NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP High Court: స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో నారా లోకేష్ కు హైకోర్టులో స్వల్ప ఊరట .. అప్పటి వరకూ అరెస్టు చేయొద్దని ఆదేశాలు

Share

AP High Court: స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కి ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఏపీ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 4 వరకూ లోకేష్ ను అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ హైకోర్టు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నారా లోకేష్ ఇవేళ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ముందస్తు బెయిల్ పై విచారణ సమయంలో వివరాలు అందజేయడానికి సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది ఏజీ శ్రీరాం సుబ్రమణ్యం హైకోర్టును కోరగా, అక్టోబర్ 4వ తేదీకి కేసు విచారణ వాయిదా వేసింది. అప్పటి వరకూ లోకేష్ ను అరెస్టు చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. ఫైబర్ గ్రిడ్ కేసులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను అక్టోబర్ 4వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.

అంతకు ముందు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరగ్గా కీలక పరిణామం  చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తు అధికారి ఎఫ్ఐఆర్ లో మార్పులు చేశారని ఏజీ కోర్టుకు తెలియజేశారు. లోకేష్ కు సీఆర్పీసీ 41 కింద నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. విచారణలో సహకరించకపోతే కోర్టు దృష్టికి తీసుకువస్తామని తెలిపారు. సీఆర్పీసీ 41 నిబంధనలు పూర్తిగా పాటించడం జరుగుతుందని తెలిపారు. ఈ కేసులో అరెస్టు అంశం లేకపోవడంతో హైకోర్టు .. లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది.  మరో పక్క చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. అక్టోబర్ 4వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.

CM YS Jagan: జరగబోయేది పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధమని పురుద్ఘాటించిన సీఎం జగన్


Share

Related posts

ఆంధ్ర దాటుతున్న ఫొని

somaraju sharma

Bigg Boss 5 Telugu: యాంకర్ రవి ని వదలని గుంట నక్క..!!

sekhar

అది టీడీపీ బలం కాదు .. సజ్జల ఆసక్తికర వ్యాఖ్యలు

somaraju sharma