NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపిలో రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్

Share

ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యవసాయ శాఖకు సంబంధించి వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో బుధవారం సమీక్ష జరిపారు. రబీ సీజన్ కు సంబంధించి ధాన్యం సేకరణ ఏప్పిల్ 15 నుండి చేయడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు వ్యవసాయ పరికరాల పంపిణీ షెడ్యూల్ కు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏప్రిల్ నెలలో ఆర్బీకే ల్లోని 4225 సీహెచ్‌సీలకు యంత్రాలు పంపిణీ చేయాలనీ, అదే విధంగా జూలై నెలలో 500 డ్రోన్లు, డిసెంబర్ కల్లా మరో 1500 డ్రోన్లు పంపిణీ చేయాలన్నారు. జూలైలో టార్పాలిన్లు, జూలై నుండి డిసెంబర్ మధ్య మూడు విడతలుగా స్పేయర్లు పంపిణీకి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

CM YS Jagan

 

ఆర్బీకేల్లో కియోస్క్ ల సేవలు పూర్తి స్థాయిలో రైతులకు అందించాలని, దీనిపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలని సీఎం ఆదేశించారు. అలానే ఉద్యానవన పంటల మార్కెటింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సీఎం .. కొత్త తరహా ఉత్పత్తులు వస్తున్న కొద్దీ మార్కెటింగ్ ఉదృతంగా ఉండాలని చెప్పారు. దీని వల్ల రైతులు తమ పంటలను విక్రయించుకోవడానికి ఇబ్బందులు ఉండవనీ, మంచి ఆదాయాలు కూడా వస్తాయని సీఎం తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ తరహాలోనే ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్ వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. అకాల వర్షాల వల్ల పంట నష్టం పై ఎన్యుమరేషన్ స్థితి గతులపై సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.

ఎన్యూమరేషన్ జరుగుతోందనీ, ఏప్రిల్ మొదటి వారంలో నివేదిక ఖరారు చేస్తామని, ఏప్రిల్ రెండో వారానికి నష్టపోయిన రైతుల జాబితాలను విడుదల చేస్తామని సీఎంకు అధికారులు తెలిపారు. నాణ్యత లేని ఎరువులు, పురుగు మందులు, కల్తీ మందులు, కల్తీ పురుగు మందులు లేకుండా చూడాలని అధికారులను సీఎం ఆదేసించారు. ఆర్బీకే ల ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు అందించేలా నిరంతరం పర్యవేక్షణ ఉండాలని సీఎం పేర్కొన్నారు. ఇక్కడ జరిగే పొరపాట్ల వల్ల రైతుల నష్టపోయే అవకాశం ఉన్నందున ఈ కార్యక్రమంపై మరింత శ్రద్ద పెట్టాలని సీఎం జగన్ సూచించారు.

వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు లో కీలక మలుపు.. డిఐజీ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసిన సీబీఐ


Share

Related posts

తీహార్ జైలుకు నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ .. పోలీస్ కస్టడీని తిరస్కరించిన కోర్టు

somaraju sharma

KCR: కేసీఆర్ అవాక్క‌య్యేలా చేస్తున్న కాంగ్రెస్

sridhar

‘రాష్ట్రపతి దృష్టికి రాజధాని’

somaraju sharma