NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: గృహ నిర్మాణాలపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

Share

CM YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో గృహ నిర్మాణశాఖపై సమీక్ష నిర్వహించారు.   రాష్ట్రంలో హౌసింగ్ స్కీమ్ కింద ఇళ్ల నిర్మాణాల వేగాన్ని పెంచాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. ఈ సందర్భంలో అధికారులు ఇళ్ల నిర్మాణాలపై ప్రగతి నివేదికను వివరించారు. ఇప్పటికే 7.43 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు  అందించామని, ఫిబ్రవరి నాటికి మరో 5 లక్షల ఇళ్లు పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని వెల్లడించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మౌలిక సదుపాయల కల్పనలో ఎక్కడా రాజీ పడవద్దని స్పష్టం చేశారు. కరెంట్, తాగునీరు ఉన్నాయా లేదా అన్న వాటిపై ఆడిట్ చేయించాలన్నారు.  ఎక్కడ ఏ సమస్యను గుర్తించినా వెంటనే దాన్ని సరిదిద్దేలా తగిన చర్యలు తీసుకోవాలనీ ఆదేశించారు. ఇప్పటి వరకూ తీసుకున్న రుణాలపై వడ్డీ డబ్బు విడుదలకు సన్నద్దం కావాలని చెప్పారు.

టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులని ఆదేశించారు సీఎం జగన్. లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన అసోసియేషన్లు సమర్థవంతంగా పనిచేసేలా వారికి తగిన అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన లక్షల విలువైన ఆస్తిని ఎలా నిర్వహించుకోవాలన్న దానిపై వారికి అవగాహన కల్పించాలన్నారు. తద్వారా భవనాలు నిరంతరం నాణ్యతగా ఉండేలా, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోగలుగుతారన్నారు.

ఈ సమీక్షలో మంత్రి జోగి రమేష్, హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు, సీఎస్ జవహర్ రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సెక్రటరీ శ్రీలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సెక్రటరీ దీవాన్ మైదీన్, టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ వీజీ వెంకట రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Chandrababu: స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు


Share

Related posts

వావ్.. విజయ్ దేవరకొండకు ముంబైలో ఫుల్ క్రేజ్..!

Ram

స్టైలిష్ లుక్ లో రచ్చ లేపుతున్న ప్రభాస్

sowmya

డేంజ‌ర్ః క‌రోనా కాదు మీ ప్రాణాల‌కు ఇలా ఎక్కువ ముప్పు

sridhar