ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్దార్ధ్ రెడ్డి టీడీపీలో చేరుతున్నారా..? ప్రచారంలో వాస్తవం ఎంత..!? ఇదీ నిజం..!!

Share

Byreddy Siddharth Reddy: వైసీపీలో యువనేతగా అటు సోషల్ మీడియాలో, బయట మంచి పేరు ఉన్న నాయకుడు బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి. సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి సోదరుడు కుమారుడు. నందికొక్కూరు ఇన్ చార్జిగా బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి ఉన్నారు. అక్కడ  వైసీపీ ఎమ్మెల్యేగా ఆర్థర్ ఉన్నారు. వీరి ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని చాలా కాలంగా వినబడుతోంది. ఇప్పుడు విషయం ఏమిటంటే..సిద్ధార్ధ రెడ్డి టీడీపీలోకి వెళుతున్నారా..?  నారా లోకేష్ తో మాట్లాడారా..? నారా లోకేష్ ను సిద్ధార్ధ రెడ్డి కలిశారా..? సిద్ధార్ధ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏమిటి..? ఇది ఎంత వరకు నిజం..? ఆయన ఎందుకు పార్టీ మారాలి అనుకుంటున్నారు..?  అనే కీలక విషయాలను పరిశీలిస్తే..

Byreddy Siddharth Reddy Joining in TDP ?
Byreddy Siddharth Reddy Joining in TDP ?

Byreddy Siddharth Reddy: ఎమ్మెల్యే ఆర్ధర్ తో  విభేదాలు

బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి టీడీపీలోకి వెళుతున్నారు అంటూ వైసీపీ వ్యతిరేక మీడియాలో ఈ రోజు ఉదయం నుండి విస్తృతంగా ప్రసారం జరుగుతోంది. అయితే బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి వైసీపీలో అసంతృప్తిగా ఉన్న మాట వాస్తమని సమాచారం. ఆయనకు అసంతృప్తిగా ఉండటానికి ప్రధాన కారణం నందికొక్కూరు ఎమ్మెల్యే ఆర్ధర్ తో  విభేదాలు ఉన్నాయి. రిజర్వుడ్ నియోజకవర్గం అయిన నందికొక్కూరులో ఇటు ఎమ్మెల్యే ఆర్ధర్ వర్గం, అటు సిద్ధార్ధ రెడ్డి వర్గంగా రెండు గ్రూపులు ఉన్నాయి. సిద్ధార్ధ్ రెడ్డి సిఫార్సులను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని సమాచారం. ఇప్పటికే ఒకరిపై మరొకరు పార్టీ అధిష్టానం దృష్టికి ఫిర్యాదులు చేసుకున్నారు. ఎన్నికల్లో అభ్యర్ధి గెలుపునకు కృషి చేసిన తనకు విలువ లేకుండా ఉందనే అసంతృప్తి బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డిలో ఉంది. బైరెడ్డి సిదార్ధ్ రెడ్డి పాణ్యం, శ్రీశైలం, కర్నూలు నియోజకవర్గాలతో పాటు పక్క జిల్లా పరిధిలోని కొన్ని ప్రాంతాల ఇటీవల మీటింగ్ లకు హాజరైయ్యారని సమాచారం.

Byreddy Siddharth Reddy: గిరిగీయడంతో ఇబ్బందులు

ఈ విషయం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో  పిలిపించి కాస్త సీరియస్ గానే హెచ్చరిక చేశారుట. వేరే నియోజకవర్గాల్లో వేలు పెట్టవద్దు, వేరే జిల్లాలకు వెళ్లి కార్యక్రమాల్లో పాల్గొనవద్దు అని పార్టీలో ఓ పెద్దాయన సీరియస్ గానే చెప్పారుట. నియోజకవర్గంలోనే ఎమ్మెల్యే వద్ద తన మాట చెల్లుబాటు కాని పరిస్థితితో అసంతృప్తిగా ఉన్న బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డికి ఇప్పుడు పార్టీ అధిష్టానం నియోజకవర్గం దాటి వెళ్లవద్దు అంటూ గిరిగీయడం నచ్చలేదుట. కానీ బైరెడ్డి సిద్దార్ద్ రెడ్డి టీడీపీలోకి వెళ్లే ఆలోచన చేయలేదు. నారా లోకేష్ ను కలవలేదు. ఆయన వైసీపీలో కొన్ని నెలలుగా అసంతృప్తితో ఉన్న మాట వాస్తవమే. ఇటీవల సీఎం జగన్ కర్నూలు పర్యటనకు వెళ్లిన సమయంలో సిద్ధార్ధ్ రెడ్డి కాస్త సైలెంట్ గా ముభావంగా ఉన్న విషయం వాస్తవమే.

ఆ మూడు నియోజకవర్గాల్లో పెత్తనం ఇస్తే..?

తన అసంతృప్తి, అసమ్మతి పై సన్నిహితుల వద్ద మాట్లాడుతున్నారే కానీ పార్టీ మార్పు అంశం ఎక్కడా ప్రస్తావించలేదు. టీడీపీ వాళ్లను కలవలేదు అన్నది వాస్తవం. అయితే వైసీపీలో ఇదే తరహా పరిస్థితులు, అవమానాలు కొనసాగితే పార్టీ మార్పునకు ఆలోచించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే ప్రస్తుతం మాత్రం అటువంటి ఆలోచన ఏమీ లేదని తెలుస్తొంది. మరో విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో  బైరెడ్డి కుటుంబానికి నందికొక్కూరు, పాణ్యం, శ్రీశైలం నియోజకవర్గాల్లో ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి ఉంటే టీడీపీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని సమాచారం.


Share

Related posts

NTR: ఎన్టీఆర్ ఊసరవెల్లి సినిమా.. ఫస్ట్ చేయాల్సిన హీరో ఎవరో తెలుసా..??

sekhar

Black fungus: బ్లాక్ ఫంగ‌స్ భ‌య‌పెడుతోంది … బెడ్లు ఫుల్ అంటూ….

sridhar

యాక్సిస్ బ్యాంక్ కిసాన్ క్రెడిట్ కార్డు.. ఎన్నో ప్ర‌యోజ‌నాలు..!

Srikanth A
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar