NewsOrbit
రాజ‌కీయాలు

జూలై 22 ముహూర్తం ఫిక్స్..

 

జగన్ క్యాబినెట్ లో రెండు మంత్రి పదవులు ఖాళీ అవుతున్నాయి. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు ఎన్నిక కావడంతో వారు ఎమ్మెల్సీ పదవులకు దాంతో పాటు మంత్రి పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.ఇప్పటికే ఎమ్మెల్సీల రాజీనామాను ఆమోదించారు. ఇక మంత్రి పదవి కూడా ఆమోదించినున్నారు. ఈ నేపథ్యంలో కొత్త మంత్రులు ఎవరు అనేది రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. రాజీనామా చేసిన ఇద్దరు మంత్రులు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో జగన్మోహన రెడ్డి ఈ సారి ఆ సామాజిక వర్గానికే ఇస్తారా? వేరే సామాజిక వర్గానికి కేటాయిస్తారా? ఎస్సీ ఎస్టీలకు అవకాశం కల్పిస్తారా? మైనార్టీ లకు కేటాయిస్తారా? అనే సందేహాలు నెలకొన్నాయి. అయితే తాజాగా వీటిపై అందుతున్న సమాచారం ప్రకారం.. ఆ రెండు మంత్రి పదవులను మళ్లీ బీసీలకే ఇవ్వాలి అని జగన్మోహన రెడ్డి భావిస్తున్నారట.

ఎలాగూ మరో ఏడాదిన్నరలో అంటే ముఖ్యమంత్రి గా ప్రమాణం చేసినప్పుడే జగన్మోహన రెడ్డి రెండున్నర సంవత్సరాల తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని, 90శాతం మంత్రులను మారుస్తామని చెప్పారు. సో.. ఇప్పుడు కొత్తగా ఇద్దరు మంత్రులను తీసుకున్నప్పటికీ మరో ఏడాదిన్నర తర్వాత లేదా ఏడాది తరువాత మంత్రివర్గ ప్రక్షాళన తప్పదు. ఇప్పుడున్న ఆశావహుల జాబితాను తీసుకొని కొత్తగా వేరే సామాజికవర్గానికి ఇచ్చి ఇతర సామాజిక వర్గాల నుంచి విమర్శలు, ఆరోపణలు, అలకలు ఎదుర్కునేకంటే బీసీ సామజిక వర్గం నుండి ఇద్దరు దూరం అయిన నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరిని తీసుకుంటే ఎటువంటి రిస్క్ ఉండదని, ఎటువంటి ప్రశ్నలు తలెత్తవని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఆ పార్టీకి అనుకూల మీడియా అయిన సాక్షిలో కూడా దీన్నే ప్రస్తావిస్తూ ఈ రోజు ఒక కధనం వచ్చింది. దీనిని పరిశీలించిన సరే ఒక రకంగా కేబినెట్లోకి బీసీ వాళ్లనే తీసుకుంటారని పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లే.

అయితే ఇప్పటికే ఆశావహుల జాబితాలో చాలా మంది ఉన్నారు. ఆళ్ల రామకృష్ణా రెడ్డి, రోజా, ఆనం రామనారాయణ రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, అనంత వెంకట్రామిరెడ్డి ఇలా అనేక మంది మంత్రి పదవులు ఆశిస్తున్నారు అయితే ఈ ఆశావహులు అందరికీ కూడా మరో ఏడాది, ఏడాదిన్నర వేచి చూడండి అని జగన్ తరఫున వైసీపీ పెద్దలు కబురు పెట్టినట్టు తెలిసింది. అందుకే బీసీల్లో ఎవరు చురుగ్గా ఉన్నారో చూసుకొని వారిలో ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వనున్నారు. ఇదే నేపథ్యంలో జిల్లాల వారీగా చూసుకున్నా ఇప్పుడు రాజీనామా చేసిన ఇద్దరు మంత్రులలో ఒకరు గుంటూరు జిల్లా, మరొకరు తూర్పు గోదావరి జిల్లా కావడంతో ఆ జిల్లాలకు కోటా తగ్గకుండా ఈ జిల్లాలోనే వేరే ఎమ్మెల్యేలు తీసుకుంటారా లేదా పక్క జిల్లాలకు వెళతారా అనేది కూడా చూడాల్సి ఉంది. మొత్తానికి మంత్రివర్గ కూర్పు అంటే సామాజిక వర్గాలు, ప్రాంతాలు, జిల్లాలు వీటన్నిటిని సున్నితమైన అంశాలను పరిగణలోకి తీసుకొని చేసుకోవాల్సి ఉంది. తొలిసారిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన జగన్ మోహన్ రెడ్డి మంత్రి వర్గ కూర్పు విషయంలో ఆచితూచి ముందడుగు వేశారు. అన్ని సామాజిక వర్గాలకు మిళితం చేసి విమర్శకుల చేత కూడా ప్రశంసలు అందుకున్నారు. అటువంటి భావన కోల్పోకుండా ఉండేందుకు కూడా ఇప్పుడు బీసీల నుంచే కొత్త మంత్రులను తీసుకోవాలనే ఆలోచనలో ఉంటూనే ప్రాంతాల మధ్య విద్వేషాలు లేకుండా జాగ్రత్త పడుతున్నారని తెలుస్తోంది.

Related posts

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

కేంద్రం చేతిలోకి హైదరాబాద్.. ఇక తెలంగాణ ప‌ని ఇలా ఖ‌తం కానుందా..?

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

sharma somaraju

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!