NewsOrbit
న్యూస్

“ఘాతక్” కమాండోస్… చైనా సైనికులని పరిగెత్తించడం కోసం దిగిన ధీరులు!

చైనా బలగాలు గాల్వన్ లోయ ప్రాంతంలోభారత సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవానులు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గాల్వాన్ లోయలో చైనా సైనికులపై విరుచుకుపడి 43 మందిని హతమార్చిన సంఘటనకు సంబంధించి కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ సమయంలో అప్పటికే 20మంది ప్రాణాలు కోల్పోయిన సమయంలో.. అంత తక్కువ టైంలో చైనా సైనికులపై మెరుపుదాడి చేసిన టీం ఏదని ప్రశ్నలు వస్తున్నాయి. అసలు ఆ టీం ఎవరు.. ఎలా వచ్చారు.. ఆ టిం భారత్ సైన్యంలో ఎలాంటి బలం.. మొదలైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం!

భారతదేశం యొక్క దురదృష్టం ఏమితో తెలియదు కానీ… సరైన మగాడు ఎవడూ పక్కదేశాల్లో లేకపోవడం! మొన్న పాకిస్థాన్ అయినా, నిన్న చైనా అయినా… దొంగదెబ్బలు తీయడం, గిల్లి పారిపోవడం తప్ప… ఎదురుగా నిలిచి రొమ్ము విరిచి పోరాడే చేవలేని చెత్త బ్యాచ్.. ఈ దేశానికి సరిహద్దు దేశాలుగా ఉన్నాయి! ఇలాంటి చిల్లరపనిలో భాగంగా… చైనా సైన్యం ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేసిన టెంటును తొలగించేందుకు వెళ్లిన కల్నల్ సంతోష్ బాబు నాయకత్వంలోని సైనికులపై.. చైనా సైన్యం ముళ్లకంచె చుట్టిన రాడ్లు, మేకులు కొట్టిన బ్యాట్లతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఊహించని ఈ పరిణామాన్ని వెంటనే ఎదుర్కొని చైనా సైనికుల్లో కొందరని మట్టుబెట్టగలిగింది కల్నల్ సంతోష్ బెటాలియన్. అయితే, ఆ సమయంలో చైనా సైనికులు ఎక్కువగా ఉండటం.. పైగా దొంగ దెబ్బ కావడంతో కల్నల్ సంతోష్ బృందం ఎక్కువగా నష్టపోయింది. అప్పుడే రంగంలోకి దిగింది భారీ టీం!

ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్న మరో భారత రెజిమెంట్.. చైనా వాళ్ల పని పట్టింది. ఈలోపు వీరికి తోడుగా మరో విధ్వంసక బృందం అక్కడకు దిగిపోయింది. వారే “ఘాతక్ కమాండోస్”. దొరికినోళ్లను దొరికినట్టుగా చీల్చి చెండాడారు.. తరిమ్మి తరిమి కొట్టారు.. ఫలితంగా చైనా సైన్యం నిలవలేక పలాయనం చిత్తగించింది. దొంగదెబ్బ అయితే ఓకే కానీ… ఇలా ఫేస్ టు ఫేస్ అంటే కష్టమని చెబుతూ పారిపోయింది! దీంతో ఈ ఘాతక్ కమాండోస్ గురించి చాలామందిలో ఆసక్తి పెరిగింది.

ప్రతి దేశానికి త్రివిధ దళాలతోపాటు అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు వీలుగా కొన్ని ప్రత్యేక దళాలు ఉంటాయి.. ఈ దళాల శిక్షణ అత్యంత కఠినంగా ఉంటుంది.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా అన్ని రకాలుగా వారికి శిక్షణ ఇస్తారు.. మరి ముఖ్యంగా నేరుగా పోరాడే ధైర్య సాహసాలు వారికి కీలకంగా ఉంటాయి. సాధారణంగా ఈ టీం లో 20 మంది ఉంటారు. వీరిలో ఒక కమాండింగ్ ఆఫీసర్ తోపాటు ఇద్దరు నాన్ కమీషన్డ్ ఆఫీసర్స్, లైట్ గన్నర్స్, స్నైపర్స్, మెడిక్స్, రేడియో ఆపరేటర్ ఉంటారు. ఇక వీరి దగ్గర అత్యాధునిక ఆయుధాలు, సామగ్రి ఉండటం, శత్రువులకు చాలా సమీపంలోకి వెళ్లి వారిపై విరుచుకుపడటం వంటి వాటివల్ల వీరు రంగంలోకి దిగితే విధ్వంసమే. ఈ స్పెషల్ టీమే మొన్న గాల్వన్ లోయలో చైనా సైనికుల విరుచుకుపడి.. తరిమి తరిమి కొట్టింది.. డ్రాగాన్ తాట తీసింది!!

Related posts

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N