NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

‘ కాసు మ‌హేష్ ‘ కు ఘోర అవమానం… ఈ సారి గుర‌జాల‌లో ద‌బిడి దిబిడే..!

రాజ‌కీయ నాయ‌కులు బాగుంటే.. బాగా ప‌నిచేస్తున్నార‌ని అనుకుంటే.. ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డ‌తారు. ఈ విష‌యంలో మ‌రో మాటే లేదు. కానీ, చిన్న తేడా వ‌చ్చినా.. అదే ప్ర‌జ‌లు ఛీ కొడ‌తారు. గుర‌జాల నియోజ‌క‌వ ర్గంలో ఇప్పుడు అధిదికార పార్టీ నాయ‌కుడు, ప్ర‌స్తుత ఎమ్మెల్యే విష‌యంలో ప్ర‌జ‌లు ఇదే ప‌నిచేస్తున్నార‌ని టాక్‌. సుదీర్ఘ వార‌స‌త్వం.. అంత‌క‌న్నా.. బ‌ల‌మైన నిజాయితీప‌రులైన కుటుంబం అని పేరున్న కాసు ఫ్యామిలీ నుంచి మూడోత‌రం నాయ‌కుడిగా కాసు మ‌హేష్‌రెడ్డి అరంగేట్రం చేశారు.

ఇంత‌కుముందు.. ఆయ‌న తాత‌గారు.. కాసు బ్ర‌హ్మానంద‌రెడ్డి ఏకంగా ముఖ్య‌మంత్రి చేశారు. త‌ర్వాత‌.. ఆ యన తండ్రి కాసు వెంక‌ట‌కృష్ణారెడ్డి మంత్రిగా ప‌నిచేశారు. ఈయ‌న కుమారుడిగా రాజ‌కీయ ప్ర‌వేశం చేసిన కాసు మ‌హేష్ రెడ్డి కూడా.. ఇదే వార‌స‌త్వాన్ని నిల‌బెడ‌తార‌ని గుర‌జాల ప్ర‌జ‌లు భావించారు. అంత‌కుమిం చి.. గుంటూరు ప్ర‌జ‌లు కూడా ఆశ‌లు పెట్టుకున్నారు. ఈ సింప‌తీనే ప్ర‌ధానంగా.. గ‌త ఎన్నికల్లో కాసు విజ‌యానికి దారి తీసింది. కాసు కుటుంబం పెద్ద‌రికాన్ని నిల‌బెడ‌తార‌ని అనుకున్న వారు.. ఆయ‌న వెంట న‌డిచారు.

అయితే.. ఎన్నికల్లో గెలిచిన త‌ర్వాత‌.. కాసు కుటుంబానికి ఉన్న ప‌రువు, మ‌ర్యాద‌ల సంగ‌తి ఎలా ఉన్నా.. చిల్లర చేష్ఠ‌ల‌తో వ్య‌వ‌హ‌రించార‌ని.. కాసు కుటుంబంతో మూడు త‌రాలుగా సంబంధం ఉన్న సీనియ‌ర్లు చెబుతున్నారు. ఎవ‌రితోనూ క‌ల‌వ‌క‌పోవ‌డం.. అయిన దానికీ కానిదానికీ ఘ‌ర్ష‌ణ‌ల‌కు దిగ‌డం.. కులాల ప్రాతిప‌దిక‌న అప్పాయింట్‌మెంట్లు ఇవ్వ‌డం.. ఏదైనా స‌మ‌స్య ప్ర‌స్తావిస్తే.. రాజ‌కీయ రంగులు పుల‌మ‌డం వంటివి కాసుకు మైన‌స్‌లుగా మారిపోయాయి. ఆ మాట‌కు వ‌స్తే అస‌లు కాసు కోసం త‌న సీటు త్యాగం చేసిన బీసీ నేత‌.. కాక‌లు తీరిన రాజ‌కీయ యోధుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణ‌మూర్తినే ఎంత ఘోరంగా అవ‌మానించారో అంటూ బీసీలు ర‌గిలిపోతున్నారు.

ఈ ప‌రిణామాలే ఇప్పుడు పెద్ద విప‌త్తుగా సంభవించాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. సాధార‌ణంగా.. కాసు కుటుంబాన్ని చూసి గ‌త ఎన్నిక‌ల్లో మ‌హేష్ రెడ్డికి ఓటేసేవారు కూడా.. ఇప్పుడు ఆ వంశ గౌర‌వాన్ని త‌గ్గించారంటూ.. పెద‌వి విరుపులు విరుస్తున్నారు. క‌నీసం.. త‌న వ‌ర్గం వారికి కూడా చేరువ‌లో ఉండ‌కుండా.. అంద‌రినీ దూరం చేసుకున్నారు. చివ‌ర‌కు సొంత కులం రెడ్ల‌లో కూడా న‌లుగురైదుగురు మిన‌హాయిస్తే ఎవ్వ‌రికి ఏ సాయం చేయ‌లేద‌న్న అస‌మ్మ‌తితో వారంతా ర‌గిలిపోతున్నారు. ఇవ‌న్నీ ఆ సారి గుర‌జాల‌లో కాసుకు ద‌బిడి దిబిడిలా మారిపోయాయి. కాసు గెల‌వ‌డం కాదు క‌దా.. టీడీపీ య‌ర‌ప‌తినేనికి ఓ మోస్త‌రు పోటీ ఇచ్చే ప‌రిస్థితి కూడా లేదంటున్నారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju