకులకి సంక్రాంతి కానుకగా ఎఫ్ 2 సినిమాని ఇచ్చిన అనీల్, అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి మంచి టాక్ తెచ్చుకోవడంలో పూర్తిగా సక్సస్ అయ్యాడు. కమర్షియల్ కథకే కామెడీ హంగులద్దే అనీల్ రావిపూడి, ఈసారి కామెడీ కథనే ఎంచుకోని ప్రేక్షకులకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. పండక్కి ఫ్యామిలీ ఆడియన్స్ కి కావాల్సిన సినిమా ఇచ్చిన అనీల్ రావిపూడి, ఈసారి తన నెక్స్ట్ సినిమాకి ఒక సీనియర్ స్టార్ హీరోని లైన్ లో పెడుతున్నాడు.
అనీల్ డైరెక్ట్ చేయబోతున్న ఆ సీనియర్ హీరో ఎవరో కాదు ఈ సంక్రాంతికి ఎన్టీఆర్ బయోపిక్ సినిమాతో పర్వాలేదనిపించిన బాలయ్యనే. మిగిలిన సీనియర్ హీరోలతో పోల్చుకుంటే నందమూరి బాలకృష్ణ మంచి దూకుడు మీదున్నాడు. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఏడాదికి రెండు మూడు సినిమాలు చేయాలిని డిసైడ్ అయినట్లు కనిపిస్తున్న బాలయ్య ఒక సినిమా సెట్స్ పైన ఉండగానే మరో సినిమాని లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ 2పార్ట్ పనుల్లో బిజీగా ఉన్న బాలయ్య, తన నెక్స్ట్ సినిమాని బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయనున్నాడు. సాలిడ్ హిట్స్ కి కేరాఫ్ అడ్రస్ అయిన ఈ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
బోయపాటితో సినిమా అయిపోయాక, బాలయ్య వరస హిట్స్ తో ఫుల్ జోరుమీదున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. రీసెంట్ గా బాలకృష్ణని కలిసి, అనిల్ చెప్పిన లైన్ నచ్చడంతో, బోయపాటి ప్రాజెక్ట్ అయిపోగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. కళ్యాణ్ రామ్‌తో పటాస్ సినిమా తీసి నందమూరి ఫ్యామిలీకి దగ్గరైన ఈ యంగ్ డైరెక్టర్ ఆ టైంలోనే బాలయ్యతో పనిచెయ్యడానికి కథ సిద్ధం చేసుకున్నాడు కానీ బాలయ్య ముందు కమిట్ అయిన ప్రాజెక్ట్స్ తో బిజిగా ఉంటే, రాజా ది గ్రేట్, ఎఫ్-2 ప్రాజెక్ట్స్‌తో వరుస హిట్స్ అనుకోని అనీల్ తన రేంజ్ పెంచుకున్నాడు. ఇప్పుడు అనీల్ రావిపూడి నుంచి ఒక సినిమా వస్తుంది అంటేనే మినిమమ్ గ్యారెంటీ అనే నమ్మకం కలిగించాడు. మరి ఈ నమ్మకాన్ని నిలబెడుతూ బాలయ్యతో చేయబోయే మూవీని కూడా హిట్ గా మలుస్తాడేమో చూడాలి. అన్నీ అనుకున్నట్లు జరిగితే అనీల్ రావిపూడి-బాలయ్యల సినిమా సమ్మర్ లో లాంఛనంగా మొదలయ్యే అవకాశం ఉంది.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!