NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu: స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

Share

Chandrababu: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై గురువారం హైకోర్ట్ లో విచారణ జరిగింది. సీఐడీ తరుపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు ముగియడంతో బెయిల్ పిటిషన్ పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.

సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. సిమెన్స్ ఫోరెన్సిక్ ఆడిట్ లో పెద్ద కుంభకోణం జరిగిందని దృవీకరించిందన్నారు. చిన్నప్ప అనే వ్యక్తి ద్వారా మూడు 10 రూపాయల నోట్లు ఉపయోగించి హవాలా రూపంలో హైదరాబాద్ లో చంద్రబాబు వద్దకు నగదు చేరిందన్న దానికి తమ వద్ద సాక్ష్యాలు ఉన్నాయన్నారు. బోస్ అనే వ్యక్తి ఫోన్ మెసేజ్ ల ద్వారా ఈ విషయం బయటపడిందన్నారు.

బోస్, కన్వేల్కర్ మెసేజ్ ల ఆధారంగా డబ్బు హైదరాబాద్ కు చేరినట్లు తెలిసిందన్నారు. చంద్రబాబు మధ్యంతర బెయిల్ కండిషన్స్ ఉల్లంఘించి ర్యాలీలు చేశారన్నారు. ర్యాలీలు చేయడంపై తెలంగాణ పోలీసులు కేసులు కూడా పెట్టారన్నారు. చంద్రబాబు పలు అవినీతి కేసుల్లో నిందితులుగా ఉన్నారనీ, కేసు దర్యాప్తు కీలక దశలో ఉందన్నారు. చంద్రబాబు సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున బెయిల్ మంజూరు చేయవద్దని వాదనలు వినిపించారు. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి సమర్పించిన రిపోర్టుల్లో తప్పులు ఉన్నాయని అన్నారు.

ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చంద్రబాబు న్యాయవాది సిద్ధార్థ్ లూద్ర వాదనలు వినిపించారు. కేవలం మరో 4 నెలల్లో ఎన్నికల సమీపిస్తున్న వేళ చంద్రబాబును ఇరుకున పెట్టే ఉద్దేశంతోనే ఇది అంత చేస్తున్నారని అన్నారు. ఫోరెన్సిక్ ఆడిట్ ను పూర్తిగా వెరిఫై చేయలేదు అని వారే ఒప్పుకున్నారని గుర్తు చేశారు. ఫోరెన్సిక్ ఆడిట్ ను ప్రభుత్వం, సీఐడీ తయారు చేశారన్నారు. కేవలం నెలన్నర కాలంలోనే ఆరు కేసులను పెట్టడంపై ప్రభుత్వ దుర్బుద్ధి అర్థం అవుతోందన్నారు.

చంద్రబాబు హృద్రోగ, చర్మ సంబంధ సమస్యలతో బాధపడుతున్నారని వివరించారు. బెయిల్ పిటిషన్ పై విచారణ చేసినప్పుడు కేసు మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఈ కేసులో 2018 నుండి విచారణ జరిపి సాధించింది ఏమిటని ప్రశ్నించారు. ఇప్పుడు మళ్లీ విచారణ ఎందుకు అని అడిగారు. సీఐడీ డిఐజీ, ఏఏజీ లు ఢిల్లీ లో ప్రెస్ మీట్లు పెట్టి అసత్యాలు ప్రచారం చేశారనీ, ఇది అడ్వకేట్స్ ఎథిక్స్ కు విరుద్దమన్నారు. పోలీసు వ్యవస్థ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, అధికారంలో ఉన్న వారికి తొత్తులుగా వ్యవహరించకూడదన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.

Telangana BJP: వరుస వలసలు .. బీజేపీ స్వయంకృతాభిరాధమే(గా)..!


Share

Related posts

బ్రేకింగ్ : దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రలో కరోనా..! ఒక్కరోజులో ఇంత భీభత్సమా..?

arun kanna

Viral Tweet : పవన్ కళ్యాణ్ ట్రైలర్ పై బాలయ్య అభిమానుల ట్వీట్ వైరల్..

bharani jella

అఖిల్ 5 కి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ని ఫిక్స్ చేసిన సురేందర్ రెడ్డి ..!

GRK