దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మకమైన సినిమా ఆర్ ఆర్ ఆర్ తో పాటు భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చాలా సినిమాలు గత మూడు నెలలుగా చిత్రీకరణ నిలిచిపోయి ఉన్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా చిత్ర పరిశ్రమలోని ప్రముఖులందరు కలిసి మళ్ళీ తమ సినిమా షూటింగ్స్ మొదలు పెట్టుకునేందుకు పర్మిషన్స్ తెచ్చుకున్నారు. చర్చలు మీద చర్చలు జరిపి పర్మిషన్స్ తెచ్చుకున్నప్పటికి ఏ ఒక్క సినిమా సెట్స్ మీదకి వెళ్ళలేదు.
అయితే రాజమౌళి రెండు రోజులు మాక్ షూట్ నిర్వహించి అది సక్సస్ అయితే తారక్, చరణ్ లతో సెట్స్ మీదకి వెళ్ళాలని షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నారు. కాని వాతావరణం అనుకూలించకపోవడం తో పాటు కొన్ని సందేహాలు ఉండటం, కొన్ని అనుమతులు రాకపోవడంతో మాక్ షూటింగ్ నిర్వహించలేకపోయారు.
అయితే ఇప్పుడు ఆ మాక్ షూట్ లేకుండానే డైరెక్ట్ గా ఆర్ ఆర్ ఆర్ ని సెట్స్ మీదకి తీసుకు వెళ్ళాలని చూస్తున్నారు. ఇప్పటికే పూణె లో అనుకున్న షెడ్యూల్ ని గండి పేట్ ప్రాంతంలో షూటింగ్ నిర్వహించాలనుకున్నారు. అక్కడ పోలీస్ పర్మిషన్ రానందు వల్ల ఇప్పుడు నల్గొండ చుట్టు పక్కల ప్రాంతంలో లొకేషన్స్ ని చూస్తున్నారట. ఒకవేళ ఇక్కడ గనక ఒకే అయితే ఎన్.టి.ఆర్, రాం చరణ్, అజయ్ దేవగన్ లతో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మొదలు పెడతారని అంటున్నారు.
ఆర్ ఆర్ ఆర్ గనక మొదలైతే ప్రభాస్ రాధా కృష్ణ ల సినిమా, చిరంజీవి కొరటాల ఆచార్య..సుకుమార్ అల్లు అర్జున్ పుష్ప ..పూరి జగన్నాధ్ విజయ దేవరకొండ సినిమాతో పాటు నాగ చైతన్య సాయి పల్లవిల లవ్ స్టోరీ సినిమాలు బ్యాలెన్స్ షూటింగ్ జరపడానికి సిద్దమవుతారని తెలుస్తుంది.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!